Reliance Jio Hotstar Offer ను ఉచితంగా అందిస్తున్న జియో ప్యాక్‌లు ఇవే..

|

టెలికామ్ రంగంలో పెద్ద మార్పును తీసుకువచ్చిన రిలయన్స్ జియో ఇప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం విభిన్నమైన ప్రయోజనాలతో కొత్త కొత్త ప్లాన్లను ప్రారంభించే విషయంలో అందరికంటే ముందు వరుసలో ఉంటుంది.

జియో డేటా యాడ్-ఆన్ ప్యాక్‌

జియో డేటా యాడ్-ఆన్ ప్యాక్‌

జియో ప్రత్యర్థులలో ఒకరైన భారతి ఎయిర్‌టెల్ డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్యాకేజీను ఉచితంగా రూ.401 డేటా ప్లాన్‌తో అందిస్తోంది. ఇప్పుడు జియో కూడా తన నాలుగు డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లతో హాట్‌స్టార్ ను ఉచితంగా అందిస్తున్నది. జియో సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిన డిస్నీ + హాట్‌స్టార్ డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లతో వినియోగదారులకు 240GB డేటా ప్రయోజనాన్ని కూడా అందిస్తున్నది. మీ ఫోన్ స్క్రీన్ లాక్ ఎంతవరకు సురక్షితం?

జియో కొత్త యాడ్-ఆన్‌ ప్యాక్‌లు

జియో కొత్త యాడ్-ఆన్‌ ప్యాక్‌లు

రిలయన్స్ జియో మొత్తంగా 6 కొత్త ప్యాక్‌లను విడుదల చేసింది. ఇందులో వాయిస్ కాలింగ్ బెనిఫిట్‌తో రెండు ప్యాక్‌లు మరియు డేటా యాడ్-ఆన్‌లుగా నాలుగు ప్యాక్‌లు ఉన్నాయి. ఈ అన్ని ప్లాన్‌ల మధ్య గల సాధారణ విషయం డిస్నీ + హాట్‌స్టార్ ప్రయోజనంను ఉచితంగా అందించడం. జియో యొక్క కొత్త డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read: ఇండియన్ ఇంజినీర్ చేసిన పనికి ఆశ్చర్యపోయిన నాసా శాస్త్రవేత్తలు!!!

రిలయన్స్ జియో రూ.612 డేటా యాడ్-ఆన్ ప్యాక్

రిలయన్స్ జియో రూ.612 డేటా యాడ్-ఆన్ ప్యాక్

రిలయన్స్ జియో యొక్క రూ.612 డేటా యాడ్-ఆన్ ప్లాన్ వాయిస్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. కొత్త ప్యాక్ లలో FUP నిమిషాల ప్రయోజనంతో వచ్చే ఏకైక వోచర్ ఇదే. ఈ ప్యాక్ నాన్-జియోలకు కాల్స్ చేయడానికి మీకు మొత్తంగా 6000 FUP నిమిషాల ప్రయోజనంను అందిస్తాయి. దీనితో పాటుగా 72GB యొక్క అపరిమిత డేటా ప్రయోజనంను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు వినియోగదారు యొక్క ప్రస్తుత ప్లాన్ ఉన్నంత వరకు ఉంటుంది. కాబట్టి దీనిని జియో నుండి కొనుగోలు చేయడానికి బేస్ ప్లాన్ అవసరం. ఇది ఒక సంవత్సరం యొక్క డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందా ప్రయోజనాన్ని ఉచితంగా అందిస్తుంది.

రిలయన్స్ జియో రూ.1,004 డేటా యాడ్-ఆన్ ప్యాక్

రిలయన్స్ జియో రూ.1,004 డేటా యాడ్-ఆన్ ప్యాక్

రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం రూ.1,004 ధర వద్ద కొత్తగా డేటా యాడ్-ఆన్ ప్యాక్ ను అందిస్తోంది. ఈ ప్యాక్‌తో అదనపు ఖర్చు లేకుండా ఒక సంవత్సరం డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందా యొక్క ప్రయోజనంను ఉచితంగా అందిస్తుంది. అలాగే ఇది 200GB డేటా ప్రయోజనంను 120 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అయితే ఈ ప్యాక్ యాక్టీవ్ గా ఉండటానికి ఎటువంటి బేస్ ప్లాన్ అవసరం లేదు. Also Read: Mubadala- Jio Deal: రూ.9,093.60 కోట్ల తో జియో కొత్త డీల్, మరింత పెరిగిన మార్కెట్ వేల్యూ

రిలయన్స్ జియో రూ .1,206 డేటా యాడ్-ఆన్ ప్యాక్

రిలయన్స్ జియో రూ .1,206 డేటా యాడ్-ఆన్ ప్యాక్

రిలయన్స్ జియో యొక్క కొత్త రూ.1,206 డేటా యాడ్-ఆన్ ప్యాక్ 180 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. ఈ ప్యాక్‌తో అదనపు ఖర్చు లేకుండా ఒక సంవత్సరం డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందా యొక్క ప్రయోజనంను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ ను కొనుగోలు చేసే వినియోగదారులకు 240GB డేటా ప్రయోజనం లభిస్తుంది. దీనిని పొందడానికి వినియోగదారులు టెల్కో నుండి ఎటువంటి క్రియాశీల బేస్ ప్లాన్ తో రీఛార్జ్ చేయవలసిన అవసరం లేదు. మీ డేటా వినియోగాన్ని పెంచుకోవడానికి మీరు ఎప్పుడైనా దీనిని కొనుగోలు చేయవచ్చు.

రిలయన్స్ జియో రూ.1,208 డేటా యాడ్-ఆన్ ప్యాక్

రిలయన్స్ జియో రూ.1,208 డేటా యాడ్-ఆన్ ప్యాక్

రిలయన్స్ జియో రూ.1,208 డేటా యాడ్-ఆన్ ప్యాక్ జియో అందించే చాలా ఆసక్తికరమైన ప్లాన్ లలో ఒకటి. ఇది180 రోజుల చెల్లుబాటు కాలంతో 240GB డేటా ప్రయోజనాన్ని అందించే రూ.1,206 ప్లాన్ కంటే కేవలం రూ.2 ఎక్కువ ధరను కలిగి ఉంది.కానీ ఈ ప్లాన్ మధ్య గల పెద్ద తేడా ఏమిటంటే దాని యొక్క చెల్లుబాటు. ఈ ప్లాన్‌తో మీరు మరో 2 రూపాయలు అదనంగా చెల్లించడం ద్వారా మీకు 240 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. కాబట్టి మీరు గడువు ముగిసిన ప్రణాళిక యొక్క ప్రయోజనాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Best Mobiles in India

English summary
Reliance Jio Introduced 4 New Data Add-Ons Plans for Disney+ Hotstar

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X