ఆ పాటను మేము తొలగించం : యూట్యూబ్

By Hazarath
|

తమిళనాట మొన్న తుఫాను కన్నా బాగా పాపులర్ అయి వివాదాలతో ఊపేస్తున్న శింబు బీప్ పాటపై యూ ట్యూబ్ తన స్పందనను తెలియజేసింది. ఆ పాటలో ఎటువంటి తప్పులు లేవని మేము దాన్ని తొలగించలేమని స్పష్టం చేసింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయితే యూ ట్యూబ్ నిర్వాహకులు ఆ పాటను ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయమని చెప్పడంతో పోలీసులు దాన్ని సరిగా ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయలేదని అందుకే వారికి అందులో కొన్ని పదాలు అర్థం కాలేదని తెలుస్తోంది.

 

read more: అంతరిక్షం నుంచి కాల్ : సారీ రాంగ్ నంబర్

యూ ట్యూబ్ నుంచి తొలగించడానికి

యూ ట్యూబ్ నుంచి తొలగించడానికి

తమిళనాడునే ఊపేస్తున్న శింబు బీప్ పాటను యూ ట్యూబ్ నుంచి తొలగించడానికి ఆ సంస్థ నిర్వాహకులు నిరాకరించడంతో సమస్య మరింత జఠిలంగా మారింది.

బీప్ సాంగ్ గత 11వ తేదీ నుంచి

బీప్ సాంగ్ గత 11వ తేదీ నుంచి

బీప్ సాంగ్ గత 11వ తేదీ నుంచి వాట్సాప్,ఫేస్‌బుక్, ఇంటర్నెట్,యూట్యూబ్ అంటూ హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే 10 లక్షల మంది ఈ పాటను లైక్ చేశారు.

దీంతో శింబు బీప్ పాటకు సంబంధించిన వివాదానికి
 

దీంతో శింబు బీప్ పాటకు సంబంధించిన వివాదానికి

దీంతో శింబు బీప్ పాటకు సంబంధించిన వివాదానికి త్వరగా పుల్‌స్టాప్ పెట్టాలని భావించిన నగర నేరపరిశోధన శాఖ అధికారులు ఆ సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించే చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

పోలీసులు ఆగమేఘాలపై యూట్యూబ్ అధికారులను

పోలీసులు ఆగమేఘాలపై యూట్యూబ్ అధికారులను

దీంతో పోలీసులు ఆగమేఘాలపై యూట్యూబ్ అధికారులను కలిసి శింబు సాంగ్‌ను నిలిపివేయాల్సిందిగా కోరారు.అయితే ఆ సాంగ్ అర్థం ఏమిటో ఆంగ్లంలో తర్జుమా చేసి తమకు వివరించాల్సిందిగా యూట్యూబ్ నిర్వాహకులు పోలీసులకు చెప్పారు.

అతి కష్టం మీద అరకొర అర్థాలతో

అతి కష్టం మీద అరకొర అర్థాలతో

దీంతో అతి కష్టం మీద అరకొర అర్థాలతో బీప్ సాంగ్‌ను పోలీసులు ఆంగ్లంలోకి అనువదించి చెప్పగా అందులో పెద్దగా తప్పు పట్టాల్సిన విషయం ఏమీ లేదని యూట్యూబ్ నిర్వాహకులు తేల్సి చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు.దీంతో అసలు ఇంతగా కలకలం సృష్టిస్తున్న ఆ పాట యూట్యూబ్‌లోకి ఎలా వచ్చింది? దీనికి కారకులెవరు?అన్న విషయాలపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం.

