పెద్దన్న చెవిలో పాకిస్తాన్ అధ్యక్షుడి పూలు

Posted By:

అమెరికా పర్యటనలో పాకిస్తాన్ పెద్దన్న చెవిలో పూలు పెట్టింది.ఇక ఆ పూలతో పాటు అమెరికా అధ్యక్షుడు చేతిలో చెయ్యేసి మరీ పెద్దన్నను బుట్టలో పడేసేందుకు ట్రై చేసింది. పాకిస్తాన్ లో ఉగ్రవాదం అనే మాట ఇక వినడదని తాము కచ్చితంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, వారి వ్యవస్థను సమూలంగా దెబ్బకొడతామని పెద్దన్న చేతిలో చెయ్యేసి వాగ్దానం చేశారు. అంతటిటో ఊరుకోకుండా భారత్ చర్చలకు తిరస్కరిస్తూ వస్తోందంటూ చెత్త డైలాగులు పాక్ అక్కడ వాడింది. భారత్ ఆయుధాలు పెంచుకుంటూ పోతే మేము గాజలు తొడుక్కుని కూర్చోవాలా అంటూ మనకే సవాల్ విసిరింది. మరి నిజంగానే భారత్ చర్చలకు తిరస్కరిస్తూ వస్తోందా.. పాకిస్తాన్ చర్చలకు సై అంటోందా.. అసలు నవాజ్ షరీప్ ఎవరి చేతుల్లో కీలుబొమ్మ...పాక్ పాలన ఎవరి చేతుల్లో ఉంది....మిగతా కథనం స్లైడర్ లో

Read more : బుద్ధిమారని పాక్: యుద్ధానికి రమ్మంటూ సంకేతాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత్ చర్చలకు తిరస్కరిస్తూ..

భారత్ చర్చలకు తిరస్కరిస్తూ కొన్ని శక్తుల సాయంతో ఆయుధాలను పెంచుకోవటం, ప్రమాదకర సైనిక విధానాలను అవలంబించటం చేస్తోందని.. దీనివల్ల పాకిస్తాన్ సమర్థవంతమైన హెచ్చరికను కొనసాగించటానికి ప్రతిచర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్ వ్యాఖ్యానించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో.. అమెరికా పార్లమెంటుకు చెందిన మేధో సంస్థ యూఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్‌లో మాట్లాడారు.

భారత్ తో సంబంధాన్ని మెరుగుపరచటం కోసం నిజాయితీగా ప్రయత్నాలు..

తాను రెండున్నరేళ్ల కిందట అధికారంలోకి వచ్చాక భారత్ తో సంబంధాన్ని మెరుగుపరచటం కోసం నిజాయితీగా ప్రయత్నాలు చేశానని.. మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలన్న ఆహ్వానాన్ని అంగీకరించానని చెప్పారు. దీనివల్ల వచ్చిన కదలిక.. గత ఆగస్టులో ఎన్‌ఎస్‌ఏ స్థాయి చర్చలను కుంటి సాకులతో రద్దుచేయటంతో ముగిసిపోయిందన్నారు.ఇక భారత్-పాక్ శాంతి చర్చల ప్రక్రియలో ఇరు దేశాలు ఉమ్మడిగా అడిగితే తప్ప తనకు తానుగా ఎలాంటి పాత్ర పోషించేది లేదని అమెరికా తేల్చిచెప్పింది.

పాకిస్తాన్‌తో భారత్ తరహా అణు ఒప్పందం ఏదీ లేదని ..

పాకిస్తాన్‌తో భారత్ తరహా అణు ఒప్పందం ఏదీ లేదని అమెరికా కొట్టి పారేసింది. ఉగ్రవాదుల నుంచి అణ్వస్త్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పాక్ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని అమెరికా భావిస్తున్నట్లు తెలిపారు. దీనికి తమ సహకారం ఉంటుందని.. దీనిపై పాక్‌తో భవిష్యత్తులోనూ చర్చలు జరపనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, కశ్మీర్ వివాద పరిష్కారం కోసం జోక్యం చేసుకోడానికి అమెరికానే సరైందని నవాజ్ షరీఫ్ అమెరికా సెనేటర్లతో అన్నారు.

ఉగ్రవాదాన్ని మేము సమూలంగా నాశనం చేస్తామంటూ .

అయితే అది కాదు విచిత్రం.. అమెరికా పర్యటనలో ఉన్న నవాజ్ షరీప్ అమెరికా అధ్యక్షుడు చేతిలో చెయ్యి వేసి మీరు నిశ్చింతగా నిదురపోండి..ఉగ్రవాదాన్ని మేము సమూలంగా నాశనం చేస్తామంటూ పిలుపునివ్వడంతో ప్రపంచదేశాలు ఒక్కసారిగా పాకిస్తాన్ అధ్యక్షుడు వ్యాఖ్యలతో షాక్ కు గురయ్యాయి.

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లో..

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లో ఉగ్రవాదం అంతం కావడమా..భారత్ తో చర్చల కన్నా యుద్ధానికే మేము రెడీ అని చెప్పే పాక్ నోటి వెంట ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రావడంతో అన్ని దేశాలు ఇప్పుడు ఆశ్చర్యంలో మునిగితేలుతున్నాయి. ఇంతకీ పాకిస్తాన్ పాలన ఎవరి చేతుల్లో ఉంది. నవాజ్ షరీప్ ప్రభుత్వం ఎవరి చేతుల్లో కీలు బొమ్మ అనే విషయాలు తెలుసుకుంటే ఆయన మాటలకు విలువ ఉందా లేదా అన్నది తెలుస్తుంది.

దావూద్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి..

దీని గురించి తెలుసుకోవాలంటే దావూద్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. దావూద్ పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలోనే ఎప్పటి నుంచో ఉన్నాడు. కాని పాకిస్తాన్ ‘అబ్బే! అలాంటిదేమీ లేదు.' అని బుకాయించింది. కాని ఆగస్టు 23 నాడు ఒక టి.వి. ఛానల్ దావూద్ కరాచీలోనే ఉన్నాడని నిరూపించింది. ఆయన భార్యతో ఫోనులో మా ట్లాడారు.‘‘దావూద్ ఏం చేస్తున్నాడు?''నిద్రపోతున్నారు'' అని ఆయన భార్య సమాధానం చెప్పిన టేపు విడుదల అయింది. అంతేకాదు దావూద్ ఇబ్రహీం పేర ఫోను, రేషన్ కార్డు కూడా ఉన్నాయి. ఇంటి నెంబరు కరెంటు బిల్లు అన్నీ ఉన్నాయి.

బొంబాయి బాంబు పేలుళ్లలో ఇతడొక ప్రధాన ముద్దాయి..

బొంబాయి బాంబు పేలుళ్లలో ఇతడొక ప్రధాన ముద్దాయి. ఐఎస్‌ఐ ఏజెంటు. ఈ విషయం బయటపెట్టాక ఒక పాకిస్తానీ మిలటరీ ఆఫీసర్ ఇలా అన్నాడు. పాకిస్తాన్‌లో జనగణన సరిగ్గా జరుగలేదు. ఇక్కడ ఎన్నో దేశాల వారున్నారు. వారిలో యాభై శాతం జనాభా మాత్రమే గణింపబడ్డారు. ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలుస్తుందంటూ మీడియా మీద ఇంతెత్తున లేచాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే పాక్ ప్రభుత్వం దావూద్ ఇబ్రహీంను కరాచీ నుండి ఒక హిల్ స్టేషన్‌లోని రహస్య ప్రదేశానికి మార్చింది.

దీనివెనుక నడిచింది దావూద్ అనే ఓ మాఫియా డాన్ కథ..

ఈ నేపథ్యంలోనే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాక్ సలహాదారు సర్తాజ్ మధ్య జరుగవలసిన చర్చలు కూడా అప్పుడు రద్దుకావటం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. దీనివెనుక నడిచింది దావూద్ అనే ఓ మాఫియా డాన్ కథ. అందుకే ఆగస్టు 24న ఇండో-పాక్ శాంతి చర్చలు విఫలమైనాయి. అసలు సమావేశమే జరుగలేదు. అదే సమయంలో భారత ప్రధాని నరేంద్రమోదీ యూఎఈ లో పర్యటిస్తూ ఉగ్రవాదం నేడు అగ్రవాదం అని చెప్పారు.

ఉభయులూ కలిసి ఒక ఉమ్మడి ప్రకటన ..

ఉభయులూ కలిసి ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. యూఏఈ ముస్లిం దేశం. ఇక్కడ రాజరికం ఉంది. వారికీ ఐఎస్‌ఐఎస్, అల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల భయం ఉంది. అందుకే వారు భారత్‌ను బలపరచారు.ఇది పాకిస్తాన్‌కు నచ్చలేదు. ఒక ముస్లిం దేశం, ఇండియాను బలపరచటం పాక్ జీర్ణించుకోలేకపోయింది. నరేంద్రమోదీ యుద్ధోన్మాది కాదు. కాని పాక్ సైన్యం యుద్ధోన్మాదంలో ఎప్పుడూ రగిలిపోతూ ఉంటుంది.

పాక్ సైన్యం కనుసన్నల్లో పాక్ ప్రభుత్వం ..

ఇక మరొక రహస్యమేమంటే పాక్ సైన్యం కనుసన్నల్లో పాక్ ప్రభుత్వం ఉంటుంది. అక్కడ ప్రజాస్వామ్యం ఒక నాటకం ఒక బూటకం. ఇండియాలో త్రిదళాధిపతులూ ప్రజాస్వామ్యవాదులు. ఇవి ఎవరూ కాదనలేని నగ్నసత్యాలు కాబట్టి సారాంశమేమంటే పాకిస్తాన్ సైన్యానికి శాంతియుత జీవనం ఇష్టం లేదు. వారికి భారత్‌తో యుద్ధం కావాలి.

మిలటరీ అధినేతలే భారత్‌పైకి యుద్ధాన్ని ..

తిక్కాఖాన్ (1971 బంగ్లాయుద్ధం) యాహ్యాఖాన్ (1966 యుద్ధం) ముషారఫ్ (కార్గిల్ యుద్ధం) ఇలా మిలటరీ అధినేతలే భారత్‌పైకి యుద్ధాన్ని ప్రేరేపించారు. భుట్టో ఉరి తీయబడ్డాడు. బేనజిర్ భుట్టోను చంపారు. పాక్ సైనికులకు స్వదేశ విదేశ భేదాలు లేవు. బెలూచీస్థాన్‌లో విధ్వంసం సృష్టించారు. బంగ్లాదేశ్‌లో అమానుషంగా (1971) లక్షలాది మంది సాటి ముస్లిములను చంపారు. సున్నీ తెగ ముస్లిములు షియాలను చంపారు.

లాహోరు కరాచీ వంటి హిందూ మెజారిటీ నగరాలల్లో ..

లాహోరు కరాచీ వంటి హిందూ మెజారిటీ నగరాలల్లో నేడు ఒక్క శాతం హిందువులు కూడా లేరు. కాబట్టి యుద్ధోన్మాదం పాకిస్తాన్ జీవ లక్షణం. భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఐఎస్‌ఐఎస్ జండాలు పట్టుకొని కాశ్మీరులో పాక్ జాతీయ గీతం ఎందుకు పాడారు? అని ప్రశ్నిస్తే పాపం వారు నిరుద్యోగ యువకులు. ఉద్యోగావకాశాలు లేక పాక్ జండాలు పట్టుకున్నారు అన్నది వారి సమాధానం.

ఇండో పాక్ చర్చలు ఎందుకు విఫలమైనాయి?

ఇక అంతర్జాతీయ ఉగ్రవాదం గురించి చర్చించాలని భారత్ ఆహ్వానం అందించింది. ‘కాశ్మీరు గురించి చర్చిద్దాం' అని పాకిస్తాన్ కోరింది. కాశ్మీరు వేర్పాటువాదులు హురియత్ కాన్ఫరెన్సుతో చర్చిద్దాం అని పాకిస్తాన్ కోరింది. హురియత్ నాయకుడు జిలానీ పాకిస్తాన్‌లో ఐఎస్‌ఐ- ఐఎస్‌ఐఎస్ కలిసి వేర్పాటు ఉద్యమాలు నడుపుతున్నాడు. ఉస్మాన్, నావెద్‌ల వంటివారు పాక్‌నుండి కాశ్మీరు వేర్పాటువాదుల మద్దతుతో భారత్‌లోకి ప్రవేశించి పట్టుబడటం నిన్నటి కథయే.

చైనా-పాకిస్తాన్‌లు కలిసి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న..

ఇక చైనా-పాకిస్తాన్‌లు కలిసి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విషయం మొత్తం ప్రపంచానికి వెల్లడి అయిన విషయం తెలిసిందే. వారికి భారత్ అనే దేశం బతికి బట్టకట్టడం ఇష్టం లేదు. అవసరమైతే అణు యుద్ధానికి సిద్ధమవుతున్నది. పాకిస్తాన్‌వద్ద 120 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అందులో ఒక్క బాంబు చాలు ఉత్తర భారతం మొత్తం తుడిచిపెట్టుకొని పోవడానికి.

