Rs.20,000 ధర లోపు కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో బెస్ట్ ఇవే...

|

ప్రపంచం మొత్తాన్ని గత మూడు నెలల నుండి కరోనా వైరస్ వణికిస్తున్నది. స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు తమ యొక్క కొత్త ‌ఫోన్‌లను ఆన్ లైన్ స్ట్రీమింగ్ పద్ధతి ద్వారా విడుదల చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీలు గత కొన్ని వారాల నుండి ఇండియాలో తమ ఫోన్లను వివిధ రకాల ధరల విభాగాలలో విడుదల చేస్తున్నాయి.

 

Best New Smartphones Under 20000

Best New Smartphones Under 20000

దేశవ్యాప్తంగా ఇ-కామర్స్ సంస్థలు డెలివరీలను తిరిగి ప్రారంభించినందున అన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్‌ల బ్రాండ్లు తమ ఉత్పత్తులను అమ్మకానికి ఉంచాయి. వీటిలో ఆపిల్, శామ్‌సంగ్, రియల్‌మి, షియోమి, వివో మరియు ఒప్పో సంస్థల యొక్క స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఉన్నాయి. ఇటీవల లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లలో రూ.20,000 కంటే తక్కువ ధర గల ఫోన్లలో ఉత్తమంగా ఉన్న వాటి గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:OPPO A12 అద్భుతమైన ఫీచర్స్ మరియు గేమ్ ఇన్నోవేషన్‌లతో రూ.9,990 లకే స్మార్ట్‌ఫోన్

Samsung Galaxy M11 ధర

Samsung Galaxy M11 ధర

శామ్‌సంగ్ గెలాక్సీ M11 రూ.10,999 ధర వద్ద ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్‌ మరియు ఫ్లిప్‌కార్ట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 SoC ప్రాసెసర్‌తో రన్ అవుతూ 5000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది. అలాగే ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది.

Samsung Galaxy M01 ధర
 

Samsung Galaxy M01 ధర

రూ.8,999 బడ్జెట్ ధరలో విడుదల అయిన శామ్సంగ్ గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్ ను ఇప్పుడు అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5.7-inc HD + డిస్ప్లే ను కలిగి ఉండి స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అలాగే ఇది వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉండడమే కాకుండా 4000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Samsung Galaxy A31 ధర

Samsung Galaxy A31 ధర

సామ్‌సంగ్ సంస్థ నుండి వస్తున్న మరొక స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ A31. ఇది రూ.21,999 ధర వద్ద అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్లు మరియు ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది మీడియాటెక్ హెలియో P 65 ప్రాసెసర్‌తో రన్ అవుతూ వెనుక భాగంలో క్వాడ్- కెమెరా సెటప్ ను కలిగి ఉంది.

Realme Narzo 10 ధర & సేల్స్

Realme Narzo 10 ధర & సేల్స్

రియల్‌మి సంస్థ లాక్ డౌన్ సమయంలో విడుదల చేసిన బడ్జెట్ ఫోన్లలో రియల్‌మి నార్జో 10 రూ.11,999 ధర వద్ద అద్భుతమైన స్పెసిఫికేషన్ లను కలిగి ఉంది. దీనిని ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి‌.కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 6.5-అంగుళాల హెచ్‌డి + స్క్రీన్‌ను కలిగి ఉండి మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్‌లో రన్ అవుతూ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉండి 5000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Realme Narzo 10A ధర & సేల్స్

Realme Narzo 10A ధర & సేల్స్

రూ.8,499 బడ్జెట్ ధరలో లభించే రియల్‌మి నార్జో 10A స్మార్ట్‌ఫోన్ సో బ్లూ మరియు సో వైట్ కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. దీన్ని కూడా ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి UIతో నడుస్తుంది. ఇది మీడియాటెక్ హెలియో జి 70 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Honor 9X Pro ధర

Honor 9X Pro ధర

హానర్ సంస్థ కొత్తగా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లో హానర్ 9X ప్రో రూ .17,999 ధర వద్ద లభిస్తుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ కిరిన్ 810 చిప్‌సెట్‌ను కలిగి ఉండి EMUI 9.1 పై రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగి ఉంటుంది.

Xiaomi Redmi Note 9 Pro ధర

Xiaomi Redmi Note 9 Pro ధర

ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో అందరికంటే ముందు వరుసలో ఉన్న షియోమి సంస్థ రూ.13,999 ప్రారంభ ధర వద్ద విడుదల చేసిన రెడ్‌మి నోట్ 9 ప్రోను అమెజాన్ మరియు Mi.కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉండి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండి 5020mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Xiaomi Redmi Note 9 Pro Max ధర

Xiaomi Redmi Note 9 Pro Max ధర

షియోమి రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ ను రూ.16,499 ధర వద్ద అమెజాన్ మరియు Mi.కామ్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇందులో గల క్వాడ్ కెమెరా సెటప్ లో 64 MP ప్రైమరీ లెన్స్‌, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది.

Vivo Y50 ధర

Vivo Y50 ధర

రూ.17,990 ధర వద్ద వస్తున్న వివో Y50 ను ఆఫ్‌లైన్ స్టోర్స్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా కొనుగోలు చేయవచ్చు. 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ గల ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో రన్ అవుతూ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Oppo A12 ధర

Oppo A12 ధర

ఈ నెలలో రూ.9,990 మరియు రూ.11,490 ధర వద్ద 3GB ర్యామ్ మరియు 4GB ర్యామ్ వేరియంట్లలో విడుదల అయిన ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్ ను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 6.22-అంగుళాల వాటర్‌డ్రాప్ డిస్‌ప్లేను కలిగి ఉండి మీడియాటెక్ హెలియో P35 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Best Smartphones Under 20000 in India 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X