శింబు, అనిరుథ్ ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేయండి'

శింబు, అనిరుథ్ ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేయండి'

తమిళనాడులో నిన్న మొన్నటి వరకూ తుపాను కల్లోలం కలిగిస్తే, తాజాగా ‘బీప్' సాంగ్ దుమారం రేపుతోంది. ఆడవాళ్ల గురించి ఈ పాటలో అభ్యంతరకర పదాలు ఉండటంతో దుమారం రేగింది. ‘శింబు, అనిరుథ్ ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేయండి' అంటూ తమిళనాడుకు చెందిన కొన్ని మహిళా సంఘాలు పోలీసులను ఆశ్రయించాయి.

ఫలితంగా శింబు, అనిరుథ్‌ల మీద పలు కేసులు

ఫలితంగా శింబు, అనిరుథ్‌ల మీద పలు కేసులు

ఫలితంగా శింబు, అనిరుథ్‌ల మీద పలు కేసులు నమోదయ్యాయి. దాంతో చెన్నై హైకోర్టులో శింబు ముందస్తు బెయిలుకు అపీల్ చేసుకున్నాడు. అనిరుథ్ విదేశాల్లో మ్యూజిక్ షోస్‌తో బిజీగా ఉన్నాడు. అతను చెన్నైలో అడుగుపెట్టగానే ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్లాన్ చేసుకున్నారట.

ఇది ‘బ్రేకప్’ పాట

ఇది ‘బ్రేకప్’ పాట

ఇంతకీ ఈ పాట దేని గురించి? లవ్ ఫెయిల్యూర్‌లో ఉన్నవాళ్లు పాడుకోదగ్గ పాట ఇది. శింబు లవ్‌లో ఫెయిల్ అయినప్పుడు రాసుకున్నాడట. నయనతారతో ప్రేమాయణం ముగిశాక రాసుకున్నాడో, హన్సికతో బ్రేకప్ అయ్యాక రాశాడో అనే విషయం స్పష్టంగా బయటికి రాలేదు.

ముఖ్యంగా పాటలో ఉన్న ఓ పదం బాగా

ముఖ్యంగా పాటలో ఉన్న ఓ పదం బాగా

ముఖ్యంగా పాటలో ఉన్న ఓ పదం బాగా అభ్యంతరకరమైనదిగా తెలుస్తోంది. ఆ పదాన్ని మ్యూట్ చేసేశారు. విచిత్రం ఏంటంటే... ‘అసలీ పాటకు నేను ట్యూన్ చేయలేదు. గతంలో శింబు, నా కాంబినేషన్‌లో వచ్చిన పాట ట్యూన్‌ని ఎవరో ఇలా మలిచి, లేనిపోని పదాలు తగిలించి విడుదల చేశారు' అని అనిరుథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

ఈ పాటకూ, శింబూకి అస్సలు సంబంధమే లేదని

ఈ పాటకూ, శింబూకి అస్సలు సంబంధమే లేదని

ఈ పాటకూ, శింబూకి అస్సలు సంబంధమే లేదని శింబు తండ్రి టి. రాజేందర్ ప్రకటించారు. శింబు మాత్రం ‘ఈ పాటకూ, అనిరుథ్‌కీ సంబంధం లేదనీ, ఎప్పుడో తాను రాసుకున్న పాట ఇది' అని చెప్పడం విశేషం.

శింబును ఉరి తీయాలంటున్నారు.అంత తప్పు తనేం చేశాడు

శింబును ఉరి తీయాలంటున్నారు.అంత తప్పు తనేం చేశాడు

శింబును ఉరి తీయాలంటున్నారు.అంత తప్పు తనేం చేశాడు.శింబును పెంచిన నన్ను ఉరి తీయండి.ఇప్పుడు చూసినా కెమెరాలతో మనషులు ఇంటి ముందు తిరుగుతున్నారు. మనశ్శాంతి కరువైంది. అసహనానికి గురౌవుతున్నాం. ఏమి రాష్ట్రం ఇది?

మేమిక తమిళనాడులో జీవించలేం.

మేమిక తమిళనాడులో జీవించలేం.

