డ్యూయెల్ సిమ్ ఫోన్లు ఎంత డేంజరో తెలుసా..?
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ కామన్ అయిపోయింది. అది సింగిల్ సిమ్ ఉండే ఫోన్లు కాకుండా డ్యూయెల్ సిమ్ ఫోన్లు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ కామన్ అయిపోయింది. అది సింగిల్ సిమ్ ఉండే ఫోన్లు కాకుండా డ్యూయెల్ సిమ్ ఫోన్లు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. రెండు సిమ్ లు అయితే ఒకటి డేటా కోసం మరొకటి కాల్స్ కోసం వాడేస్తుంటారు. అయితే ఈ డ్యూయెల్ సిమ్ ఫోన్లు చాలా ప్రమాదమని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. సింగిల్ సిమ్ ఫోన్ల వాడకం బెస్ట్ అని చెబుతున్నారు.
జియో బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా..?

రేడియేషన్ ప్రమాదం
డ్యూయెల్ సిమ్ వల్ల రేడియేషన్ ప్రమాదం భారీ స్థాయిలో ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

రెండు సిమ్ లు
రెండు సిమ్ లు సెల్ ఫోన్ టవర్స్ తో కమ్యూనికేషన్ అయ్యే సమయంలో రేడియో ప్రీక్వెన్సీ రేడియేషన్ భారీస్థాయిలో వెలువడుతుంది. ఇది సింగిల్ సిమ్ ఫోన్లో చాలా తక్కువగా ఉంటుంది.

మనిషిని అనేక రోగాలు
ఈ రేడియేషన్ వల్ల మనిషిని అనేక రోగాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా వీర్యకణాలు దెబ్బతింటాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక నిద్రలో పక్కన పెట్టుకోవడం వల్ల కూడా రేడీయేషన్ దెబ్బకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రేడియేషన్ 40 నుంచి 80 శాతం వరకు
మీరు ఫోన్ మాట్లాడుతున్నా లేకుంటే పక్కన పెట్టినా రేడియేషన్ అనేది వెలువడుతూనే ఉంటుంది. ఆ రేడియేషన్ 40 నుంచి 80 శాతం వరకు డ్యూయెల్ సిమ్ ఫోన్ల నుంచి వెలువడుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

డ్యూయెల్ సిమ్ ఫోన్లు కొనేముందు
కాబట్టి డ్యూయెల్ సిమ్ ఫోన్లు కొనేముందు కొంచెం ఆలోచించి కొనుక్కోమని వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications