రియల్‌మి బడ్స్,10,000mAh పవర్‌బ్యాంక్‌,XT ఐకానిక్ కేసు ధర ఎంతో తెలుసా?

|

స్మార్ట్‌ఫోన్‌లను మరియు మొబైల్ ఉపకరణాలను అందించడంలో రియల్‌మి సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రియల్‌మి సంస్థ ప్రస్తుతం రియల్‌మి ఎక్స్‌టి స్మార్ట్‌ఫోన్‌ను నిన్న ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. నిన్న జరిగిన కార్యక్రమంలో రియల్‌మి సంస్థ రియల్‌మి XT స్మార్ట్‌ఫోన్‌తో పాటు సంస్థ యొక్క వైర్‌లెస్ రియల్‌మి బడ్స్ మరియు 10,000 ఎంఏహెచ్ పవర్‌బ్యాంక్‌ను మరియు రియల్‌మి XT ఐకానిక్ కేసును కూడా రిలీజ్ చేసింది.

రియల్‌మి
 

రియల్‌మి యొక్క స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మి యొక్క ఇతర ఉత్పత్తుల మీద ఆసక్తిగల కొనుగోలుదారులు వీటిని కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్‌కు మరియు రియల్‌మి యొక్క అధికారిక వెబ్ సైట్ కు వెళ్ళవచ్చు. ఈ వివరాలతో పాటు కొనుగోలుదారులను ఆకర్షించడానికి రియల్‌మి అనేక లాంచ్ ఆఫర్ వివరాలను కూడా వెల్లడించింది.

రియల్‌మి మొబైల్ ఉపకరణాల వివరాలు

రియల్‌మి మొబైల్ ఉపకరణాల వివరాలు

రియల్‌మి XT ఐకానిక్ కేసు

మొదటగా రియల్‌మి మొబైల్ ఉపకరణాల వివరాలలో రియల్‌మి XT కోసం అందిస్తున్న రియల్‌మి XT ఐకానిక్ కేసు. రియల్‌మి ఎక్స్‌టి ఐకానిక్ కేసు అనేది కొత్తగా రిలీజ్ అయిన రియల్‌మి ఎక్స్‌టి స్మార్ట్‌ఫోన్‌కు "ఆల్ రౌండ్ ప్రొటెక్షన్" అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ప్రొటెక్షన్ కేసు అనేది అక్టోబర్ నుండి రియల్‌మి.కామ్‌లో 399 రూపాయలకు లభిస్తుంది. ఇవి రాబోయే నెలల్లో ఆఫ్‌లైన్ దుకాణాలలో కూడా లభిస్తాయి.

రియల్‌మి పవర్ బ్యాంక్

రియల్‌మి పవర్ బ్యాంక్

రియల్‌మి కంపెనీ ప్రారంభించిన రెండవ మొబైల్ యాక్సెసరీ రియల్‌మి పవర్ బ్యాంక్. ఇది 10,000WAh హై-డెన్సిటీ బ్యాటరీతో పాటు 18W టూ-వే క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. రియల్‌మి పవర్ బ్యాంక్‌లో డ్యూయల్ అవుట్‌పుట్‌తో యుఎస్‌బి టైప్-సి పోర్ట్ మరియు యుఎస్‌బి టైప్-ఎ పోర్ట్‌ను జోడించబడి ఉంది. డ్యూయల్ అవుట్పుట్ ద్వారా వినియోగదారులు తమ ల్యాప్‌టాప్ మరియు స్మార్ట్‌ఫోన్ రెండింటినీ ఒకే సమయంలో రియల్‌మి పవర్ బ్యాంక్‌తో ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది.

పవర్ బ్యాంక్
 

రియల్‌మి పవర్ బ్యాంక్ 12 పొరల సర్క్యూట్ రక్షణ వలయంతో వస్తుందని ప్రకటనలో తెలిపింది. అదనంగా రియల్‌మి పవర్ బ్యాంక్ మూడు వేర్వేరు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ పవర్ బ్యాంక్ ధర 1,299 రూపాయలు. ఆసక్తిగల కొనుగోలుదారులు రియల్‌మి.కామ్, ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది సెప్టెంబర్ చివరి నుండి అమ్మకాలు మొదలవుతాయి.

రియల్‌మి బడ్స్ వైర్‌లెస్‌

రియల్‌మి బడ్స్ వైర్‌లెస్‌

రియల్‌మి అందిస్తున్న రియల్‌మి బడ్స్ వైర్‌లెస్‌ను కూడా ఇటీవల ప్రారంభించింది. రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ డిజైన్ మరియు కార్యాచరణ పరంగా వన్‌ప్లస్ బుల్లెట్ వైర్‌లెస్ 2 ను పోలి ఉంటుంది. అవి నికిల్-టైటానియం ఆకారపు మెమరీ మిశ్రమం నుండి తయారైన నెక్‌బ్యాండ్‌తో వస్తాయి. మల్టీ-లేయర్ కాంపోజిట్ డయాఫ్రాగంతో కంపెనీ 11.2 ఎంఎం బాస్ బూస్ట్ డ్రైవర్‌ను జోడించింది.

ఇయర్‌ఫోన్‌లను

ఇది 10 నిమిషాల ఛార్జింగ్ తో 12 గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. ఈ జత ఇయర్‌ఫోన్‌లను ట్యూన్ చేయడానికి అలాన్ వాకర్‌తో జతకట్టిందని రియల్‌మి పేర్కొంది. అవి బ్లూటూత్ v5.0, ఇన్-లైన్ బటన్లు మరియు IPX4 స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో వస్తాయి. మూడు వేర్వేరు కలర్ ఎంపికలతో వీటిని విడుదల చేసారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme launched Mobile Accessories in India: Price, Offers and Availability

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X