Online Rummyకి బానిసైన బ్యాంక్ క్యాషియర్!!! వినియోగదారుల అకౌంటుల నుండి డబ్బు స్వాహా...
జూదం అనేది చాలా వ్యసనపరమైనది దాని జోలికి వెళ్ళవద్దు అని పెద్దలు ఎప్పుడు అంటూ ఉంటారు. జూదానికి వ్యసనమైన వారు సర్వం కోల్పొతూ ఉంటారు అని చాలా సందర్బాలలో చుస్తూఉంటారు. టెక్నాలజీ పెరగడంతో ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ జూదం అందుబాటులోకి వచ్చింది.

ఆన్‌లైన్ రమ్మీ
ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ లో ఇంటివద్ద ఉన్న వారు ఎక్కువగా ఇటువంటి ఆన్‌లైన్ రమ్మీ ఆటలకు బానిసై సర్వం కోల్పోతున్నారు. ఇటువంటి ఘటన ఆంధ్రలో క్యాషియర్ గా పనిచేస్తున్న అతనిపై పోలీసు ఫిర్యాదు నమోదు అయింది. అతను పనిచేస్తున్న బ్యాంకులో నుండి సుమారు రూ .1.56 కోట్లు ఆన్‌లైన్ రమ్మీ ఆడటానికి ట్రాన్స్ ఫర్ చేసినట్లు కేసు నమోదు అయ్యింది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:Mubadala- Jio Deal: రూ.9,093.60 కోట్ల తో జియో కొత్త డీల్, మరింత పెరిగిన మార్కెట్ వేల్యూ

పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివరాలు
వివరాలలోకి వెళితే గుంద్ర రవితేజ అనే అతను ఐదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుజివీదు శాఖలో చీఫ్ క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. అతను గత కొంత కాలంగా ఆన్‌లైన్ రమ్మీకి బానిసయ్యాడు. ఇతను ఎంతలో బానిసయ్యాడు అంటే ఈ గేమ్ ను ఆడటానికి బ్యాంకు యొక్క వినియోగదారుల స్థిర డిపాజిట్ అకౌంటుల నుండి తన వ్యక్తిగత అకౌంటుకు డబ్బును బదిలీ చేసుకునే అంతలా బానిసయ్యాడు. Also Read:Reliance Jio Hotstar Offer ను ఉచితంగా అందిస్తున్న జియో ప్యాక్‌లు ఇవే..

బ్యాంక్ మేనేజర్ వివరాలు
బ్యాంక్ మేనేజర్ మోహన్ రావు వినియోగదారుల స్థిర డిపాజిట్ అకౌంటులలో తేడాలు కనుగొన్నప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత అతను పోలీసులను సంప్రదించాడు. పోలీసుల విచారణలో క్యాషియర్ ఈ మొత్తంను దొంగలించినట్లు గుర్తించారు. గత కొన్నేళ్లుగా తేజా ఆన్‌లైన్ రమ్మీకి బానిసయిన అతను తన డబ్బులో ఎక్కువ భాగాన్ని జూదం ఆడటానికి మాత్రమే ఖర్చు చేశాడు. ఈ ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం కారణంగా అతను తన ఆస్తులను కూడా కోల్పోయాడు.

ఆన్‌లైన్ రమ్మీ ఆడటానికి ఖర్చు
క్యాషియర్‌గా పనిచేస్తున్న గుంద్ర రవితేజ ఆన్‌లైన్ రమ్మీ ఆట ఆడటానికి ఖర్చు చేసిన రూ.1,56, 56,897 మొత్తం బ్యాంకులోని వివిధ వినియోగదారుల అకౌంటుల నుండి తన అకౌంటులోకి మళ్లించడానికి ఒక సంవత్సరం పట్టిందని బ్యాంక్ మేనేజర్ రావు తెలిపారు. ఆన్‌లైన్ రమ్మీ ఆడటానికి అతను ఈ మొత్తం డబ్బును ఖర్చు చేసినట్లు బ్యాంక్ అధికారుల ప్రారంభ దర్యాప్తులో అతను అంగీకరించాడు. దీని తరువాత ఈ సంఘటన గురించి మేము స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాము అని రావు చెప్పారు.

పోలీసుల సమాచారం
నుజివీదు శాఖ ప్రాంతంలో జరిగిన ఈ కుంభకోణం గురించి వార్తలు వ్యాపించిన తరువాత, చాలా మంది కస్టమర్లు బ్రాంచ్ వద్ద గుమిగూడి, బ్యాంకు వద్ద ఉంచిన నగదు భద్రత గురించి భయాలను వ్యక్తం చేశారు. నుజివీడు ఎస్‌ఐ శ్రీనివాస్ సహాయంతో అందరిని శాంతింపజేసి వారి యొక్క నగదుకు సంబందించి భయపడవలసిన అవసరం లేదు అని హామీఇచ్చారు. బ్యాంక్ క్యాషియర్‌పై IPC 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అతను బ్యాంకు నిధులను మళ్లించిన అకౌంటుల వివరాలను తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము SI శ్రీనివాస్ తెలిపారు.


Click it and Unblock the Notifications








