డెవిల్స్ ట్రయాంగిల్ : అక్కడ చస్తే ఆనవాళ్లు కూడా చిక్కవు

Written By:

ఆ సముద్ర ప్రాంతం పై ఎగిరే విమానాలు అకస్మాత్తుగా కూలిపోతాయి. ఆ ప్రాంతంలో పయనించే నౌకలు ఒక్కసారిగా... ఏదో అదృశ్య శక్తి తనలోకి లాగేసుకున్నట్టుగా అమాంతం మునిగిపోతాయి. వాటి అవశేషాలు కూడా లభించవు. ఒకటి కాదు రెండు కాదు... గత శతాబ్ద కాలంలో సుమారు 30కి పైగా ఇలాంటి సంఘటనలు చరిత్ర పుటల్లో నిక్షిప్తమయ్యాయి.అంతుచిక్కని మిస్టరీగా మిగిలిన ఆ ప్రాంతమే 'బెర్ముడా ట్రయాంగిల్‌'.'డెవిల్స్‌ ట్రయాంగిల్‌'గా కూడా పిలవబడే ఈ ప్రాంతంలో ఇంతకీ ఏం జరుగుతోంది? ఆ ప్రాంతంలో అసలేముంది? దీనికి సమాధానాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ ప్రాంతంలో సముద్ర గర్భంగా కిలోమీటరు వెడల్పు, దాదాపు 150 అడుగుల లోతైన క్రేటర్స్ (అగ్ని బిలాలు) ఎన్నో ఉన్నాయని గుర్తించారు. వీటి అడుగు భాగం నుంచి పెద్దఎత్తున మిథేన్ వెలువడుతోందని, దీనికి ఉన్న మండే స్వభావం కారణంగా భారీ పేలుళ్లు జరుగుతున్నాయని గుర్తించారు.

డెవిల్స్ ట్రయాంగిల్ : అక్కడ చస్తే ఆనవాళ్లు కూడా చిక్కవు

ఒకసారి మిథేన్ మండిపోయిన ప్రాంతంలో ఏర్పడే శూన్యాన్ని పూరించేందుకు సముద్ర జలాలు ఒక్కసారిగా బిలాల్లోకి దుముకుతుండటంతో, ఉపరితలంపై నీటి గుంతలు ఏర్పడి భారీ నౌకలు మునిగిపోతున్నాయని అంచనా వేస్తున్నట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. విమానాలు కూలిపోవడానికి కూడా ఇదే కారణం కావచ్చని, తమ శోధనతో బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ దాదాపు వీడినట్టేనని, మరిన్ని సాక్ష్యాల కోసం ఇంకా అధ్యయనం చేయాల్సి వుందని అంటున్నారు.

Read more: ఏరియా 51 :అంతులేని రహస్యాల పుట్ట

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లోరిడాలోని నావల్ ఎయిర్ స్టేషన్

ఫ్లోరిడాలోని నావల్ ఎయిర్ స్టేషన్.. టీబీఎమ్ అవెంజర్స్ రకానికి చెందిన 5 బాంబర్ విమానాలు ‘ఫ్లైట్-19' అనే కోడ్ నేమ్‌తో రోజువారీ శిక్షణలో భాగంగా టేకాఫ్ తీసుకున్నాయి. అవి బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా ప్రయాణించాల్సి ఉంది. దాని కెప్టెన్ నుంచి ఓ సందేశం వచ్చింది.

మేము తెల్లటి నీటి ప్రాంతంలో ప్రవేశిస్తున్నాం

మేము తెల్లటి నీటి ప్రాంతంలో ప్రవేశిస్తున్నాం.. దిక్సూచీలు పనిచేయట్లేదు. మేం ఎటు వెళ్తున్నామో తెలియడం లేదు'' అని. తర్వాత రాడార్‌పై విమానాలు కనిపించలేదు. అందులో ప్రయాణిస్తున్న 13 మంది సిబ్బంది, ఆ విమానాలు ఏమయ్యాయో నేటికీ తెలియలేదు. అయితే, వాటి అదృశ్యానికి బెర్ముడా ట్రయాంగిల్‌కు ఉన్న సంబంధమేంటి?

