OPPO A12 అద్భుతమైన ఫీచర్స్ మరియు గేమ్ ఇన్నోవేషన్‌లతో రూ.9,990 లకే స్మార్ట్‌ఫోన్

|

ప్రముఖ చైనా గ్లోబల్ స్మార్ట్ పరికరాల తయారీ సంస్థ ఒప్పో టాప్-ఆఫ్-ది-లైన్ స్పెసిఫికేషన్లతో స్మార్ట్‌ఫోన్లను తయారుచేసేటప్పుడు అందరికంటే ముందు వరుసలో ఉంటుంది. బ్రహ్మాండమైన స్పెసిఫికేషన్లను ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్లలో కూడా తీసుకువచ్చి మార్కెట్ లో వినియోగదారుల సంఖ్యను పెంచుకున్నది.

OPPO A12 స్మార్ట్‌ఫోన్
 

OPPO A12 స్మార్ట్‌ఫోన్

ఇప్పుడు టాప్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో OPPO A12 స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. రెండు వేరు వేరు వేరియంట్లలో విడుదల అయిన ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. OnePlus 8 Sale: గొప్ప తగ్గింపు ఆఫర్లతో మంచి అవకాశం!!!! త్వరపడండి...

OPPO A12 ధరల వివరాలు

OPPO A12 ధరల వివరాలు

ఒప్పో సంస్థ కొత్తగా విడుదల చేసిన ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్ టాప్-ఎండ్ స్పెసిఫికేషన్లతో ఎంట్రీలెవల్ ధరను కలిగి ఉంది. 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.9,990 మరియు 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.11,490. ఇది బ్లాక్ మరియు బ్లూ కలర్ వేరియంట్ లలో లభిస్తుంది. OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

OPPO A12 లభ్యత & ఆఫర్స్

OPPO A12 లభ్యత & ఆఫర్స్

ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్ ఈ రోజు అంటే 10 జూన్ నుండి అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లు మరియు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అద్భుతమైన ఆఫర్‌లతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ను జూన్ 21 లోపు కొనుగోలు చేసిన వారికి 6 నెలల అదనపు వారంటీని కూడా పొందవచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్లలో వివిధ రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ EMI తో 5 శాతం క్యాష్‌బ్యాక్ మరియు ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI పై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తున్నది. అలాగే వీటి యొక్క క్రెడిట్ కార్డ్ & డెబిట్ కార్డ్ల మీద 6 నెలల వరకు ఎటువంటి అదనపు ఖర్చు లేని EMI ని కూడా పొందవచ్చు.

మీడియా ఫైళ్ళను నిల్వ చేయడానికి స్టోరేజ్ ఎంపికలు
 

మీడియా ఫైళ్ళను నిల్వ చేయడానికి స్టోరేజ్ ఎంపికలు

OPPO A12 స్మార్ట్‌ఫోన్ రెండు వేర్వేరు స్టోరేజ్ మరియు RAM వేరియంట్లలో లభిస్తుంది. 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ మరియు 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఎంపికలతో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ కనెక్టివిటీను కలిగి ఉండడానికి 3-కార్డ్ స్లాట్‌ను కలిగి ఉంది. ఇందులో SD-కార్డ్ స్లాట్ ను ఉపయోగించి మెమొరీని 256GB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. SD కార్డు సహాయంతో వినియోగదారులు అధిక సంఖ్యలో ఫోటోలు, వీడియోలు మరియు ఇతర మల్టీమీడియా ఫైళ్ళను స్టోర్ చేసుకోవచ్చు. క్రొత్త వాటిని స్టోర్ చేయడానికి ఏదైనా ఫైల్‌లను తొలగించడం వంటి సమస్యలకు దీని ద్వారా చెక్ పెట్టవచ్చు.

బ్యాటరీ సామర్ధ్యం

OPPO A12 స్మార్ట్‌ఫోన్ 4,230mAh భారీ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అది రెండు రోజుల పాటు ఫోన్ ఆన్ లో ఉంచడానికి సహాయపడుతుంది. మీరు అధికంగా ఫోన్ ను ఉపయోగించినప్పటికి ఇది రోజంతా పనిచేస్తుంది. ఇది ఒక ఛార్జ్ మీద వినియోగదారులకు 8 గంటల పాటు వీడియో కంటెంట్‌ను వినియోగించుకోవడానికి సహాయపడుతుంది. అలాగే 14 గంటల పాటు సాంగ్స్ వినడానికి ఆన్ లో ఉంటుంది. OPPO A12 మీడియాటెక్ P35 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ చిప్‌సెట్ వినియోగదారు అనుభవాన్ని విస్తరిస్తుంది మరియు పనితీరును మరొక స్థాయికి తీసుకువెళుతుంది.

గరిష్ట భద్రత

గరిష్ట భద్రత

OPPO ఎల్లప్పుడూ వినియోగదారుడి యొక్క భద్రతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. ఇప్పుడు OPPO A12 స్మార్ట్‌ఫోన్‌తో వినియోగదారుల భద్రతను మరొక మెట్టుకు పెంచింది. వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి వెనుకభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చబడి ఉంది. అలాగే గరిష్ట భద్రతను నిర్ధారించడానికి OPPO A12 AI ఫేస్ అన్‌లాక్‌తో కూడ వస్తుంది. ఈ ఫంక్షన్ అనేక సందర్భాల్లో ఉపయోగపడుతుంది మరియు వినియోగదారులకు సురక్షితమైన స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని నిర్ధారిస్తుంది.

