కోట్లకు కోట్లు హ్యాకర్లపాలు

By Hazarath
|

కోట్లకు కోట్లు హ్యాకర్ల పాలవుతున్నాయి. 2013లో ఇంటర్నెట్ అక్రమ లావాదేవీల ద్వారా జరిగిన నష్టం దాదాపు 24,000 కోట్లని నార్టన్ నివేదకి చెబుతోంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న నష్టం 11000 కోట్ల డాలర్లు. ఇది వ్యకిగత స్థాయిలో మాత్రమే..అదే కార్పోరేట్ వైపు ఎంత ఉంటుందో ఊహకే అందనిది.ఇక భారతదేశంలో ప్రతి పదిమందిలో ఒకరు ఇలా సైబర్ బారీన పడుతున్నారనే నిజాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ హ్యాకింగ్ భారీన పడి ఎంతో మంది విలవిలలాడారు.ఇంకా విలవిలలాడుతూనే ఉన్నారు.వారిని ఓ సారి చూద్దాం.

Read more:హ్యాకింగ్‌ సెక్స్‌తో అమితాబ్‌ విలవిల

రూ. 11 లక్షల వరకు గుర్తు తెలియని వ్యక్తులు ఇతర ఖాతాల్లో బదిలీ
 

రూ. 11 లక్షల వరకు గుర్తు తెలియని వ్యక్తులు ఇతర ఖాతాల్లో బదిలీ

ఇటీవల సికింద్రాబాద్‌కు చెందిన ఒక కంపెనీ ఖాతాలో నుంచి రూ. 11 లక్షల వరకు గుర్తు తెలియని వ్యక్తులు ఇతర ఖాతాల్లో బదిలీ చేశారు. ఇక్కడ కంపెనీ ఖాతాతో పాటు నగదు బదిలీ అయిన తరువాత సెల్‌ఫోన్‌కు వచ్చే మేసేజ్‌లను కూడా రానివ్వకుండా ఈ ముఠాలు జాగ్రత్త పడ్డాయి. హ్యాకింగ్‌తోనే ఇలా చేశారని పోలీసులు భావిస్తున్నారు.

క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఖాతాలోంచి 10 లక్షల రూపాయలు మాయం

క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఖాతాలోంచి 10 లక్షల రూపాయలు మాయం

క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అప్పుడు హ్యాకర్ల బారిన పడ్డారు. ఆయన ఈమెయిల్ అకౌంట్‑ను ఓ వ్యక్తి హ్యాకింగ్ చేసి, ఏకంగా ఆయన ఖాతాలోంచి 10 లక్షల రూపాయలు మాయం చేశాడు. ఇజాతుల్ షేక్ అనే నిందితుడిని ఈ కేసులో కోల్‑కతాలోని సాల్ట్ లేక్ పోలీసులు పట్టుకున్నారు.

చాక్లెట్ కంపెనీ అకౌంట్ హ్యాక్

చాక్లెట్ కంపెనీ అకౌంట్ హ్యాక్

ఈ మధ్యనే ఇండోనేసియా సంబంధించిన ఓ చాక్లెట్ కంపెనీకి చెందిన అకౌంట్‌ను నైజీరియన్లు హ్యాక్ చేసి రూ. 18 లక్షలను తమ అకౌంట్‌లో డిపాజిట్ చేసుకున్నారు

బాలుకి తప్పని తిప్పలు
 

బాలుకి తప్పని తిప్పలు

ప్రముఖ గాయకుడూ ఎస్పీ బాలసుబ్రమణ్యం హ్యాకింగ్ బారిన పడ్డారు. అయన వాడుతున్న యాహు మెయిల్ ఐడి ఎకౌంటుని హ్యాక్ చేసిన నేరగాళ్ళు ‘తానూ కష్టాల్లో ఉన్నానని , డబ్బు పంపమని' కోరుతూ ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరున స్పామ్ మెయిల్స్ పంపుతున్నారని ఆయనే స్వయంగా చెప్పారు.

కార్పొరేట్ సంస్థల వ్యాపారులే టార్గెట్

కార్పొరేట్ సంస్థల వ్యాపారులే టార్గెట్

నైజీరియన్లు తాజాగా కార్పొరేట్ సంస్థల వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిపే బిజినెస్‌మెన్లపై వారు నిరంతరం నిఘా పెడుతున్నారు. దీని కోసం మాల్‌వేర్ల ద్వారా వైరస్‌లను వేలాది మందికి పంపించి, వారి మెయిల్స్‌తోపాటు సిస్టంను హ్యాక్ చేస్తున్నారు. మెయిల్స్‌లో జరిగే లావాదేవీలను పరిశీలించి అందుకనుగుణంగా బిజినెస్‌మెన్లను బురిడీ కొట్టిస్తున్నారు

స్ఫూఫింగ్ పద్ధతిలో మెయిల్స్‌ను హ్యాక్

స్ఫూఫింగ్ పద్ధతిలో మెయిల్స్‌ను హ్యాక్

స్ఫూఫింగ్ పద్ధతిలో మెయిల్స్‌ను హ్యాక్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇందులో పాస్‌వర్డ్ లేకుండా బ్యాంకు, సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన పర్సనల్ మెయిల్ ఐడీ నుంచి ఖాతాదారులకు, ఆయా సంస్థల వినియోగదారులకు, స్నేహితులు, తెలిసిన వారు ఇలా ఎవరికైనా మెయిల్స్ పంపవచ్చు. మెయిల్స్ రీసివ్ చేసుకున్న వారికి సదరు బ్యాంకు, సంస్థ, వ్యక్తి నుంచి మెయిల్ వచ్చినట్లుగా కన్పిస్తుంది.

సమాచారం హ్యాకర్ చేతిలోకి

సమాచారం హ్యాకర్ చేతిలోకి

ఇలా వచ్చిన మెయిల్స్‌ను ఓపెన్ చేయడం వల్ల మన వద్ద ఉండే డేటాను ఇతరులు పొందడం, లేదంటే అందులోని సమాచారాన్ని వెంటనే పూర్తి చేసి పంపించడం చేయడంతో సమాచారం హ్యాకర్ చేతిలోకి వెళ్తుంది.

సెల్‌ఫోన్‌కు మేసేజ్ రాకుండా హ్యాక్

సెల్‌ఫోన్‌కు మేసేజ్ రాకుండా హ్యాక్

సెల్‌ఫోన్‌కు మేసేజ్ రాకుండా ఆ నెంబర్‌ను తెలుసుకొని డైవర్ట్ చేయడం చేస్తుంటారు. లావాదేవీలు జరిగినప్పుడు ఆ మేసేజ్ హ్యాకర్‌కు వచ్చేస్తుంది. అయితే ఈ పద్ధతిలో హ్యాకర్లు బ్యాంకు ఖాతాదారులకు వివరాలను మూడో పార్టీ నుంచి తెలుసుకొని గ్రూప్ మేసేజ్‌లు పెడుతుంటారని పోలీసులు చెబుతున్నారు

మన డేటా ఎక్కడకు చేరుతోంది?

మన డేటా ఎక్కడకు చేరుతోంది?

మన పర్సనల్ ఫోన్ నెంబర్‌కు ఒక గుర్తు తెలియని వారు సార్ మీకు ప్రైజ్ వచ్చిందంటూ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. వీరికి మన నెంబర్ ఎలా వెళ్లిందనే విషయం అర్ధం కాదు. మన డేటాను కొన్ని సందర్భాల్లో బ్యాంకులు, సెల్‌ఫోన్ కంపెనీలు, ఇతర పద్ధతుల్లో సేకరించే డేటా ఆయా సంస్థల నుంచి తస్కరణకు గురవుతుంది.

మూడో పార్టీ చేతికి

మూడో పార్టీ చేతికి

ఇలా మూడో పార్టీ చేతికి వెళ్లడంతో అది మార్కెట్లోకి వెళ్తుంది. కొన్ని సార్లు షాపింగ్ మాల్స్, ఇతరత్రా సంస్థలు తమ సేవలు ఎలా ఉన్నాయనే విషయంపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటాయి. అందరూ అసలు మెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు ఇస్తుంటారు.

బల్క్ మెయిల్స్, బల్క్ మేసేజ్‌లు

బల్క్ మెయిల్స్, బల్క్ మేసేజ్‌లు

ఇలా సేకరించిన డేటా కూడా ఆయా సంస్థలలో పనిచేసే వారి సహకారంతో బయటకు వెళ్తుంది. ఇలా పలు విధాలుగా డాటాను సేకరించి బల్క్ మెయిల్స్, బల్క్ మేసేజ్‌లు పంపిస్తున్నారు.

మెయిల్స్, మేసేజ్‌లతో జాగ్రత్త...

మెయిల్స్, మేసేజ్‌లతో జాగ్రత్త...