యుద్ధం లేకుండా ఎక్కువ మంది సైనికులు మరణించిన ఘటన

అమెరికా నౌకాదళం చరిత్రలో యుద్ధం లేకుండా ఎక్కువ మంది సైనికులు మరణించిన ఘటన (యు.ఎస్‌. ఎస్‌. సైక్లోప్స్‌) అదృశ్యమవ్వడం. మార్చి 4, 1918న బార్బడోస్‌లో బయలుదేరిన ఈ యుద్ధనౌక, 309 మంది సిబ్బందితో సహా అంతులేకుండా అదృశ్యమైంది. స్పష్టమైన కారణం ఏమీ కనిపించడంలేదు. తుపానులు, శత్రువుల దాడి, మునిగిపోవడం వంటి అనేక కారణాలను పరిశోధకులు ఊహిస్తున్నారు.

20 నిమిషాల ముందు రాడార్‌ స్క్రీన్‌ల మీద కొంతసేపు ..

1970లో ఒక విమానం అమెరికాలోని మియామి విమానాశ్రయంలో దిగడానికి 20 నిమిషాల ముందు రాడార్‌ స్క్రీన్‌ల మీద కొంతసేపు కనిపించకుండా పోయింది. 10 నిమిషాల తరువాత రాడార్‌లు దానిని తిరిగి కనుగొన్నాయి. విమానం ప్రయాణీకులతో బాటు సురక్షితంగా భూమిమీద దిగింది.

విమానంలోని గడియారాలన్నీ సరైన సమయంకన్నా ..

విమానం పయనిస్తున్న సమయంలో అందులోని సిబ్బందికి ఏదీ వింతగా కన్పించలేదు. అయితే విమానంలోని గడియారాలన్నీ సరైన సమయంకన్నా పదినిమిషాలు తక్కువ సమయం చూపుతున్నట్లు గమనించారు. గడియారంలో కన్పించి న తేడా ప్రయాణ కాలంలోనే జరిగింది. విమానం కాంతివేగంతో ప్రయాణించినట్లయితే ఈ విధమైన వ్యత్యాసాలు వస్తాయి. ఇదీ ఐన్‌ స్టీన్‌ సాపేక్షతా సిద్ధాంతం చెప్పే నిజం. కాని విమానం ఏదీ అంతవేగంతో ప్రయాణించలేదు.

వాయుగుండాలకు ఏమైనా సంబంధం ఉందా? ..

మరి విమానాలు రాడార్‌లకు కనుమరుగవడం, గడియారాలు ఆలస్యంగా తిరగడం వంటి సంఘటనలకు వాయుగుండాలకు ఏమైనా సంబంధం ఉందా? విమానం ఎటువంటి వానికి లోనుకాకుండా బెర్ముడా ట్రయాంగిల్‌ నుండి బయటపడిందా? ఇదెలా సాధ్యం? వంటి ప్రశ్నలు ఎదురవుతాయి. ఒక సిద్ధాంతం ప్రకారం విశ్వం, అంతరిక్షం సమతలంగా లేవు. అందువల్ల విమానం కొంత సమయం కనుమరుగవ్వడానికి వీలుంది అంటున్నారు.

'డెవిల్ ట్రయాంగిల్'

బెర్ముడా ట్రయాంగిల్ వాయవ్య అట్లాంటిక్ ప్రాంతంలోని ఒక అంతుచిక్కని ప్రాంతం. దీన్నే 'డెవిల్ ట్రయాంగిల్' అని కూడా పిలుస్తారు. వందల ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఏదో జరుగుతోందన్న వాదనలు, ఆందోళనలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇప్పటిదాకా 30 ఓడలు, 40 దాకా విమానాలు..

ఈ ప్రాంతంలోకి వచ్చిన ఓడలు, విమానాలు గల్లంతవడం, అందులోని మనుషుల జాడ కూడా తెలవకపోవడంతో ఇది మిస్టరీ ప్రాంతంగా మిగిలిపోయింది. ఇప్పటిదాకా 30 ఓడలు, 40 దాకా విమానాలు ఈ ప్రాంతంలో కూలాయి.

