Home
News

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న 10 ఇయర్‌ఫోన్‌లు

ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు దానికి తగ్గట్టుగా స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ఉపకరణాలలో ఒకటి అయిన ఇయర్ ఫోన్స్ ఉపయోగించడం సర్వసాధారణం అయింది. యూజర్స్ ఛార్జర్లు, మొబైల్ కేసులు మరియు పవర్ బ్యాంకులు వంటి వాటితో పోటీపడి మరి వీటిని కొంటున్నారు. ముందు రోజులో చాలా రకాల ఫోన్ తయారీ సంస్థలు ఫోన్ బాక్స్ లోపల చవకైన ఇయర్‌ఫోన్‌లను జతచేసి ఇచ్చేవారు.

ఇయర్ ఫోన్స్

ఇప్పుడు వున్న గట్టి పోటీ ప్రపంచంలో ఇయర్ ఫోన్స్ వాడకం చాలా గణనీయంగా పెరిగింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ధోరణి బడ్జెట్ లేదా మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితం కాలేదు.అయితే ఈ ధోరణి పెరుగుదల స్మార్ట్‌ఫోన్ అనుబంధ మార్కెట్లు అయిన ఇయర్‌ఫోన్‌ల మీద డిమాండ్‌ను మరింత పెంచింది.

ఇయర్‌ఫోన్‌లను

మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలు పెరగడం మరియు సరసమైన ధరలకు మొబైల్ ఇంటర్నెట్ యొక్క యాక్సిస్ రావడం కూడా ఇయర్ ఫోన్‌ల యొక్క అవసరం చాలా గణనీయంగా పెరిగింది. వీటి యొక్క సమూహం పెరగడం వలన కొనుగోలుదారులు ఒక జత ఇయర్‌ఫోన్‌లను కొనడానికి ప్రేరిపిస్తాయి. చాలా మంది కొనుగోలుదారులు ఒక జత ఇయర్‌ఫోన్‌లను కొనుగోలు చేసేటప్పుడు తమ బ్యాంక్ ఖాతా నుండి ఎక్కువ మొత్తాన్ని వెచ్చించడానికి ఇష్టపడరు. బదులుగా వారు తక్కువ ధరలో గల ఒక మంచి ఇయర్ ఫోన్స్ జత కోసం చూస్తారు. కాబట్టి అటువంటి సమస్యలతో మీకు సహాయం చేయడానికి మార్కెట్లో 1,000 రూపాయల కన్నా తక్కువ ధరకు లభించే 10 ఇయర్ ఫోన్‌ల జాబితాను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

1 మోర్ పిస్టన్ ఫిట్

1 మోర్ పిస్టన్ ఫిట్

ఈ జాబితాలో ముందువరుసలో ఉన్నది 1 మోర్ పిస్టన్ ఫిట్ ఇయర్‌ఫోన్‌లు. ఈ జత ఇయర్‌ఫోన్‌లు గత రెండు సంవత్సరాలుగా ధర పరంగా మరియు నాణ్యత పరంగా చాలా ప్రశంసలు పొందాయి. పిస్టన్ ఫిట్‌లో 45-డిగ్రీల రూపకల్పనతో పాటు అల్యూమినియం అల్లాయ్ సౌండ్ చాంబర్ మరియు మెటల్ డయాఫ్రాగమ్ ఉన్నాయి. అవి అంతర్నిర్మిత బటన్ మరియు మైక్రోఫోన్‌తో ఇన్-లైన్ ఆడియోను నియంత్రణ చేయవచ్చు. 1 మోర్ ఇయర్ ఫోన్‌లను మరింత నియంత్రించడానికి వినియోగదారులను అనుమతించే "స్మార్ట్ బర్న్-ఇన్" యాప్ ను కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు దీనిని కేవలం 699 రూపాయలకు పొందవచ్చు.

సోనీ MDR AS210AP &  MDR EX155

సోనీకి చెందిన MDR AS210AP ఇయర్‌ఫోన్‌లు ఉత్తమమైన వాటిలో తదుపరి వరుసలో ఉన్నాయి. ఈ జత ఇయర్‌ఫోన్‌ల యొక్క హైలైట్ విషయం ఏమిటంటే ఇది వర్కవుట్ చేయడానికి ఇష్టపడే వ్యక్తు కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఈ జత క్లిప్ ఆన్-ఇయర్ లూప్ మరియు పొడవైన కేబుల్ కోడ్‌తో పాటు వస్తుంది. ఇయర్‌ఫోన్‌లు ఏదైనా పని చేసేటప్పుడు దానికి అనుకూలంగా ఉండేలా ఉంటాయి. రిమోట్ ఫంక్షన్లను మరింత అనుకూలీకరించడానికి ఈ జత "స్మార్ట్ కీ" యాప్ తో వస్తుంది. ఇది మంచి ఆడియో కోసం 13.5 మిమీ ఆడియో డ్రైవర్‌తో పాటు ఇన్-లైన్ మైక్రోఫోన్‌ని కూడా కలిగి ఉంది. కొనుగోలుదారులు వాటిని కేవలం 999 రూపాయలకు పొందవచ్చు. అలాగే సోనీ MDR EX155 ఇయర్‌ఫోన్‌లు 899 రూపాయల ధర వద్ద పొందవచ్చు.

ఆడియో-టెక్నికా ATH COR150 & ATH CLR100iS

ఆడియో-టెక్నికా ATH COR150 & ATH CLR100iS

ఆడియో-టెక్నికా ATH COR150 ఇయర్‌ఫోన్‌లు ధర కోసం అద్భుతమైన విలువను అందిస్తున్నాయి. ఈ జత ఇయర్‌ఫోన్‌లు 8.5mm డైనమిక్ డ్రైవర్లను కలిగి ఉంటాయి. ఆడియో-టెక్నికా తొలగించగల ఓవల్ హ్యాంగర్‌లను కూడా కలిగిఉంది. ఇది "స్నాప్-ఆన్, స్నాప్-ఆఫ్" ఇయర్ హుక్స్ తో కూడా వస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు వాటిని కేవలం 729 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆడియో-టెక్నికా ATH CLR100iS ఇయర్‌ఫోన్‌లు కూడా 699 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

JBL-T210 & JBL -T110

JBL-T210 & JBL -T110

మెరుగైన సౌండ్ కోసం నియోడైమియం మాగ్నెట్‌తో T 210 ఇయర్‌ఫోన్‌లు 8.7 mm డ్రైవర్లతో వస్తాయి. ఈ జత ఇయర్‌ఫోన్‌లు అంతర్నిర్మిత మైక్రోఫోన్ మరియు ఇన్-లైన్ మీడియా ప్లేబ్యాక్ నియంత్రణలతో వస్తాయి. ఈ ఇయర్‌ఫోన్‌లను కొనుగోలు చేసిన వారికి బాక్స్‌లో జెబిఎల్ యొక్క అదనపు ఇయర్-టిప్స్ లను అందిస్తుంది. ఈ జత ఇయర్‌ఫోన్‌లు చిక్కులేకుండా ఉన్న కేబుళ్లతో కూడా రావడం గమనించాల్సిన విషయం. వీటిని కేవలం 899 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి బడ్స్ 2

రియల్‌మి బడ్స్ 2

రియల్‌మి సంస్థ ఇటీవల మార్కెట్లో ప్రారంభించిన రెండవ తరం వైర్డ్-ఇయర్ ఫోన్స్ రియల్‌మి బడ్స్ 2.రియల్‌మి బడ్స్ 2 సౌండ్ స్టేజ్, ఆడియో యొక్క నాణ్యత విషయానికి వస్తే రియల్‌మి యొక్క ముందు తరం ఇయర్‌ఫోన్‌ల కంటే గణనీయమైన మెరుగుదలలు పొందింది. ఈ మెరుగుదలలు రియల్‌మి బడ్స్ 2 యొక్క జంట ఇన్-లైన్ నియంత్రణలు మరియు అంతర్నిర్మిత మైక్రోఫోన్‌తో కూడా వస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు వీటిని కేవలం 599 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

షియోమి Mi బేసిక్ వైర్డ్ హెడ్‌సెట్

షియోమి Mi బేసిక్ వైర్డ్ హెడ్‌సెట్

Mi బేసిక్ వైర్డ్ హెడ్‌సెట్ బుడ్జెక్ట్ శ్రేణిలోని వ్యక్తుల కోసం అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు సరసమైన ఇయర్‌ఫోన్‌లలో ఒకటి. ఈ జత ఇయర్‌ఫోన్‌లలో "అల్ట్రా-డీప్ బాస్" టెక్నాలజీతో పాటు 10mm ఆడియో డ్రైవర్లు ఉన్నాయి. ఇది ప్లేబ్యాక్ నియంత్రణ మరియు అంతర్నిర్మిత మైక్రోఫోన్ కోసం ఇన్-లైన్ నియంత్రణలతో వస్తుంది. కంపెనీ ఎల్-ఆకారపు ఫోన్ కనెక్టర్‌తో పాటు మెటల్ డయాఫ్రాగమ్‌ను కూడా కలిగి ఉంది. షియోమి ఈ జంటను ఇయర్‌ఫోన్‌లను చెవుల నుండి తేలికగా జారిపోకుండా ఉండేలా రూపొందించినట్లు పేర్కొంది. ఆసక్తిగల కొనుగోలుదారులు వీటిని కేవలం 399 రూపాయలకు పొందవచ్చు.

బోట్ బాస్ హెడ్స్ 100

బోట్ బాస్ హెడ్స్ 100

చివరిగా బోట్ యొక్క ఇయర్‌ఫోన్‌లు బోట్ బాస్ హెడ్స్ 100లు అంతర్నిర్మిత మైక్రోఫోన్ మరియు మీడియా ప్లేబ్యాక్ నియంత్రణలతో పాటు ఇందులో 10mm డ్రైవర్లతో నిర్మించబడి ఉంది. మునుపటి కొన్ని సమర్పణల మాదిరిగానే ఇది బాక్స్‌లో అదనపు ఇయర్-టిప్స్ లను కూడా కలిగి ఉంటుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు వీటిని కేవలం 399 రూపాయలకు పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Best Budget earphones in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X