దానగుణంలో కర్ణుడిని మించిపోయిన ప్రేమ్‌జీ

Written By:

దేశంలో అత్యంత ఉదారవాదిగా అలాగే ఎక్కువ సంపదను దానం చేసిన వ్యక్తిగా విప్రో చైర్మెన్ అజీమ్ ప్రేమ్‌జీ వరుసగా మూడో ఏడాది అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. తినడానికి ఉంటే చాలు అన్నట్లుగా తన ఆస్తిలో చాలా భాగం అజీమ్ ప్రేమ్‌జీ సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నాడు. అజీమ్ ప్రేమ్ జీ పౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటున్న ఈ గొప్ప దానకర్ణుడు మరోసారి ఎక్కువ సంపదను దానం చేసిన దాన కర్ణుల లిస్ట్ లో ఫస్ట్ స్థానంలో నిలవడం చాలా గొప్ప విషయం. ఇండియాలోనే అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ ఈ లిస్ట్ లో 6 స్థానంలో నిలిచారు.ఎవరెవరు ఎంత దానం చేసారో ఓ సారి చూద్దాం. 

Read more : నాసా డ్రైవర్‌లెస్ కార్లకు రోవర్ సాఫ్ట్‌వేర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అజీమ్ ప్రేమ్‌జీ వరుసగా మూడో ఏడాదీ అగ్రస్థానంలో

దేశంలో అందరికంటే ఎక్కువ సంపదను దానం చేసిన వ్యక్తిగా విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ వరుసగా మూడో ఏడాదీ అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోని పేదలకు విద్యనందించేందుకు అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ కృషి చేస్తున్నది. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఈ ఫౌండేషన్ 3.50 లక్షల పాఠశాలలను నిర్వహిస్తున్నది.

నందన్ నీలేకనీ, ఆయన భార్య రోహన్ నీలేకని

నందన్ నీలేకనీ, ఆయన భార్య రోహన్ నీలేకని, ఇతర కుటుంబ సభ్యులు ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచారు. వీరు పట్టణ ప్రభుత్వ యంత్రాంగం, విధానాలు, విద్య కోసం రూ. 2,404 కోట్ల మేర విరాళంగా ఇచ్చారు.

నారాయణమూర్తి కుటుంబం మూడో స్థానంలో

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతోపాటు సామాజికాభివృద్ధి, విద్య అవసరాల కోసం ఇప్పటివరకు రూ .1,322 కోట్లు దానం చేసిన నారాయణమూర్తి కుటుంబం మూడో స్థానంలో ఉంది.

నాలుగవ స్థానంలో దినేష్ అండ్ ప్యామిలీ

నాలుగవ స్థానంలో దినేష్ అండ్ ప్యామిలీ నిలిచింది. వీరి కుటుంబం దానకార్యక్రమాలకు 1238 కోట్ల రూపాయలన ఖర్చు పెడుతోంది.

దేశంలో అందరికంటే ధనికుడిగా పేరున్న

దేశంలో అందరికంటే ధనికుడిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి హురున్ దాతృత్వ జాబితాలో ఆరోస్థానం దక్కింది. ఆయన ఆరోగ్య సంరక్షణ రంగానికి రూ .345 కోట్లు దానం చేశారు.

హెచ్‌సీఎల్ చైర్మన్ శివనాడార్ రూ .535 కోట్లతో

ఈ లిస్ట్‌లో టాప్ స్థానాల్లో నిలిచిన ప్రముఖ వ్యాపారవేత్తల్ల్లో హెచ్‌సీఎల్ చైర్మన్ శివనాడార్ రూ .535 కోట్లతో 5వ స్థానంలో నిలిచారు

ఏడవ స్థానంలో మరో దిగ్గజం సన్నీ వర్కీ ఫ్యామిలీ

ఏడవ స్థానంలో మరో దిగ్గజం సన్నీ వర్కీ ఫ్యామిలీ నిలిచింది. జెమ్స్ కు సంబంధించిన వ్యాపార సామ్రాజ్యంలో ఈయన అగ్రగామిగా వెలుగొందుతున్నారు. ఈయన దాన కార్యక్రమాలకు 1238 కోట్లను వినియోగిస్తున్నారు.

రూ. 158 కోట్లతో రోనీ స్క్రూవాలా 8వ స్థానంలో

రూ. 158 కోట్లతో రోనీ స్క్రూవాలా 8వ స్థానంలో నిలిచారు

9 వ స్థానంలో రాహుల్ బజాజ్ అండ్ ఫ్యామిలీ

ఇక 9 వ స్థానంలో రాహుల్ బజాజ్ అండ్ ఫ్యామిలీ నిలిచింది. వీరు రూ .139 కోట్లు దాన కార్యక్రమాలకు వినియోగించారు

టాప్ టెన్ లో మరో దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ

టాప్ టెన్ లో మరో దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ చోటు దక్కించుకున్నారు.ఈయన రూ. 96 కోట్లు దాన కార్యక్రమాలకు వినియోగించి 10వ స్థానంలో నిలిచారు.

నవంబర్ 1, నుంచి అక్టోబర్ 31 2014, 2015 మధ్యకాలంలో

నవంబర్ 1, నుంచి అక్టోబర్ 31 2014, 2015 మధ్యకాలంలో ఇచ్చిన విరాళాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు హురున్ వెల్లడించింది. రూ .10 కోట్లు అంతకంటే అధికంగా విరాళమిచ్చినవారి జాబితాలో ఈసారి 36 మంది ఉన్నారు.

ఈసారి జాబితాలో కొత్తగా 12 మందికి

గతేడాది లిస్ట్‌లో వీరి సంఖ్య 50 గా ఉంది. ఈసారి జాబితాలో కొత్తగా 12 మందికి చోటు దక్కగా .. 26 మంది స్థానాలు కోల్పోయారు.

అత్యంత పిన్నవయస్కుడుగా రోహన్ మూర్తి

దానగుణం చాటుకున్న వారిలో అత్యంత పిన్నవయస్కుడుగా రోహన్ మూర్తి నిలిచారు. 32 ఏండ్ల రోహన్ .. రూ .35 కోట్లు విరాళంగా ఇచ్చారు.

మరిన్ని అప్‌డేట్ పొందండి

టెక్నాలజీ గురించి మరిన్నిఅప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Azim Premji the ‘most generous Indian’ in Hurun India Philanthropy List 2015
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot