Home
News

జపాన్‌లో నేతాజీ దహనం: మిస్టరీ వీడినట్టేనా..

By Hazarath

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం మిస్టరీ గురించిన సస్పెన్స్ దాదాపు వీడిపోయింది. ఆయన విమానప్రమాదంలో తీవ్రంగా గాయపడా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారని ఇప్పటికే ఆయన బంధువులు అంగీకరించగా తాజాగా అందుకు సంబంధించిన మరింత సమాచారం వెలువడింది.

Read more : మరణానికి ముందు ఏం జరిగింది ?

1945 ఆగస్టు 22న తైపీలో నేతాజీ మృతదేహానికి అంతిమ సంస్కారం జరిగిందని అంతకుముందు ఆయన పేరును ఇచిరో ఒకురోగా పేర్కొంటూ డెత్ సర్టిఫికేట్ జారీ అయిందని అప్పటి తైపీ అధికారి టాన్ టిటి చెప్పినట్లున్న కొన్ని పత్రాలు బోస్ ఫైల్స్ వెబ్‌సైట్ లో పేర్కొంది.

Read more: ఖాదీ దుస్తులే కొంపముంచాయా..? నేతాజీ మంటల్లో..

1945 ఆగస్టు 18వ తేదీన తైపీ శివార్లలోని ఒక వైమానిక కేంద్రంలో

1945 ఆగస్టు 18వ తేదీన తైపీ శివార్లలోని ఒక వైమానిక కేంద్రంలో

భారత స్వాతంత్య్ర పోరాటయోధుడు బోస్.. 1945 ఆగస్టు 18వ తేదీన తైపీ శివార్లలోని ఒక వైమానిక కేంద్రంలో విమానప్రమాదంలో చనిపోయినట్లు పలు విచారణ నివేదికలను ఉటంకిస్తూ ఈ వెబ్‌సైట్ కొన్ని పత్రాలను బహిరంగ పరచిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో విడుదల చేస్తున్న చివరి పత్రాల్లో భాగంగా.

ఈ క్రమంలో విడుదల చేస్తున్న చివరి పత్రాల్లో భాగంగా.

ఈ క్రమంలో విడుదల చేస్తున్న చివరి పత్రాల్లో భాగంగా.. బ్రిటన్ విదేశాంగ కార్యాలయంలో.. ఎఫ్‌సీ1852/6 ఫైల్ నంబరుతో ఉన్న తైవాన్ అధికారి సాక్ష్యం పత్రాన్ని తాజాగా వెబ్‌సైట్‌లో ప్రచురించింది.

1956 సంవత్సరానికి చెందిన ఈ పత్రం ప్రకారం.

1956 సంవత్సరానికి చెందిన ఈ పత్రం ప్రకారం.

1956 సంవత్సరానికి చెందిన ఈ పత్రం ప్రకారం.. 1945 ఆగస్టు 22వ తేదీన బోస్ అంత్యక్రియలు జరిగాయని.. నాడు తైపీ నగరంలో అంత్యక్రియల అనుమతులను జారీ చేసే అధికారి టాన్ టి-టి సాక్ష్యం ఇచ్చారు.

అంతకుముందు రోజు అంటే 1945 ఆగస్టు 21వ తేదీన

అంతకుముందు రోజు అంటే 1945 ఆగస్టు 21వ తేదీన

అయితే.. అంతకుముందు రోజు అంటే 1945 ఆగస్టు 21వ తేదీన ఇచిరో ఒకురా అనే పేరుతో ఉన్న మరణ ధ్రువీకరణ పత్రాన్ని.. బోస్ భౌతికకాయంతో పాటు వచ్చిన జపాన్ సైనికాధికారి ఒకరు తైపీ అధికారులకు సమర్పించారు.

మరుసటి రోజు ఆగస్టు 22వ తేదీన

మరుసటి రోజు ఆగస్టు 22వ తేదీన

మరుసటి రోజు ఆగస్టు 22వ తేదీన.. భౌతికకాయంతో వచ్చిన సదరు జపాన్ అధికారి.. అది భారత నాయకుడు (కమాండర్) బోస్‌దని, ఆయన ఒక ముఖ్యమైన పని మీద టోక్యో వెళుతుండగా విమాన ప్రమాదానికి గురై గాయపడ్డట్లు చెప్పారని టి-టి వాంగ్మూలం ఇచ్చారు.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సైనిక మృతుల బంధువులు అందుబాటులో లేనపుడు సైనిక ఆస్పత్రి ఇచ్చే మరణ ధ్రువీకరణ పత్రం ఆధారంగా అంత్యక్రియలకు అనుమతి ఇవ్వటం జరిగేదని తైవాన్ ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.

ఈమేరకు ఇచిరో ఒకురా అనే పేరును

ఈమేరకు ఇచిరో ఒకురా అనే పేరును

ఈమేరకు.. ఇచిరో ఒకురా అనే పేరును మునిసిపల్ హెల్త్ సెంటర్ రిజిస్టరులో నమోదు చేసి బోస్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు భావిస్తున్నారు. ఆగస్టు 22వ తేదీన జపాన్ అధికారి, ఒక భారతీయుడితో కలిసి కారులో ఒక శవపేటికలో భౌతికకాయంతో వచ్చారని టి-టి పేర్కొన్నారు.

ఆ శవపేటికను టోక్యోకు తీసుకువెళ్లాలనేది తొలుత ఉద్దేశం

ఆ శవపేటికను టోక్యోకు తీసుకువెళ్లాలనేది తొలుత ఉద్దేశం

ఆ శవపేటికను టోక్యోకు తీసుకువెళ్లాలనేది తొలుత ఉద్దేశం కాగా.. అప్పటికి అంత పెద్ద పెట్టె పట్టే విమానాలు లేకపోవటంతో భౌతికకాయానికి తైపీలోనే అంత్యక్రియలు నిర్వహించినట్లు వివరించాడు. సదరు జపాన్ సైనికాధికారితో పాటు వచ్చిన భారతీయుడు బోస్ సహాయకుడు కల్నల్ హబీబుర్ రెహ్మాన్‌గా భావిస్తున్నారు.

అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజు

అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజు

అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజు.. అంటే ఆగస్టు 23వ తేదీన జపాన్ సైనికాధికారి, రెహ్మాన్‌లు ఇద్దరూ వచ్చి బోస్ అస్తికలను తీసుకెళ్లినట్లు టి-టి చెప్పారు.

బోస్‌తో పాటు విమానప్రమాదంలో

బోస్‌తో పాటు విమానప్రమాదంలో

బోస్‌తో పాటు విమానప్రమాదంలో గాయపడి ప్రాణాలతో బయటపడ్డ కల్నల్ రెహ్మాన్ 1945 ఆగస్టు 24న ఇచ్చిన సాక్ష్యం కూడా ఇలాగే ఉంది.

జపాన్ సైనికాధికారుల ఏర్పాట్లతో

జపాన్ సైనికాధికారుల ఏర్పాట్లతో

జపాన్ సైనికాధికారుల ఏర్పాట్లతో బోస్ భౌతికకాయానికి తైహోకు (తైపీకి జపాన్ భాషలో పేరు)లో 1945 ఆగస్టు 22న అంత్యక్రియలు నిర్వహించటం జరిగిందని, ఆ మరుసటి రోజు అస్తికలను తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు.

బోస్‌ఫైల్స్ విడుదల చేసిన పత్రాలు

బోస్‌ఫైల్స్ విడుదల చేసిన పత్రాలు

బోస్‌ఫైల్స్ విడుదల చేసిన పత్రాలు విశ్వసనీయమైనవేనని తాను భావిస్తున్నట్లు నేతాజీ కుమార్తె ప్రొఫెసర్ అనితా ఫాఫ్ పేర్కొన్నారు.

ఈ నెల 23న నేతాజీకి సంబంధించి

ఈ నెల 23న నేతాజీకి సంబంధించి

ఈ నెల 23న నేతాజీకి సంబంధించి ఇండియా వద్ద నున్న మరికొన్ని రహస్య పత్రాలను ప్రధాని స్వయంగా బహిర్గతం చేయనున్నారు.

నేతాజీ మృతిపై గాంధీజీ గందరగోళం

నేతాజీ మృతిపై గాంధీజీ గందరగోళం

Best Mobiles in India

English summary
Here Write Netaji's Death Cremation Records Released Online
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X