అంతరిక్షం నుంచి కాల్ : సారీ రాంగ్ నంబర్

Written By:

మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నారా..అయితే మీరెప్పుడైనా రాంగ్ కాల్ డయల్ చేశారా...అవతలి నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది. కొంతమందైతే సారీ రాంగ్ కాల్ అని చెబుతారు. అలాగే మరికొంతమంది ఆ రాంగ్ కాల్ తో ఛాటింగ్ చేస్తూ అవతలి వారిని బుట్టలో పడేస్తారు కూడా.. సో ఇప్పుడు అలాంటి కధే అంతరిక్షంలో జరిగింది. మరి ఆ కథలో లవ్ పుట్టిందా... లేక సారీ అని చెప్పారా తెలుసుకోవాలంటే కథనం చదవాల్సిందే.

Read more: రానున్న కాలంలో మనుషుల్నిఆడించేది కంప్యూటర్లే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇటీవల స్పేస్ సెంటర్ కు వెళ్ళిన ఆస్టోనాట్ కూ

ఇటీవల స్పేస్ సెంటర్ కు వెళ్ళిన ఆస్టోనాట్ కూ రాంగ్ కాల్ అనుభవం ఎదురైందట. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం ...

ఇటీవల అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి

ఇటీవల అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి పలువురు సభ్యుల బృదం తరలి వెళ్ళిన విషయం తెలిసిందే. వీరందరినీ కజకిస్థాన్ లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సోయజ్ కాప్సూల్ ద్వారా ఇంటర్నేషనల్ స్సేస్ స్టేషన్ కు తరలించారు.

ఈ బృదంలోని బ్రిటన్ కు చెందిన ఆస్టోనాట్ టిమ్ పీక్ కు

మొత్తం ఆరు నెలల పాటు ఉండే అంతరిక్ష యాత్రకు ఈ వ్యోమగాములు వెళ్ళారు. అయితే ఈ బృదంలోని బ్రిటన్ కు చెందిన ఆస్టోనాట్ టిమ్ పీక్ కు ఇదే తొలి స్పేస్ జర్నీ. అంతేకాదు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన తొలి బ్రిటన్ దేశస్థుడు కూడ ఆయనే.

ఆరునెలల పాటు అంతరిక్షంలో విధులు నిర్వహించనున్న

ఆరునెలల పాటు అంతరిక్షంలో విధులు నిర్వహించనున్న టిమ్ పీక్ భూమిపై ఉన్న అధికారులు, కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడూ మాట్లాడుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఆయనకు ఓ వింత అనుభవం ఎదురైందట.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కుటుంబ సభ్యులతో

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఆయన ఫోన్ చేస్తే ... అది ... నంబర్ తప్పు డయల్ కావడంతో రాంగ్ కాల్ వెళ్ళిందట.

'ఈజ్ దిస్ ప్లానెట్ ఎర్త్' 'అంటూ అడిగిన కిమ్ కు

'ఈజ్ దిస్ ప్లానెట్ ఎర్త్' 'అంటూ అడిగిన కిమ్ కు ఆశ్చర్యం కలిగిందట'. అట్నుంచి ఓ మహిళ స్వరం వినిపించడంతో '' హలో, ఈజ్ దిస్ ప్లానెట్ ఎర్త్ '' అని మరోసారి అడిగారట. తీరా తర్వాత అసలు విషయం అర్థమైందట.

ఓ తప్పు సంఖ్య డయల్ చేయడం రాంగ్ కాల్ కు

పొరపాటున రాంగ్ నంబర్ చేశానని కిమ్ గ్రహించారు. ఓ తప్పు సంఖ్య డయల్ చేయడం రాంగ్ కాల్ కు కారణమైందని, ఆ మహిళకు క్షమాపణలు చెప్తూ కిమ్ పీక్ ట్వీట్ చేశారు.

43 ఏళ్ళ హెలికాఫ్టర్ పైలట్ అయిన కిమ్ పీక్

43 ఏళ్ళ హెలికాఫ్టర్ పైలట్ అయిన కిమ్ పీక్ ఈ యాత్ర కోసం సుమారు 28 నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. యాత్రలో భాగంగా 173 రోజులు అంతరిక్షంలో వివిధ ప్రయోగాలు నిర్వహించనున్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write Hello Is This Planet Earth?' Astronaut Dials Wrong Number On Christmas Call From Space
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot