బుద్ధిమారని పాక్: యుద్ధానికి రమ్మంటూ సంకేతాలు

|

ఎప్పటికీ బుధ్ధి మారని పాక్ ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. మా అణ్వాయుధాలన్నీ భారత్‌తో యుద్ధం కోసమేనంటూ ఆ దేశానికి చెందిన సీనియర్ అధికారి చేసిన సంచలన వ్యాఖ్యలతో మరో సారి భారత్ పాకిస్తాన్ ల మధ్య నిప్పు రాజుకునేలా ఉంది. యుద్ధ వ్యూహలకు మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమేనా అన్నట్లుగా ఆ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత్ ను వేరే ఆలోచన వైపు పరుగులు పెట్టిస్తున్నాయి. నిజంగా పాకిస్తాన్ యుద్ధానికి రెడీ అవుతుందా పాకిస్తాన్ లో ఆయుధాలు ఉన్నాయా...ఏ అండ చూసుకుని పాకిస్తాన్ ఈ వ్యాఖ్యలు చేసింది..మిగతా కధనం స్లైడర్ లో..

Read more:పాక్‌తో యుద్ధం: ఇండియాకు 15 సెకన్లే ఎక్కువ

అణు సామర్థ్యంపై పాకిస్తాన్ తొలిసారిగా బహరంగ వ్యాఖ్యలు

అణు సామర్థ్యంపై పాకిస్తాన్ తొలిసారిగా బహరంగ వ్యాఖ్యలు

అణు సామర్థ్యంపై పాకిస్తాన్ తొలిసారిగా బహరంగ వ్యాఖ్యలు చేసింది.తమ వద్ద తక్కువ శక్తిని విడుదల చేసే అణ్వాయుధాలు ఉన్నాయని ఒక వేళ ఇండియాతో యుద్ధం చేయాల్సి వస్తే వీటిని వాడతామని పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఐజాజ్ చౌధురి స్పష్టం చేసినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. పాకిస్తాన్ కు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి.

యుద్ధ వ్యూహాల్లో భాగంగానే వీటిని తయారు చేశామని..

యుద్ధ వ్యూహాల్లో భాగంగానే వీటిని తయారు చేశామని..

తమ యుద్ధ వ్యూహాల్లో భాగంగానే వీటిని తయారు చేశామని ఆయన తెలిపారు. నవాజ్ షరీఫ్ ఇటీవలి అమెరికా పర్యటన సంధర్భంగా యూఎస్ తో ఎటువంటి అణు ఒప్పందాన్ని చేసుకోజాలదని ఆయన వివరించారు.తమ దేశ అణు కార్యక్రమాలు యుద్ధాన్ని ప్రేరేపించేందుకు కాదని ముందు జాగ్రత్త చర్యల కోసమేనని ఆయన చెప్పారు.

భారత్-పాక్ ల మధ్య శాంతి మనుగడ ప్రశ్నార్థకంగా ..
 

భారత్-పాక్ ల మధ్య శాంతి మనుగడ ప్రశ్నార్థకంగా ..

ఇప్పటికే ముంబైలో జరుగుతున్న కొన్ని ఘటనల కారణంగా భారత్-పాక్ ల మధ్య శాంతి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపధ్యంలో తాజాగా పాక్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ చౌదరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

భారత సైన్యం కోల్డ్-స్టార్ట్ డాక్ట్రిన్ ను...

భారత సైన్యం కోల్డ్-స్టార్ట్ డాక్ట్రిన్ ను...

భారత్ మాపై ఎటువంటి దాడి చేసినా దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్దంగా ఉన్నాం. మాతో యుద్ధాన్ని ఎదుర్కోవడానికే భారత సైన్యం కోల్డ్-స్టార్ట్ డాక్ట్రిన్ ను అభివృద్ధి చేసింది, ఈ కోల్డ్-స్టార్ట్ డాక్ట్రిన్ ను ఎదుర్కోవడానికి తాము వ్యూహాత్మకంగా అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్నాం' అని అన్నారు.

22న నవాజ్ అమెరికా పర్యటన..

22న నవాజ్ అమెరికా పర్యటన..

అదేవిధంగా పాక్-అమెరికాల మధ్య జరగబోయే అణు ఒప్పందం పై పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సంతకం పెట్టబోరని కూడా తెలిపారు. ఈ నెల 22న నవాజ్ అమెరికా పర్యటన మొదలుకానుంది. ఒక వేళ ఈ అణు ఒప్పందానికి పాక్ ఒప్పుకుంటే అది కూడా అణు సరఫరాదారుల బృందంలో చేరుతుంది. ఇందుకు తమ అణు కార్యక్రమంపై ఆ దేశం కొన్ని ఆంక్షలను అంగీకరించాల్సి ఉంటుంది.

లోలోపల అనుకున్న వ్యూహాలు రచిస్తూ.

లోలోపల అనుకున్న వ్యూహాలు రచిస్తూ.

పాక్ అణుబాంబుల తయారీ, పరీక్షల నిషేదం ఉన్నా... అదేమీ పట్టనట్లు లోలోపల అనుకున్న వ్యూహాలు రచిస్తూ.. చాపకింద నీరులా పాకుతోంది. మరో పదేళ్లలో అమెరికా, రష్యాల తర్వాత అత్యధిక అణు బాంబులను కలిగి ఉన్న దేశంగా పాకిస్తాన్ నిలుస్తుందని వాషింగ్టన్ పోస్టు తెలిపింది.

భారీ ఎత్తున అణ్వస్త్రాల తయారీకి పాక్ ప్రణాళికలు

భారీ ఎత్తున అణ్వస్త్రాల తయారీకి పాక్ ప్రణాళికలు

భారీ ఎత్తున అణ్వస్త్రాల తయారీకి పాక్ ప్రణాళికలు రూపొందించిందని `ఏడాదికి 20 అణు బాంబులను తయారు చేసి దాచుకుంటోందని వెల్లడించింది.వేలకొద్ది బాంబులు ఒకేసారి వేస్తే వచ్చేంత శక్తితో కూడుకున్న 350 అణు ఆయుధాలను పాకిస్థాన్ తయారు చేయనున్నదని వివరించింది.

అత్యధిక అణు బాంబులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ..

అత్యధిక అణు బాంబులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ..

2025 నాటికి ప్రపంచంలో అత్యధిక అణు బాంబులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ టాప్-3లో నిలవనుందని వాషింగ్టన్ పోస్ట్ అంచనా వేసింది. ఇండియా పేరు వింటేనే చాలు భయపడుతున్న పాకిస్తాన్ శరవేగంగా అణు సామర్థాయన్ని పెంచుకుంటోంది అంటూ కార్నేజ్ ఎండోమెంట్స న్యూక్లియర్ పాలసీ ప్రోగ్రామ్ కో-డైరెక్టర్ టోబీ డాల్టన్, స్టిమ్సన్ సెంటర్ సహ వ్యవస్థాపకుడు మైఖేల్ క్రిపాన్ ఓ ప్రత్యేక కథనం రాశారు.

ఇండియాకు సమాధానం చెప్పగల సత్తా పాకిస్తాన్ కు ఉందని..

ఇండియాకు సమాధానం చెప్పగల సత్తా పాకిస్తాన్ కు ఉందని..

గత కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ తో ఇండియాకు గనుక యుద్ధం వస్తే ఇండియాకు సమాధానం చెప్పగల సత్తా పాకిస్తాన్ కు ఉందని పాకిస్తాన్ సైంటిస్ట్ సమర్ ముబారక్ బల్లగుద్ది చెబుతున్నారు. నిజంగా అలా పాకిస్తాన్ తయారవుతుందా..అనే అనుమానాలు కూడా ఇప్పుడు కలుగుతున్నాయి.

ఇండియా తలుచుకుంటే 15 సెకన్లలో సర్వనాశనం..

ఇండియా తలుచుకుంటే 15 సెకన్లలో సర్వనాశనం..

దీనికి ధీటుగా ఇండియాటుడే కూడా తన కథనంతో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పింది. అణుక్షణం భారత్ పై కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ ను ఇండియా తలుచుకుంటే 15 సెకన్లలో సర్వనాశనం నామరూపాలు లేకుండా చేయగలదు. అయితే భారీగా ప్రాణ నష్టం సంభవిస్తుంది..ఒక వేళ యుధ్ధం కనుక వస్తే దాదాపు కోటి మంది చనిపోతారని ఇండియా టుడే కథనం రాసింది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేెటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu 

Best Mobiles in India

English summary
Here Write Pak develops nuclear weapons to combat possible war with India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X