మేమిక తమిళనాడులో జీవించలేం. ఏ కర్ణాటకకో, కేరళకో లేక మరెక్కడికైనా వెళ్లి మా బతుకు మేము బ్రతుకుతాం. మాకు జీవితాన్నిచ్చిన తమిళనాడుకు కృతజ్ఞతలు అంటూ శింబు తల్లి ఉషా రాజేందర్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు.

పూర్తి కాని పాటను ఎవరో అభ్యంతరకర పదాల

పూర్తి కాని పాటను ఎవరో అభ్యంతరకర పదాల

పూర్తి కాని పాటను ఎవరో అభ్యంతరకర పదాలతో పూర్తి చేసి మరీ యూ ట్యూబ్‌లో విడుదల చేశారనీ శింబు, అనిరుథ్ ఆరోపిస్తున్నారు. ‘బీప్ సాంగ్' విషయంలో తాను క్షమాపణలు కోరననీ, కావాలని ఎవరో తస్కరించి విడుదల చేసిన పాటకు తనను తప్పుబట్టడం సరికాదనీ శింబు ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నాడు.

‘ఆడవాళ్లను తన్నండి... తిట్టండి..'

‘ఆడవాళ్లను తన్నండి... తిట్టండి..'

అది మాత్రమే కాదు.. ‘ఆడవాళ్లను తన్నండి... తిట్టండి..' అంటూ ఈ మధ్యకాలంలో వచ్చిన ఇతర పాటలను వదిలేసి, ఆడవాళ్లను సపోర్ట్ చేసే విధంగా ఉన్న ‘బీప్' సాంగ్‌ను పూర్తిగా వినకుండా వివాదం చేయడం అన్యాయమని శింబు పేర్కొనడం చర్చనీయాంశమైంది.

ధనుష్ హీరోగా నటించిన ఓ చిత్రంలో అతను

ధనుష్ హీరోగా నటించిన ఓ చిత్రంలో అతను

ధనుష్ హీరోగా నటించిన ఓ చిత్రంలో అతను పాడిన పాటలో అలాంటి పదాలు ఉన్నాయి. మరి.. శింబు పరోక్షంగా విసిరిన ఈ విసుర్లుకు ధనుష్ స్పందిస్తే, మరో వివాదం మొదలుకావడం ఖాయం. ఈ బీప్ సాంగ్ వ్యవహారం శింబు, అనిరుథ్‌కి మాత్రమే తలనొప్పిగా తయారవ్వలేదు. ఈ పాట కారణంగా తమిళ పరిశ్రమలో ఉన్న పలువురు ప్రముఖులు సైతం వివాదాలపాలయ్యారు.

‘బీప్..’ వివాదంలో ప్రముఖులు!

‘బీప్..’ వివాదంలో ప్రముఖులు!

చెన్నై తుపాను బాధితులకు సహాయం చేసినవారిని అభినందించడం కోసం ఏర్పాటైన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇళయరాజా దగ్గర ఈ పాట గురించి ఓ పాత్రికేయుడు ప్రస్తావిస్తే, ‘‘నేనీ ఫంక్షన్‌కి వచ్చింది ఈ పాట గురించి మాట్లాడటానికేనా?'' అని రాజా సార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాత్రికేయ సంఘాలు ఇళయరాజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇళయరాజా సోదరుడు

ఈ నేపథ్యంలో ఇళయరాజా సోదరుడు

ఈ నేపథ్యంలో ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ మరో వివాదానికి తెరతీశారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అనిరుథ్ బంధువు కాబట్టి, ఈ పాట గురించి స్పందించమని ఆయన్ను అడగొచ్చుగా అంటూ రజనీని ఇరుకుల్లో పడేసేలా మాట్లాడారు.

వివాదం రేపుతున్న పాటకు సంబంధించిన వీడియో

వివాదం రేపుతున్న పాటకు సంబంధించిన వీడియో

Best Mobiles in India

English summary
here write Beep Song Police Requests YouTube to provide details about Song

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X