Home
News

మతిపోయే ఆఫర్లతో ఇండియాలో ఒప్పో రెనో 2 సేల్స్

ఒప్పో రెనో 2 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఇండియాలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 20X జూమ్‌కు మద్దతు ఇచ్చే క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో గల ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల దేశంలో విడుదల చేశారు. ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ మాదిరిగానే ఒప్పో రెనో 2 కూడా సెల్ఫీల కోసం షార్క్-ఫిన్ స్టైల్ రైజింగ్ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

ఒప్పో

ఒప్పో రెనో 2 అల్ట్రా స్టేబుల్ వీడియో మోడ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా పనిచేసే AI HDR మరియు AI బ్యూటీ మోడ్ వంటి లక్షణాలను కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఆన్‌లైన్ స్టోర్లు అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించబడడానికి అందుబాటులో ఉంది మరియు ఈ రోజు తరువాత ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కూడా అందుబాటులో ఉంటుంది.

ధరల వివరాలు

ధరల వివరాలు

ఇండియాలో ఒప్పో రెనో 2 కేవలం ఒకే ఒక వేరియంట్ అది కూడా 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లలో లభిస్తుంది. ఈ కాన్ఫిగరేషన్ లలో వున్న స్మార్ట్‌ఫోన్ యొక్క ధర 36,990 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ ఓషన్ బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. అంతేకాకుండా, ఇది అమెజాన్.ఇన్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది మరియు మీకు సమీపంలో ఉన్న ఆఫ్‌లైన్ దుకాణాలకు కూడా చేరుకుంటుంది.

ఆఫర్స్

ఆఫర్స్

ఒప్పో రెనో 2 స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకపు ఆఫర్లలో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ ఇఎంఐ లావాదేవీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. వినియోగదారులు బజాజ్ ఫిన్‌సర్వ్ ద్వారా జీరో డౌన్ పేమెంట్ ఇఎంఐ ఎంపికను కూడా పొందవచ్చు.

 

అమెజాన్

అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఒప్పో రెనో 2 స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేసే వినియోగదారులు 3,000 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా కొనుగోలు చేసిన మొదటి మూడు రోజుల్లోనే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఇఎంఐ లావాదేవీల ద్వారా 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ను మూడు, ఆరు మరియు తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలతో కొనుగోలు చేయవచ్చు.

జియో చందాదారులు

జియో చందాదారులు రూ.198 మరియు రూ.299 ప్రణాళికలపై 100 శాతం అదనపు డేటాను అందించబడుతుంది. మరోవైపు వోడాఫోన్ ఐడియా కస్టమర్లు 3,750 రూపాయల క్యాష్‌బ్యాక్, రూ. 255 రీఛార్జ్ మీద 250 జీబీ అదనపు డేటాను పొందవచ్చు. ఎయిర్‌టెల్ డబుల్ డేటా బెనిఫిట్స్ మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను రూ.249 రీఛార్జ్ ప్లాన్ ను కూడా పొందవచ్చు.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

డ్యూయల్ సిమ్ నానో పోర్ట్స్ గల ఒప్పో రెనో 2 ఆండ్రాయిడ్ 9 పై కలర్ OS 6.1 తో రన్ అవుతుంది. ఇది 6.55-అంగుళాల ఫుల్-HD + (1,080 x 2,400 పిక్సెల్స్) డైనమిక్ AMOLED డిస్‌ప్లేను 93.1 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో కలిగి ఉంటుంది మరియు ఇది గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ మరియు డిస్ప్లే లోపల ఫింగర్ ప్రిన్స్ స్కానర్ సెన్సార్ తో వస్తుంది. వెనుకవైపు కూడా స్మార్ట్‌ఫోన్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్ట్ చేయబడి వస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730G SoC చేత శక్తిని కలిగి ఉంది. ఇది 8GB RAM మరియు 256GB స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది.

కెమెరాల

ఒప్పో రెనో 2 స్మార్ట్‌ఫోన్‌ యొక్క కెమెరాల విషయానికి వస్తే ఇందులో ఫోటోలు మరియు వీడియోల కోసం ఒప్పో రెనో 2 యొక్క వెనుక వైపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్‌ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ సహాయంతో 2x ఆప్టికల్ జూమ్, 5x హైబ్రిడ్ జూమ్ మరియు 20x డిజిటల్ జూమ్ మద్దతుతో వస్తుంది. కెమెరా సెటప్‌లో 8-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా 116-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో మరియు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్‌ను కలిగి ఉంది. అలాగే సెల్ఫీల కోసం ముందుభాగంలో షార్క్-ఫిన్ స్టైల్ ఎలివేటింగ్ కెమెరా మాడ్యూల్‌లో 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది.

రెనో

ఒప్పో రెనో 2 సున్నితమైన యూజర్ అనుభవాన్ని అందించడానికి హైపర్ బూస్ట్ 2.0, ఫ్రేమ్ బూస్ట్ మరియు టచ్ బూస్ట్ టెక్నాలజీలతో ప్రీలోడ్ చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఫోన్ VOOC ఫ్లాష్ ఛార్జ్ 3.0 టెక్‌కు మద్దతు ఇచ్చే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo Reno 2 Sale Start Today in India via Amazon and Flipkart: Price, availability, offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X