ఎయిర్‌టెల్ బ్యాంకు వస్తోంది

Written By:

టెలికం రంగంలో సంచలనాలు నమోదు చేస్తున్న టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ ఇప్పుడు పేమెంట్ బ్యాంకింగ్ రంగంలోకి వస్తోంది. అతి త్వరలోనే పేమెంట్స్ బ్యాంకు సేవలను కష్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఆర్‌బిఐ నుంచి లైసెన్స్ కూడా సాధించింది. దేశంలో ఇలా లెసైన్స్ పొందిన మొట్టమొదటి కంపెనీ ఎయిర్‌టెల్ మాత్రమే.

ఇది ఉంటే ఫోన్ పగిలిందనే మాట వినపడదు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పేమెంట్స్ బ్యాంకు సేవలను

పేమెంట్స్ బ్యాంకు సేవలను అందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంకుతో ఎయిర్‌టెల్ గతంలో చేతులు కలిపిన సంగతి అందరికీ తెలిసిందే.

ఎయిర్‌టెల్ అనుబంధ కంపెనీ

ఈ ఏడాది ఏప్రిల్లో ఎయిర్‌టెల్ అనుబంధ కంపెనీ అయిన ఎయిర్‌టెల్ ఎం-కామర్స్ సర్వీసెస్ (ఏఎంఎస్ఎల్) ఆర్‌బిఐ నుంచి లైసెన్స్ దక్కించుకున్నప్పటికీ ప్రారంభతేదీ మాత్రం వాయిదా పడుతూనే ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ పనులు వేగవంతం

అయితే ఇప్పుడు ఈ పనులు వేగవంతం అవుతున్నాయని డిసెంబర్ నుంచి పూర్తి స్తాయి సేవలు ప్రారంభించే అవకాశం ఉందని ఎయిర్‌టెల్ అధికారులు చెబుతున్నారు.

పేమెంట్ బ్యాంకు ద్వారా

ఈ పేమెంట్ బ్యాంకు ద్వారా కష్టమర్లు సేవింగ్స్, డిపాజిట్లు, పేమెంట్, అలాగే చెల్లింపులు లాంటి సేవలను ఆఫర్ చేస్తారు. కష్టమర్లు రూ. లక్ష వరకు ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు.

మారుమూల పల్లెల్లో ఉన్న లక్షలాది మందికి

ఈ బ్యాంకుల ప్రధాన ఉద్దేశం.. మారుమూల పల్లెల్లో ఉన్న లక్షలాది మందికి ఆర్థికపరమైన సేవలు అందించడమే. దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌కు 26 కోట్లకుపైగా మొబైల్ చందాదారులు ఉన్నారు. 15 లక్షలకుపైగా కేంద్రాల ద్వారా ఎయిర్‌టెల్‌ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

ఆర్థికపరమైన సేవలను

వీరంతా ఈబ్యాంకులను ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థికపరమైన సేవలను అందిపుచ్చుకుంటారని కంపెనీ చెబుతోంది. దీంతో పాటు కొత్త కష్టమర్లను కూడా దక్కించుకునే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది.

ఎయిర్‌టెల్‌ మనీ

2011 నుంచి ఎయిర్‌టెల్‌ మనీ సేవలు అందిస్తున్న ఏఎంఎస్ఎల్ పేరును ఈ ఏడాది మే నెలలో ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకుగా మార్చారు. ఇప్పుడు ఇదే కొటాక్ మహీంద్రాతో కలిసి వినియోగదారులకు సేవలను అందిచనుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Bharti Airtel, Kotak joint venture gets payment bank license from RBI read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot