వరుస కేసులతో బిత్తరపోతున్న ఆపిల్

Written By:

ఎఫ్‌బీఐ వ్యవహారంతో మొన్నటిదాకా తలపట్టుకున్న ఆపిల్ కు ఇప్పడు మరో సమస్య వచ్చి పడంది. ఆ సమస్య మీద కిందా మీదా పడి ఎలాగోలా సహాయం చేస్తామంటే ఎఫ్‌బీఐ కి చెప్పడంతో సమస్య కాస్తా సద్దుమణిగిన విషయం విదితమే. అయితే ఆపిల్ సహయం చేసే లోపే ఎఫ్‌బీఐ మూడో పార్టీ సహయంతో ఆ ఫోన్ అన్‌లాక్ చేసింది. ఇప్పుడు మళ్లీ ఐ ఫోన్ అన్‌లాక్ చేయాలంటూ కోర్టులో కేసు వేశారు.

Read more: ఐఫోన్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

యాపిల్ ఐ ఫోన్ వాడే వారిలో అధికశాతం దానిలో ఉన్న ఫీచర్స్‌లో ముఖ్యంగా ప్రైవసీకే ప్రాధాన్యతనిస్తారు. అయితే ప్రస్తుతం అదే విషయంలో యాపిల్ సంస్థ సవాళ్ళపై సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తోంది.

2

అమెరికా బాంబుదాడి టెర్రరిస్టు ఐ ఫోన్ 5ఎస్ పే తెరిచేందుకు యాపిల్ సంస్థ సహాయాన్ని కోరిన ఎఫ్ బీఐ.. న్యాయపోరాటాన్ని చేసింది. అన్‌లాక్‌కు ఐఫోన్ సంస్థ నిరాకరించడంతో థర్డ్ పార్టీ సహాయంతో విజయవంతంగా తెరిచేందుకు ప్రయత్నించి సక్సెస్ అయింది.

3

అక్కడ మొదలైన కథతో యాపిల్ ఫోన్ సీక్రెట్‌ను పటాపంచలు చేసేందుకు పలు సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించి, చివరికి ఓ సంస్థ ఐపీ బాక్స్ ద్వారా ఐఫోన్‌ను అన్‌లాక్ చేసి విజయం సాధించింది.

4

ఇప్పుడు తాజాగా మరో సమస్య ప్రారంభమైంది. ఓ మాదక ద్రవ్యాల డీలర్ ఐ ఫోన్ ను అన్‌లాక్ చేయాలంటూ బ్రూక్లిన్‌లోని ఓ ఫెడరల్ న్యాయమూర్తిని ప్రాసిక్యూటర్లు కోరడంతో మళ్ళీ అన్‌లాక్ సమస్య తెరపైకి చ్చింది.

5

ఇప్పటికే యాపిల్ ఐ ఫోన్లను ఛేదించలేకపోతున్నామని ఐ ఫోన్ 5ఎస్ తెరిచే విషయంలో ఎఫ్‌బీఐ చెప్పినా... ప్రాసిక్యూటర్లు మరోసారి అన్‌లాక్ విషయం తెరపైకి తేవడం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

6

అయితే ప్రభుత్వ సూచనలు, వారెంట్లు ఉన్నపుడు ఫోన్‌లోని డేటాను తెలుసుకునేందుకు యాపిల్ సహాయం అవసరం అవుతుందని న్యాయవాదులు పేర్కొన్నారు.

7

ప్రస్తుత డ్రగ్ డీలర్ కేసు విషయంలో యాపిల్ సహాయం తప్పదని, అంతేకాక కోర్టులో ఉన్న ఇంకా సుమారు 70 కేసుల్లో ఐవోఎస్ 7 రన్ చేస్తున్న ఫోన్లను డేటా కోసం తెరవాల్సిన అవసరం పడుతుందని చెప్తున్నారు.

8

మరి.. డ్రగ్ వ్యాపారి ఫోన్ అన్‌లాక్ విషయంలో యాపిల్ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apple’s Help Required To Unlock Drug Dealer’s iPhone
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot