సెల్ఫీలు దిగనిదే పూట గడవదట

Posted By:

యువతీ యువకులలో రోజు రోజుకు సెల్ఫీ పిచ్చి ముదిరిపోతోంది.. సెల్పీ కోసం ప్రాణాలనే పనంగా పెడుతున్నారు.చావు అంచుల మధ్యకు వెళ్లి సెల్ఫీలు దిగి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు...రోజుకు కనీసం 14 సెల్ఫీలు దిగనిదే ఎవరికీ నిద్ర కూడా పట్టడం లేదట..ఇక పెద్ద వయస్సు వారు కూడా పిల్లలకి ఏ మాత్రం తీసిపోమన్నట్లుగా సెల్ఫీలో చాలా యాక్టివ్ గా ఉన్నారట. ఈ విషయం గూగుల్ సర్వేలో వెల్లడయింది. ఇంకా సెల్పీల పిచ్చి ఎలా ఉందో చూడండి.

Read more : 6 నిమిషాల్లో బ్యాటరీ పుల్‌ ఛార్జింగ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రోజుకు 14 సెల్ఫీలు

కొందరు దీన్ని పిచ్చి అనుకోవచ్చు. మరికొందరు వ్యసనం అనుకోవచ్చు. ఏదయితేనేమిగాని యువత సాధారణంగా రోజుకు 14 సెల్ఫీలు క్లిక్ మనిపించే దాకా నిద్రపోరట.సెల్ఫీలు తీసుకునేవారిలో యవ్వన వయసు వారిదే అగ్రస్థానం.

గూగుల్ సర్వే

ప్రపంచ వ్యాప్తంగా జరిగిన గూగుల్ సర్వేలో ఇదే విషయాన్ని వెల్లడించారు.

14 సెల్ఫీలు,16 ఫోటోలు

రోజులో సుమారు 11 గంటలకు పైగా మొబైల్ వినియోగిస్తున్న వారు దాదాపు 14 సెల్ఫీలు,16 ఫోటోలు లేదా కొన్ని వీడియోలు తీసుకుంటారని గూగుల్ సంస్థ నిర్వహించిన సర్వే లో వెల్లడయింది.

21 సార్లు ఓపెన్

సోషల్ మీడియా వెబ్ సైట్లు ఫేస్ బుక్ ,ట్విట్టర్,ఇతర ఖాతాలను 21 సార్లు ఓపెన్ చేస్తుంటారని 25 టెక్ట్స్ మెసేజ్ లు పంపుతారని పరిశోధనలో తేలింది.

నాలుగు ఫోటోలు, ఓ వీడియో

ఇదిలా ఉండగా నడి వయస్కులు,అంతకంటే పెద్ద వయసున్నవారు మాత్రం రోజుకు నాలుగు ఫోటోలు ఓ వీడియో 2 నుంచి నాలుగు సెల్ఫీలు తీసుకుంటారట.

6.9 ఫోటోలు,ఓ వీడియో,4 నుంచి 7 సెల్ఫీలు

టీనేజి వాళ్లయితే 6.9 ఫోటోలు,ఓ వీడియో,4 నుంచి 7 సెల్ఫీలు తీసుకుంటారు.

సెల్ఫీ ఓ మానసిక రుగ్మత

ఈ నేపధ్యంలో గూగుల్ ఓ ఫోటో యాప్ ను విడుదల చేసింది. మరీ అధికంగా సెల్ఫీలు తీసుకోవడం ఓ మానసిక రుగ్మత గానే భావించాలని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

కిమ్ కర్దాషియన్ సెల్ఫీ

కిమ్ కర్దాషియన్ సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఓ ఏనుగు దాడికి గురైన విషయం విదితమే.

ప్రమాదాలు

కానీ సెల్ఫీలు వినూత్నంగా తీసుకోవడానికి యత్నించి చాలామంది ప్రమాదాలు కొని తెచ్చకుంటున్నారు.

సెల్పీల పిచ్చి

సో సెల్పీల పిచ్చి ముదిరి పాకాన పడకముందే దాని నుంచి బయటపడటం చాలా మంచిది.

హీరోలు, హీరోయిన్లు కలిసి దిగిన సెల్ఫీ

86 సంవత్సర ఆస్కార్ అవార్డుల సమయంలో హీరోలు, హీరోయిన్లు కలిసి దిగిన సెల్ఫీ  

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
ome call it a craze and a few even term it as a ‘disorder’, but an average youth clicks as many as 14 selfies a day, a study by tech giant Google said.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot