BSNL Bharat Fibre బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్!! ఈ ప్లాన్‌లు తొలగించబడ్డాయి...

|

ఇండియాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఏకైక టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ యొక్క సొంత ఇంటర్నెట్ సేవలను 'భారత్ ఫైబర్' తో అందిస్తున్నది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) నేటి నుండి కొన్ని ఫైబర్ ప్లాన్‌లను నిలిపివేస్తున్నది. బిఎస్ఎన్ఎల్ సంస్థ తన వినియోగదారులకు అక్టోబర్ 1, 2020 నుంచి ఫైబర్ బేసిక్, ఫైబర్ వాల్యూ, ఫైబర్ ప్రీమియం మరియు ఫైబర్ అల్ట్రా వంటి నాలుగు ఫైబర్ ప్లాన్‌లను అందించడం ప్రారంభించింది.

బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్

ఈ నాలుగు ప్లాన్‌లు ఇప్పటిలో అనేక యాప్ ల సమ్మేళనంతో లభించేవి. అయితే ఈ రోజు నుండి బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ వినియోగదారులు ఫైబర్ బేసిక్ ప్లస్ మరియు ఫైబర్ ప్రీమియం ప్లస్ అనే రెండు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను మాత్రమే ఎంచుకోవడానికి అవకాశం ఉంది. ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్‌ నెలకు రూ.599 ధర వద్ద, ఫైబర్ ప్రీమియం ప్లస్ ప్లాన్‌ నెలకు రూ.1,277 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ ఆఫర్‌ల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

బిఎస్ఎన్ఎల్ ఫైబర్ బేసిక్ ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ ఫైబర్ బేసిక్ ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ఫైబర్ బేసిక్ ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలకు రూ.599 (పన్ను మినహాయించి) ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లు 60Mbps డౌన్‌లోడ్ / అప్‌లోడ్ వేగంతో 3.3TB లేదా 3,300GBu డేటాను పొందుతారు. FUP డేటాను వినియోగించిన తరువాత, వినియోగదారులు 2 Mbps వేగంతో అపరిమిత డేటాను బ్రౌజింగ్ చేయడాన్ని కొనసాగించవచ్చు. వినియోగదారులు ఈ ప్లాన్ తో అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాన్ని కూడా అదనంగా పొందుతారు.

బిఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ ప్రీమియం ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ ప్రీమియం ప్లస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫైబర్ ప్రీమియం ప్లస్ ప్లాన్ నెలకు రూ.1,277 (పన్నులు మినహాయించి) ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లు 200Mbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంతో 3.3TB లేదా 3,300GB డేటాను పొందుతారు. అయితే ఈ FUP డేటా పరిమితి దాటిన తరువాత వినియోగదారులు 15 Mbps వేగంతో అపరిమిత డేటాను బ్రోజ్ చేయడానికి అనుమతిని ఇస్తుంది.

బిఎస్‌ఎన్‌ఎల్ తొలగించిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

బిఎస్‌ఎన్‌ఎల్ తొలగించిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

బిఎస్‌ఎన్‌ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు తన యొక్క వినియోగదారుల కోసం రెండు ప్లాన్‌లను మాత్రమే ఆఫర్ చేస్తున్నది. సంస్థ తొలగించిన ప్లాన్ లలో ఒకటైన 'ఫైబర్ బేసిక్' ప్లాన్ నెలకు రూ.449 ధర వద్ద లభించేది. ఇది ఎంట్రీ-లెవల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తో వినియోగదారులకు 3.3TB లేదా 3,300GB డేటాను 30 Mbps డౌన్‌లోడ్ / అప్‌లోడ్ వేగంతో అందించేది.

బిఎస్ఎన్ఎల్

ఈ ప్లాన్‌లను మొదట డిసెంబర్ 29న నిలిపివేయాలని నిర్ణయించారు. అయితే వీటికి గల డిమాండ్ కారణంగా బిఎస్ఎన్ఎల్ వీటి లభ్యతను ఏప్రిల్ 4, 2021 వరకు పొడిగించింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మరియు జియోఫైబర్ అందించే ఎంట్రీ లెవల్ ప్లాన్‌లకు గట్టి పోటీని ఇస్తున్నందున బిఎస్‌ఎన్‌ఎల్ భారత్ ఫైబర్ ప్లాన్ లు ఈ రోజు నిలిపివేయబడకుండా క్రమబద్ధీకరించబడతాయని చాలా మంది ఉహించారు. అయితే కొన్ని కారణాల వల్ల బిఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్‌లను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రెండు ప్లాన్‌లను మాత్రమే అందిస్తుంది. అయితే సంస్థ పోర్టుఫోలియోలో కొత్త ప్లాన్‌లను ఎప్పుడు చేర్చుతుందో అన్న దాని మీద టెల్కో వివరణ ఇవ్వలేదు. భారతదేశంలో పెరుగుతున్న ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ డిమాండ్‌తో బిఎస్‌ఎన్‌ఎల్ మళ్లీ త్వరలో కొన్ని అద్భుతమైన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో ముందుకు వస్తుందని మేము ఆశిస్తున్నాము.

Best Mobiles in India

English summary
Bad News For BSNL Broadband Users!! Bharat Fibre Entry-Level Broadband Plans Discontinues

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X