ఇక్కడ ఏదో శక్తి ఉందని, గ్రహాంతర వాసులు ఇదంతా చేస్తున్నారని..

బెర్ముడా ట్రయాంగిల్ సమీపంలోకి రాగానే భారీ ఓడలు, విమానాలు అనూహ్యంగా అదృశ్యమవడం, కనీసం వాటి ఆనవాళ్లు కూడా లభించకపోవడం వెనక అనేక కథలు, వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఏదో శక్తి ఉందని, గ్రహాంతర వాసులు ఇదంతా చేస్తున్నారని ప్రజలు, రచయితలు రకరకాల వాదనలు చేస్తున్నారు. వీటిపై జరిగిన పరిశోధనలు మాత్రం అలాంటివాటికి ఆధారాలేం లేవని చెబుతున్నాయి.

అమెరికా, యూరప్, కరీబియన్‌ దేశాలకు చెందిన పలు ఓడలు..

ప్లోరిడా జలసంధి, బహామా దీవులు, కరీబియన్ దీవి ఇంకా అజెరాస్ తూర్పుభాగాన ఉన్న అరేబియన్ సముద్రం వీటి మధ్య విస్తరించిన ట్రెపిజాయిడ్‌ను కలిపి బెర్ముడా ట్రయాంగిల్'గా వ్యవహరిస్తారు. ఎక్కువ ప్రమాదాలు ఫ్లోరిడా తీరం, బహామా దీవుల్లోనే జరిగినట్లు చెబుతారు. ఇది చాలా రద్దీ ప్రాంతం. తరచు అమెరికా, యూరప్, కరీబియన్‌ దేశాలకు చెందిన పలు ఓడలు ఇక్కడ కనిపిస్తుంటాయి.

‘సాగర అంతర్వాహిని'(గల్ఫ్‌స్ట్రీమ్ )

ఈ ప్రాంతంలో సముద్రం అడుగున ‘సాగర అంతర్వాహిని'(గల్ఫ్‌స్ట్రీమ్ ) ప్రవహిస్తుందని, అదే ప్రమాదాలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఇక్కడ హఠాత్తుగా తుపానులు చెలరేగి వెంటనే సమసిపోతుంటాయి.

పడవ అక్కడికి వెళ్ళేసరికి ఆ పడవ అక్కడలేదు..

ఇది తన ప్రవాహంలో తేలే వస్తువులను లాగుకువెళ్ళిపోవడం సహజం. 1967 డిసెంబరు 22న జరిగిన ప్రమాదంలో విచ క్రాప్ట్‌ అనే పడవ ఒక చోటునిండి సమాచారం పంపింది కాని రక్షణాబలగం వారి పడవ అక్కడికి వెళ్ళేసరికి ఆ పడవ అక్కడలేదు.

కొలంబస్‌కూ అనుభవమే!

ఈ ప్రాంతంలో అసాధారణమైన పరిస్థితులు ఉన్నాయని క్రిస్టఫర్ కొలంబస్ రాశాడు. ఇక్కడ క్షితిజ రేఖలో ఏవో వెలుగులు కనిపిస్తున్నాయని, దిక్సూచీ కొలతలు సైతం అసంబద్ధంగా, అసాధారణంగా ఉన్నాయని 1492, అక్టోబరు 2న తన లాగ్‌బుక్‌లో రాశాడు. కొలంబస్ అనుమానాలకు ఆధునిక శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన చూసిన వెలుగులు అక్కడ దీవి వారు వంట చేసుకుంటే వచ్చిన వెలుగులుగా చెబుతున్నారు.

శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

బెర్ముడా ట్రయాంగిల్‌లో ఏం జరుగుతోందన్న విషయం తేల్చేందుకు ఆ ప్రాంతంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు పర్యటించారు. వారికి అక్కడ అసాధరణంగా ఏదీ కనిపించలేదు. కానీ, కొన్ని ఆసక్తికర విషయాలు వారి దృష్టికి వచ్చాయి. ఆ ప్రాంతంలో బలమైన సుడిగుండాలు ఏర్పడతాయి.

