అమెరికాలో దూసుకెళుతున్న యాపిల్ వాచ్ ప్రీఆర్డర్లు

Posted By:

యాపిల్ మొట్టమొదటి స్మార్ట్‌వాచ్ ‘యాపిల్ వాచ్'కు సంబంధించిన ప్రీఆర్డర్లు శుక్రవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమైన మొదటి రోజే ఈ వాచ్‌ను యూఎస్ మార్కెట్లో 9,57,000 మంది బుక్ చేసుకున్నట్లు ఓ నివేదిక పేర్కొంది.

 అమెరికాలో దూసుకెళుతున్న యాపిల్ వాచ్ ప్రీఆర్డర్లు

యాపిల్ వాచ్ ప్రీఆర్డర్లు అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, యూకే, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్ ఇంకా జపాన్ దేశాల్లో ప్రారంభమయ్యాయి.. ఆర్డర్ చేసిన వారికి ఏప్రిల్ 24వ తేదీ నుంచి వాచ్‌లను పంపిణి చేస్తామని యాపిల్ వెల్లడించింది. ఆయా దేశాల్లోని యాపిల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంచిన యాపిల్ వాచ్‌లను పరిశీలించి తద్వారా తమకు నచ్చిన వేరియంట్‌ను బుక్ చేసుకోవచ్చు.

 అమెరికాలో దూసుకెళుతున్న యాపిల్ వాచ్ ప్రీఆర్డర్లు

యాపిల్ వాచ్ భారత్‌లో ఎప్పుడంటే..? యాపిల్ స్మార్ట్‌వాచ్‌లు జూన్-జూలై నాటికల్లా భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. భారత విపణిలో ప్రాథమిక మోడల్ యాపిల్ స్మార్ట్‌వాచ్ ధర రూ.30,000 పై చిలుకు ఉండొచ్చని ఓ అంచనా. గోల్డ్, అల్యూమినియం ఇంకా స్టీల్ వేరియంట్‌లలో యాపిల్ తన వాచ్‌లను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి: విశ్వం పుట్టుక మొదలుకుని...

English summary
Apple Watch U.S. Pre-Orders Hit 1M On Launch Day, Says Data Firm. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting