రిలయన్స్ జియో మీద మరొసారి జెండా ఎగురవేసిన Bharti Airtel

|

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అక్టోబర్ 31 చివరి వరకు టెలికాం సబ్‌స్క్రిప్షన్ డేటాను విడుదల చేసింది. ఈ నెలలో కూడా భారతి ఎయిర్‌టెల్ మరొకసారి రిలయన్స్ జియోను నెలవారీ చందాదారుల చేరికలలో ఓడించింది. ట్రాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం ఎయిర్టెల్ టెలికాం సంస్థ అక్టోబర్ నెలలో 3.67 మిలియన్ల కొత్త కస్టమర్లను చేర్చుకున్నది. అయితే జియో మాత్రం కేవలం 2.22 మిలియన్ల మంది కొత్త వినియోగదారులను మాత్రమే చేర్చుకోగలిగింది.

 

భారతి ఎయిర్‌టెల్

మరోవైపు వోడాఫోన్ ఐడియా ప్రస్తుతం ఉన్న వారిలో దాదాపుగా 2.65 మిలియన్ల వినియోగదారులను కోల్పోయింది. ఈ నెలలో గల మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ టెల్కో మాత్రం ఈ నెలలో కేవలం 10,000 మంది వినియోగదారులను మాత్రమే కోల్పోయింది. ఎయిర్టెల్ తన నెట్‌వర్క్‌లో సుమారు 96.74% మంది చందాదారులతో క్రియాశీల వినియోగదారుల సంఖ్యను మరింత బలపరచుకుంటూ ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతి ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో యూజర్ల సంఖ్య

భారతి ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో యూజర్ల సంఖ్య

టెలికాం పరిశ్రమలో దాదాపు నాలుగు సంవత్సరాలుగా రిలయన్స్ జియో ఆధిపత్యం చెలాయిస్తున్నది. అప్పటి నుంచి ఈ టెల్కో 400 మిలియన్ల వినియోగదారులను సంపాదించింది. కానీ జియో గత మూడు నెలలుగా చందాదారుల చేరికలలో చాలా వరకు మందగించింది. జియోకు అతి పెద్ద సమస్యగా మారిన టెల్కోగా ఎయిర్‌టెల్ తయారైంది. ఇది ఎక్కువ మంది వినియోగదారులను చేర్చుకోవడంతో వాస్తవానికి తమ యొక్క చందాదారులను రెట్టింపు చేసుకుంటున్నది. అక్టోబర్ 2020 లో ఎయిర్టెల్ 3.67 మిలియన్ల కొత్త వినియోగదారులను చేర్చుకోవడంతో మొత్తం చందాదారుల సంఖ్యను 330.29 మిలియన్లకు పెంచుకున్నది.

అక్టోబర్ 2020 టెల్కోల చందాదారుల సంఖ్య
 

అక్టోబర్ 2020 టెల్కోల చందాదారుల సంఖ్య

రిలయన్స్ జియో అక్టోబర్ 2020 నెలలో 2.65 మిలియన్ల మంది కొత్త వినియోగదారులను చేర్చుకోవడంతో తన మొత్తం చందాదారుల సంఖ్యను 406.36 మిలియన్లకు పెంచుకున్నది. అలాగే వోడాఫోన్ ఐడియా మాత్రం ముందు మాదిరిగానే అక్టోబర్ నెలలో కూడా దాదాపుగా 2.65 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోవడంతో టెల్కో యొక్క మొత్తం వినియోగదారుల సంఖ్య 292.84 మిలియన్లకు తగ్గింది. చివరిగా బిఎస్ఎన్ఎల్ 10,000 మంది వినియోగదారులను కోల్పోవడంతో అక్టోబర్ చివరి నాటికి 118.98 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది.

చందాదారుల బేస్ చార్టు

ఇండియాలోని టెలికాం ఆపరేటర్ల యొక్క చందాదారుల బేస్ చార్టులో రిలయన్స్ జియో మొత్తం ముందుండగా ఎయిర్టెల్ యాక్టివ్ యూజర్ బేస్ విభాగంలో కొద్ది దూరంలో మాత్రమే ఉంది. ఎయిర్‌టెల్ యాక్టివ్ యూజర్ బేస్ 96.74% వద్ద మరియు జియో యూజర్ బేస్ 78.59% కలిగి ఉంది. వోడాఫోన్ ఐడియా 292.84 మిలియన్ల క్రియాశీల వినియోగదారులతో ప్రస్తుతం దాని నెట్‌వర్క్‌లో 88.78% మంది వినియోగదారులను కలిగి ఉంది. నెట్‌వర్క్‌లో చురుకుగా ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ కేవలం 61.38% (51.59%)యాక్టివ్ యూజర్ బేస్ ను కలిగి ఉంది. అక్టోబర్ చివరి నాటికి టెలికాం యొక్క మార్కెట్ వాటా విషయానికి వస్తే రిలయన్స్ జియో మార్కెట్ వాటా 35.28%, భారతి ఎయిర్‌టెల్ 28.68%, వోడాఫోన్ ఐడియా 25.42%, బిఎస్‌ఎన్‌ఎల్ 10.33% వద్ద ఉన్నాయి.

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం అక్టోబర్‌ నెలలో మొత్తం 8.80 మిలియన్ అభ్యర్థనలను స్వీకరించినట్లు ట్రాయ్ నివేదించింది. వోడాఫోన్ ఐడియా వినియోగదారులు ఎక్కువ మంది భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియోలకు పోర్టబిలిటీ ద్వారా అధికంగా మారుతున్నారు. 8.80 మిలియన్ల పోర్టబిలిటీ కొత్త అభ్యర్థనలలో 4.76 మిలియన్ అభ్యర్థనలు జోన్ -1 నుండి 4.06 మిలియన్ అభ్యర్థనలు జోన్ -2 నుండి స్వీకరించబడినట్లు ట్రాయ్ నివేదించింది. MNP అమలు తరువాత సెప్టెంబర్ 2020 చివరిలో 520.80 మిలియన్ల నుండి అక్టోబర్ 20 చివరి నాటికి 529.60 మిలియన్లకు పెరిగింది.

Best Mobiles in India

English summary
Bharti Airtel Beats Jio and Adds 3.67 Million New Users in October

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X