ఆర్టిఫిషల్ ఇంటెలిజన్స్ రియర్ కెమెరా సెటప్

ఆర్టిఫిషల్ ఇంటెలిజన్స్ రియర్ కెమెరా సెటప్

OPPO A12 స్మార్ట్‌ఫోన్‌ యొక్క వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 13MP మరియు 2MP సెన్సార్ లతో డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. ఇది ఆర్టిఫిషల్ ఇంటెలిజన్స్ ఫీచర్ ను కలిగి ఉండి ప్రతి విషయాన్ని వివరంగా సంగ్రహిస్తుంది. AI- ఫీచర్ గల శక్తివంతమైన 13MP మెయిన్ కెమెరా ఫోటోలను క్రిస్టల్ స్పష్టమైన వివరాలతో మరియు అధిక రిజల్యూషన్‌తో తీయడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా 2MP డీప్ కెమెరా ప్రతి షాట్‌ను DSLR ఇమేజ్ లాగా చేస్తుంది. ఇది హార్డ్‌వేర్-ఆధారిత పోర్ట్రెయిట్ బోకె ప్రభావంతో జత చేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న వాటిని బ్లర్ చేస్తూ ముఖ్యమైన అంశాన్ని హైలెట్ చేసే ఫీచర్ ను కూడా కలిగి ఉంది.

కెమెరా అల్గోరిథం

కెమెరా అల్గోరిథం

ఈ కెమెరాల సమితిని ఉపయోగించి దృశ్యపరంగా ఆహ్లాదకరమైన కంటెంట్‌ను సృష్టించడం కూడా చేయవచ్చు. ఇందులో గల పిక్సెల్-గ్రేడ్ కలర్-మ్యాపింగ్ అల్గోరిథంను ఉపయోగించి ఫోటోను మరింత క్లారిటీగా చేసే డాజల్ కలర్ మోడ్ వంటి లక్షణాలను కూడా కలిగి ఉంది. ఈ మోడ్ యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి వినియోగదారులు అననుకూలమైన లైటింగ్ పరిస్థితులలో సహజసిద్దమైన దృశ్యాలను సంగ్రహించవచ్చు.

Oppo A12 ఫ్రంట్ కెమెరా

Oppo A12 ఫ్రంట్ కెమెరా

ఇందులో గల 5MP ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే ఇది మీ సోషల్ మీడియా ఫీడ్‌లో వివరణాత్మక సెల్ఫీలను తీసుకోవడానికి సహాయపడుతుంది. AI అల్గోరిథంలు ఫోటో నాణ్యత, కలర్ ను మెరుగుపరచడంలో గొప్ప పని చేస్తాయి. అలాగే వివిధ సమూహాల ప్రకారం దిద్దుబాట్లను కూడా చేస్తాయి.

OPPO A12 ఆకర్షణీయమైన డిజైన్

OPPO A12 ఆకర్షణీయమైన డిజైన్

OPPO A12 స్మార్ట్‌ఫోన్‌ ఆకట్టుకునే డిజైన్‌తో వస్తుంది. ఇది సన్నని బెజెల్ డిజైన్‌ను కలిగి ఉండి ఒక చేతితో సులభంగా వాడటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఇది 8.3mm మందంతో కేవలం 165 గ్రాముల బరువును కలిగి ఉంది. ఇది 6.22-అంగుళాల వాటర్‌డ్రాప్ ఐ ప్రొటెక్షన్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది బ్లూ లైట్ ఫిల్టర్‌లతో వస్తుంది. ఇది వినియోగదారుల యొక్క కంటి ఒత్తిడి లేకుండా చేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 3D డైమండ్ బ్లేజ్ డిజైన్ ను కలిగి ఉంది. ఇది OPPO A12 ను వినియోగదారులకు ప్రత్యేకమైన ఎంపికగా వస్తుంది. దీని వెనుక భాగం వేర్వేరు కోణాల నుండి చూసినప్పుడు షేడ్స్ కూడా మారుతాయి.

Weight165g
Thickness8.3mm
Size15.59 x 7.55 x 0.83 cm
Display6.22-inch Waterdrop notch
Resolution720 x 1520 (TFT-LCD)
Aspect ratio19:9
ColorBlack and Blue
Screen-to-Body Ratio89%
Dual Rear Camera13 MP Main Camera + 2 MP Depth Camera
Front Camera5MP
Battery4230 mAh
OSColorOS 6.1.2 based on Android 9
ProcessorMTK Octa-core processor P35
ConnectivityWLAN 802.11a/b/g/n/ac
WLAN 2.4G, WLAN 5.1G, WLAN 5.8G, WLAN Display
Bluetooth 5.0
Others3D back cover, Rear fingerprint scanner, Face Unlock

Most Read Articles
Best Mobiles in India

English summary
Riding High On Performance, OPPO Takes The Game Of Innovation A Notch Higher With OPPO A12

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X