పాకిస్తాన్ బాధ్యతారహితమైన ధూర్తదేశం..

అంటే పాకిస్తాన్ బాధ్యతారహితమైన ధూర్తదేశం (రోగ్ కంట్రీ) అని అర్థం. అక్కడ చిన్నప్పటినుండి కాఫిర్ల (హిందువుల)పై ద్వేషంతో ఇవ్వబడ్డ మదరసాల శిక్షణ అలాగే మొదటి దశలో అమెరికా ఆయుధ సంపత్తి, ద్వితీయ దశలో చైనా సహాయం, బహుభార్యత్వం అదుపులేని దరిద్రం ఇలా పాకిస్తాన్ ఉగ్రవాదానికి చాలా కారణాలున్నాయి.

ఇండో పాక్ చర్చలు ఎప్పటికీ జరుగవు..

ఇక ఇండో పాక్ చర్చలు ఎప్పటికీ జరుగవు- ఒకవేళ అవి జరిగినా సఫలం కావు. బీజింగ్, ఇస్లామాబాద్‌లకు భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉండటం ఇష్టం లేదు. ఇక కాశ్మీరు సమస్యకు రెండు పరిష్కారాలున్నాయి. మొదటిది కాశ్మీరును పాకిస్తాన్‌కు ధారాదత్తం చేసి మరో దేశ విభజన జరగాలి. ఇక రెండోది సైనిక చర్య జరిపి ఆక్రమిత కాశ్మీరును భారత్‌లో కలుపుతూ అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాను పీకి పారేయాలి. నరేంద్రమోదీ ఈ సాహసం చేయకపోవచ్చు ఎందుకంటే గుజరాతీవారు (ఏ సర్దార్‌పటేల్ వంటి ఒకరిద్దరు తప్ప) యుద్ధానికి ముందుకు రారు. ఎంతసేపూ వారిది ఆర్థిక దృష్టే.

అల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలను..

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో వలె అమెరికా ఫ్రాన్సు బ్రిటన్ వంటి దేశాలు ఇప్పుడు ముందుకు రావాలి. అల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలను నిర్మూలించాలి. అందుకు ఇండియా, రష్యాలు మద్దతునివ్వాలి. దీనికి ఇండియాలో ఉగ్రవాద సంస్థలను సమూలంగా నాశనం చేయాలి. ఇవేవీ లేకుండా భారత ఉపఖండంలో శాంతి నెలకొల్పటం అసాధ్యం. కాని ఇప్పుడు రాయబారిగా అమెరికా రావాలని పాక్ కోరుకుంటోంది. అదే జరిగితే భారత్ ఇంకా పెను ప్రమాదంలోకే పడే అవకాశం కూడా ఉంది.

పాక్ అనే ధూర్తదేశం సైనిక పాలకుల చేతిలో ఉన్నంతవరకు..

ఆసియాలో పాక్ అనే ధూర్తదేశం సైనిక పాలకుల చేతిలో ఉన్నంతవరకు మానవాళికి రక్షణ లేదు. భారతదేశంలోని ఇరవై కోట్ల మంది ముస్లిములు క్రైస్తవులూ కూడా భారతీయులే. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. వీరు సమర్‌ఖండ్ నుండి రాలేదు. రష్యా లోగడ ‘‘ఉఫా'' సమావేశంలో నవాజ్ షరీఫ్- మోదీల మధ్య జరిగిన ఒప్పందంలో కాశ్మీరు ప్రసక్తే లేదు. ఈ సాకు చూపి ఇండో పాక్ జాతీయ భద్రతా దళాల సలహాదారుల స్థాయి చర్యలు రద్దుకు ప్రధాన కారణం ఇదే.

నవాజ్ షరీఫ్‌కు స్వతంత్ర అస్తిత్వం ఎక్కడ..?

పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్‌కు స్వతంత్ర అస్తిత్వం లేదు. అతడు సైన్యం చేతిలో కీలుబొమ్మ.భారత్‌పై ఉగ్రవాద దాడి మొన్న పార్లమెంటుపై జరిగిన దాడితో మొదలుకాలేదు. దీనికి వెయ్యేండ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. రాజకీయ లబ్దికోసం చరిత్రను చదవటం ఇష్టంలేని నాయకులు చరిత్రహీనులవుతారు. ఇది ఢిల్లీలో కావచ్చు- హైదరాబాదు గల్లీలో కావచ్చు.గజనీ దగ్గర నుంచి మొన్నటి జిన్నా దాకా అందరూ అందరే.

ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు జర్నలిస్టుల తలలను నరికిన తర్వాత..

2002లో న్యూ యార్క్‌లో ఎంపైర్ ఎస్టేట్ బిల్డింగు కూలిన తర్వాత 2015లో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు జర్నలిస్టుల తలలను నరికిన తర్వాత ఇస్లామిక్ ఉగ్రవాద తీవ్రతను పాశ్చాత్య దేశాలు మొదటిసారి గుర్తించాయి. కాని భారత్ గత వెయ్యి సంవత్సరాలుగా ఈ మత భూతం దారుణ మారణకాండకు బలి అవుతూనే ఉంది.

కరాచీలో దావూద్ ఇబ్రహీంతో మాట్లాడినట్లు ..

2015 ఆగస్టు చివరి వారంలో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు అరిఫ్ జమాల్ తాను కరాచీలో దావూద్ ఇబ్రహీంతో మాట్లాడినట్లు చెప్పారు అంతే కాదు పాకిస్తాన్ తన న్యూక్లియర్ వార్ హెడ్స్‌ను ఎల్.ఒ.పి. (లైన్ ఆఫ్ కంట్రోల్)పై మోహరించిన వార్తలు భారత్‌కు అందాయి. మరి ఇంతటి చరిత్రను మూటగట్టుకున్న పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాదం అంతం చేస్తామంటూ చెబుతోంది.

మరోక షాకింగ్ న్యూస్ ఏంటంటే..

ఇక మరోక షాకింగ్ న్యూస్ ఏంటంటే వచ్చే పదేళ్లలో పాకిస్థాన్ భారత్‌ను మించి ప్రపంచంలో 5వ అణ్వాస్త్ర దేశంగా ఉంటుందని అమెరికాకు చెందిన అటామిక్ సెన్స్‌ అంచనా వేసింది. గత 20 ఏళ్లుగా పాక్ అణ్వాయుధాలపై దృష్టి పెట్టిందని, ప్రస్తుతం ఆ దేశం వద్ద వందకుపైగా వార్‌ హెడ్స్ ఉన్నట్లు విశ్లేషించింది.

2025 నాటికి పాక్ అణ్వాస్త్రాల సంఖ్య 250కి ..

2025 నాటికి పాక్ అణ్వాస్త్రాల సంఖ్య 250కి చేరవచ్చని పేర్కొంది. అప్పటికి 6వ స్థానంలో నిలిచే భారత్ న్యూక్లియర్ కార్యకలాపాల ఆధారంగానే అణ్వాయుధాలను పాక్ సమకూర్చుకుంటుందని విశ్లేషించింది. మరోపక్క పాకిస్థాన్‌కు ఎనిమిది ఎఫ్16 ఫైటర్ జెట్స్‌ను అమ్మేందుకు అమెరికా సమాయత్తమైంది. ఒబామాతో షరీఫ్ భేటీ సందర్భంగా ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఈ డీల్‌పై చర్చించే అవకాశముంది.

ఇంతటి చరిత్ర కలిగిన పాక్ ఇప్పుడు ఉగ్రవాదం గురించి..

ఇంతటి చరిత్ర కలిగిన పాక్ ఇప్పుడు ఉగ్రవాదం గురించి మాట్లాడుతోంది. చర్చల గురించి మాట్లాడుతోంది...మరి అవి ఒట్టి మాటలేనా లేక ఆచరణలో పెడుతుందా అన్నది రానున్న రోజుల్లో పాకిస్తాన్ తీరు మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో పేరు మోసిన ఉగ్రవాదులంతా పాకిస్తాన్ నుంచే వచ్చారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. మరోపక్క, భారత్తో కుదుర్చుకున్న పౌర అణుఒప్పందంలాంటి ఒప్పందాలేవీ పాకిస్థాన్ తో కురుర్చుకోలేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందన్నది ముందు ముందు చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Barack Obama urges Pakistan to avoid raising nuclear tensions with new weapons
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot