జియో రూ. 98కి పోటీగా Airtel రూ.93 ప్లాన్, అన్ లిమిటెడ్ కాల్స్..
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియోని ఢీ కొట్టేందుకు టెల్కో దిగ్గజాలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూపోతున్న సంగతి తెలిసిందే.
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియోని ఢీ కొట్టేందుకు టెల్కో దిగ్గజాలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వొడాఫోన్, ఎయిర్టల్ లాంటి టెలికాం సంస్థలు జియో ఆఫర్ల కన్నా తక్కువ ధరలో తమ వినియోగదారుల కోసం ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా జియో రూ. 98 ప్లాన్ కి సవాల్ విసురుతూ Bharti Airtel రూ. 93 ప్లాన్‌తో ముందుకొచ్చింది.

రూ.93 రీచార్జి..
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.93 రీచార్జి చేసుకుంటే వారికి 1జీబీ 3జీ/4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ఉచిత రోమింగ్ ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీని 10 రోజులుగా నిర్ణయించారు.

రూ.59తో రీఛార్జ్
దీంతో పాటు రూ.59తో రీఛార్జ్ చేసుకుంటే వారికి 500ఎంబీ 3జీ/4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ఉచిత రోమింగ్ ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీని 7 రోజులుగా నిర్ణయించారు.

జియో రూ.98 ప్లాన్
అయితే జియో రూ.98 ప్లాన్‌లో యూజర్లకు 2.1 జీబీ డేటా లభిస్తుంది. దీన్ని రోజూ 0.15 జీబీ చొప్పున వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. 140 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 14 రోజులుగా ఉంది.

జియో మరో బంపరాఫర్
రూ.399తో రీఛార్జ్ చేస్తే రూ.3,300 మీ అకౌంట్లోకి, జియో మరో బంపరాఫర్ మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








