ప్రేమికుల రోజు మోసపోవద్దు!

Posted By:

ప్రేమ సంబరం వాలంటైన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్‌లైన్ మోసాలు విజృంభించే అవకాశముందని పముఖ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థ బిట్‌డిఫెండర్ హెచ్చరిస్తోంది. ఫిబ్రవరి 14ను పురస్కరించుకున్న ఆన్‌లైన్ యూజర్‌లకు ఆ సంస్థ సూచించిన పలు ముఖ్యాంశాలు....

వాలంటైన్స్ డే పేరు వింటేనే ప్రేమికులు హృదయాల పరవళ్లు తొక్కుతాయి. ఒకరికొకరు సందేశాలు పంచుకోవడం కానుకుల ఇచ్చిపుచ్చుకోవటం వంటి కార్యక్రమాలు ఫిబ్రవరి 14కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ప్రమికుల రోజు పుట్టుక గురించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

టెక్నాలజీ వింతలు!

మీ ఆఫీస్‌లో ఈ టెక్నాలజీ ఉందా..?

- ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్‌లైన్‌లో ఎరజూపే లిమౌసిన్ ఆఫర్లు ఇంకా సమస్యాత్మక సంబంధాలకు దూరంగా ఉండటం మంచిది.

- ఈ వాలంటైన్ డేను పురస్కరించుకుని క్రెడిట్ డాంకీ డాట్ కామ్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఆడవారితో పోలిస్తే మగవారు 75 శాతం అధికంగా వాలంటైన్ దినోత్సవాన్ని జరుపుకునేందకు ఇష్టంగా ఉన్నారట. హ్యాకర్లు ఇదే అదునుగా భావించి ఆన్‌లైన్ మోసాలకు తెగబడే అవకాశముంది. ఆఫర్ల విషయంలో ఆచితూచి వ్యవహరించటం మంచిది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రేమికుల రోజు మోసపోవద్దు!

ప్రేమికుల రోజు మోసపోవద్దు!

ప్రేమికుల రోజు మోసపోవద్దు!

ప్రేమికుల రోజు మోసపోవద్దు!

ప్రేమికుల రోజు మోసపోవద్దు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

- మీ నుంచి డబ్బు ఇంకా వ్యక్తిగత సమాచారన్ని దొంగిలించేందుకు ఫేక్ డేటింగ్ వెబ్‌సైట్‌లను స్కామర్లు సృష్టించే అవకాశముందని బిట్‌డిఫెండర్ ఛీప్ సెక్యూరిటీ అధికారి కటాలిన్ కోసోయ్ తెలిపారు. కాబట్టి మీకు తెలియని డేటింగ్ సైట్‌ల జోలికి పోవద్దు.

- వాలంటైన్ డేను పురస్కరించుకుని డౌన్‌లోడ్ చేసుకునే వాల్ పేపర్లు, ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ల విషయంలో అప్రమత్తత అవసరం హ్యాకర్లు వీటి ద్వారా మాల్‌వేర్‌ను పంపించే అవకాశముంది.

- ముఖ్యంగా ఆన్‌లైన్ పూల ఆఫర్లకు సంబంధించి ఆచితూచి స్పందించాలని బిట్‌‌డిఫెండర్ నెటిజనులను హెచ్చరిస్తోంది. ప్రేమికుల రోజును ఆసరాగా తీసుకుని సైబర్ క్రిమినళ్లు వాలంటైన్ కార్డుల పేరుతో వైరస్‌‍ను పంపే అవకాశముందని సంస్థ అలర్ట్ చేస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot