గొప్ప గేమింగ్ ఫీచర్లతో ఆసుస్ ROG ఫోన్ 2

|

ఆసుస్ ROG ఫోన్ 2ను ఇండియాలో అధికారికంగా ప్రారంభించబడింది. గత సంవత్సరం ఆసుస్ నుండి వచ్చిన ఆసుస్ ROG ఫోన్‌కు అప్డేట్ గా ఈ కొత్త ఆసుస్ ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మరింత వేగంగా, అధిక ర్యామ్ మరియు స్టోరేజ్, ఇంకా పెద్ద బ్యాటరీ ఫీచర్లతో వస్తున్నది. కొత్త ROG ఫోన్ 2 కొన్ని చిన్న డిజైన్ మెరుగుదలలను కూడా తీసుకువచ్చింది.

ధరల వివరాలు
 

ధరల వివరాలు

ఆసుస్ నుండి వచ్చిన రెండవ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్ లలో లభిస్తుంది. ఇందులో 128 జీబీ స్టోరేజ్‌ మరియు 8 జీబీ ర్యామ్‌ యొక్క వేరియంట్ ధర 37,999 రూపాయలు. ఇందులో 12 జీబీ ర్యామ్ మరియు 512 జీబీ స్టోరేజ్ గల వేరియంట్‌ ధర 59,999 రూపాయలు.

ఆఫర్స్ వివరాలు

వీటి యొక్క అమ్మకాలు సెప్టెంబర్ 30 నుండి 12:00 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభమవుతుంది. ఆఫర్లలో బాగంగా ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై 10 శాతం తగ్గింపు ఉంటుంది. ROG ఫోన్ 2 నుబియా రెడ్ మ్యాజిక్ 3 మరియు బ్లాక్ షార్క్ 2 స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడనుంది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

ఆసుస్ ROG ఫోన్ 2 దాని డిజైన్ పరంగా చాలా భిన్నంగా ఉంది. ఇది ఇప్పటికీ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ గల 6.59-అంగుళాల AMOLED డిస్ప్లేతో పాటు అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఇది 120Hz డిస్ప్లేని కలిగి ఉంది. ఇది ఇప్పటివరకు ఏ స్మార్ట్‌ఫోన్‌లోను లేని వేగవంతమైన రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. దీని యొక్క డిస్ప్లే 2340 x 1080 పిక్సెల్స్ మరియు 19.5: 9 కారక నిష్పత్తితో గల ఫుల్ HD + రిజల్యూషన్‌ మద్దతుతో వస్తుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్స్:దిమాక్ ఖరాబ్ ఆఫర్స్

కెమెరా
 

ఈ స్మార్ట్‌ఫోన్‌ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855+ SoC నుండి శక్తిని తీసుకుంటుంది. ఇది 12GB RAM మరియు 128GB / 256GB / 512GB స్టోరేజ్ ఆప్షన్లతో వస్తుంది. ఫోటోగ్రఫీ విభాగంలో దీని యొక్క వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మరియు 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. అలాగే ముందు భాగంలో f / 2.2 ఎపర్చర్‌తో 24 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ కూడా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ Wi Fi 802.11ac, బ్లూటూత్, GPS, NFC మరియు 4G VoLTE మరియు డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్లకు మద్దతు ఇస్తుంది. ఫోన్‌లో రెండు యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌లు కూడా ఉన్నాయి.

4 లక్షల బీమాను అందిస్తున్న ఎయిర్‌టెల్ RS.599 ప్రీపెయిడ్ ప్లాన్

బ్యాటరీ

ఈ ఫోన్‌లో ప్రతేకత ఏమిటంటే కంపెనీ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించడం. ఈ బ్యాటరీ ఏడు గంటల వరకు గేమింగ్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరంగా బ్యాటరీ లైఫ్ ను అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది క్విక్ ఛార్జ్ 4.0 తో పాటు 30W ROG హైపర్‌ఛార్జ్‌కి కూడా మద్దతు ఇస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Asus ROG Phone 2 Launched in India: Price, Sale Date, Specs and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X