బల్క్ మెయిల్స్, మేసేజ్‌లతోనే గుర్తు తెలియని వ్యక్తులు వల వేస్తుంటారు. వారు వేసే వలలో ఎవరో ఒకరు చిక్కుతున్నారు. ఈ ఇలాంటి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మన ఇన్ బక్స్‌లో వచ్చే మెయిల్స్ ఎంత వరకు ఖచ్చితమైనవనే విషయాన్ని పరిశీలించాలి. అనుమానం ఉంటే వాటిని ఓపెన్ చేయకపోవడం మంచిది. ఇలా మెయిల్స్ ఓపెన్ చేయడం వల్ల ఆటోమెటిక్‌గా కొన్నిసార్లు మన వివరాలు అవతలి వారికి వెళ్లిపోతాయి.

ఫోన్ చేశామంటే తప్పులో కాలేసినట్లే

ఫోన్ చేశామంటే తప్పులో కాలేసినట్లే

ఆ వివరాలతోనే మనల్ని బుట్టలో వేయడం కాని, విలువైన సమాచారంతో మన బ్యాంకు ఖాతాలలో నుంచి నిధులు కాజేయడం చేస్తుంటారు. మరో పక్క సెల్‌ఫోన్‌కు వచ్చే మేసేజ్‌లు నిజమని నమ్మి మనం ఫోన్ చేశామంటే తప్పులో కాలేసినట్లే. బ్యాంకులు ఇతర మనకు అవసరమైన సంస్థల నుంచి మేసేజ్‌లు వస్తే వాటిలో వాస్తవముంటుంది. డూప్లికేట్ మేసేజ్‌లు చేసి మన వివరాలు సేకరించాలనుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.

గ్రానైట్ వ్యాపారి అకౌంట్ నుంచి 1.25 లక్షలు మాయం

గ్రానైట్ వ్యాపారి అకౌంట్ నుంచి 1.25 లక్షలు మాయం

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఓ గ్రానైట్ వ్యాపారి అకౌంట్ నుంచి ఆయనకు తెలియకుండానే రూ.1.25 లక్షలు మాయమయ్యాయి. ఇది ఆయనకు తెలియకుండానే హ్యాకర్లు లండన్ నుంచి చక్రం తిప్పి తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు.

శ్వేతసౌధంలోని కంప్యూటర్ వ్యవస్థలోకి హ్యాకర్లు

శ్వేతసౌధంలోని కంప్యూటర్ వ్యవస్థలోకి హ్యాకర్లు

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలోని కంప్యూటర్ వ్యవస్థలోకి హ్యాకర్లు చొరబడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. హ్యాకింగ్ కారణంగా తాత్కాలికంగా పలు సేవలు స్తంభించినట్టు తెలిపింది.

దేశీయులకు 24,400 కోట్ల మేర నష్టం

దేశీయులకు 24,400 కోట్ల మేర నష్టం

2013లో ఇంటర్నెట్ ద్వారా జరిగిన అక్రమ లావాదేవీల వల్ల దేశీయులకు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 24,400 కోట్ల) నష్టం జరిగిందని 2013 నార్టన్ నివేదిక అంచనా వేసింది.

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న నష్టం 11000 కోట్ల డాలర్లు

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న నష్టం 11000 కోట్ల డాలర్లు

నార్టన్ అంచనా ప్రకారం భారతదేశంలో ఏటా 42 లక్షల సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. ప్రతి పది మందిలో ఏడుగురు సైబర్ నేరాల బారిన పడుతున్నారు. నిమిషానికి 80 మంది ఈ-నేరాల వలలో చిక్కుకుంటున్నారు. వీటివల్ల ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న నష్టం 11000 కోట్ల డాలర్లు. ఇది వ్యక్తిగత స్థాయిలో జరుగుతున్న నష్టం మాత్రమే.

స్పామ్ దాడుల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానం

స్పామ్ దాడుల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానం

ఎరవేసి డబ్బు లాగే స్పామ్ దాడుల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. వైరస్ దాడుల్లో రెండో స్థానంలో ఉంది. అన్ని రకాల సైబర్ నేరాల్లో మూడో స్థానంలో ఉంది.

అడిగినంత డబ్బు మాయగాళ్ల ఖాతాల్లో డిపాజిట్

అడిగినంత డబ్బు మాయగాళ్ల ఖాతాల్లో డిపాజిట్

లాటరీ తగిలిందని తప్పుడు మెయిల్ పంపించి పెద్దయెత్తున డబ్బు కొల్లగొట్టే నైజీరియన్ మోసాల సంఖ్య ఎక్కువవుతోంది. రూ.కోట్ల విలువ చేసే లాటరీ కలిసిందని చెప్పగానే వెనకాముందు ఆలోచించకుండా అడిగినంత డబ్బు మాయగాళ్ల ఖాతాల్లో డిపాజిట్ చేసేవారి సంఖ్యకూ కొదవలేదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Here write Beware of online banking: Security expert reveals that ANYONE can hack a bank's app using free internet tools

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X