200 కిలోమీటర్ల మేర వ్యాసార్థంలో

ఇవి ఒక్కోసారి 200 కిలోమీటర్ల మేర వ్యాసార్థంలో ఉండటం గమనార్హం. భ్రమణంలో ఉన్న వస్తువుపై ఎలాంటి భూమ్యాకర్షణ శక్తి పనిచేయదు. కాబట్టి. ఈ సుడిగుండాల్లో చిక్కిన ఓడలు, తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలు వీటిలో చిక్కుకుపోతున్నాయని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.

అన్నీ అభూత కల్పనలే

బెర్ముడా ట్రయాంగిల్‌కు సంబంధించిన వెలువడుతున్న సంచలనాలపై ఆరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ డేవిడ్ క్వొశ్చె పరిశోధన చేశాడు. 1975లో బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ అనే పుస్తకం ప్రచురించాడు. అక్కడ జరిగే ప్రమాదాలు అసాధారణమైనవి కాదని స్పష్టంచేశాడు.రచయితలు, మీడియా వ్యక్తులు అసత్యాలు, అభూత కల్పనలు ప్రచారం చేశారని వాదించాడు.

అవన్నీ సంచలనాల కోసం చేసిన ప్రయత్నాలుగా..

అవన్నీ సంచలనాల కోసం చేసిన ప్రయత్నాలుగా తన పుస్తకంలో అభివర్ణించాడు. అక్కడ జరిగిన ప్రమాదాలలో కొన్ని ప్రకృతి విపత్తుల వల్ల సంభవిస్తే..మరికొన్ని మానవ తప్పిదాల వల్ల జరిగాయని వివరించాడు. బెర్ముడా ట్రయాంగిల్‌తో సంబంధం లేని ఘటనలను కూడా దానితో ముడిపెట్టి రాశారని ఆరోపించాడు. అంతేకాకుండా వాటికి బెర్ముడా ట్రయాంగిల్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆధారాలతో పేర్కొన్నాడు.

అయితే అది గాలి ప్రభావమని కొందమంది..

అయితే అది గాలి ప్రభావమని కొందమంది వాదిస్తారు. ఈ ప్రమాదాలు జరిగినపుడు అచట బలమైన గాలులు వీచిన సాక్ష్యాలు లేవు కదా? అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. దానికి సమాధానంగా గురుత్వాకర్షణశక్తిని తెరమీదకు తెస్తున్నారు. అంతరిక్ష పరిశోధకులకు ఈ గురు త్వాకర్షణశక్తి, ప్రభావం బాగా అనుభవంలో ఉంటుందని వివరణగా చెబుతున్నారు.

మిథేన్‌ నిల్వల గురించి ఒక శ్వేతపత్రం..

1981లో అమెరికా జియొలాజి కల్‌ సర్వే వారు అమెరికా తీర్రపాంతాలలో ఉన్న మిథేన్‌ నిల్వల గురించి ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే వారి వెబ్‌ సైటులో ఉన్న సమాచారం ప్రకారం ‘బెర్ముడా త్రికో ణం' అనబడుతన్న ప్రాంతంలో పెద్దయెత్తున మిథేన్‌ వాయువు విడుదలైన దాఖలాలు ఏమీ లేవు.

బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఇప్పటికీ ఓ అంతుచిక్కని మిస్టరీలానే ..

ఏది ఏమైనా బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఇప్పటికీ ఓ అంతుచిక్కని మిస్టరీలానే మారింది. శాస్ర్తవేత్తలకు సవాల్ విసురుతోంది. తెలుసుకోవాలని ప్రయత్నించిన వారు అచూకి గల్లంతైంది. దినదినాభిృద్ధి చెందుతున్న సైన్స్ ను ముప్ప తిప్పులు పెడుతోంది. మానవ మేదస్సుకే సవాల్ విసురుతోంది.మరి ఈ మిస్టరీని త్వరలో చేధిస్తారని ఆశిద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write bermuda-triangle-according-the-science-technology
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot