ఇది ఉంటే ఫోన్ పగిలిందనే మాట వినపడదు !

Written By:

మీ ఫోన్ సడన్ గా మీచేతిలో నుంచి జారిపడితే మీకెలా ఉంటుంది. గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.ఫోన్ పగిలిందేమోనని కళ్లల్లో ఎక్కడలేని భయం వస్తుంది. వేలకు వేలు పోసి కొన్న ఫోన్ కిందపడి పగిలితే ఎవరికైనా బాధ అలానే ఉంటుంది కదా..అయితే ఇప్పుడు అలాంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది హోండా కంపెనీ. ఫోన్లు కిందపడినా పగలకుండా ఉండేందుకు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది.

2017లో దిగ్గజాలకు సవాల్ విసిరే శాంసంగ్ ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్ల కోసం బిల్ట్ ఎయిర్ బ్యాగులు

జపాన్ కార్ల తయారీ దిగ్గజం హోండా కంపెనీ స్మార్ట్‌ఫోన్ల కోసం బిల్ట్ ఎయిర్ బ్యాగులను తయారుచేస్తోంది. కేస్ ఎన్ గా పిలిచే ఈ పరికరం మీ స్మార్ట్ ఫోన్ కు రక్షణ కవచంలా నిలవగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఫోన్ కు రక్షణ కవచం

ఇది ఎలా పని చేస్తుందంటే మీ మొబైల్ పొరపాటున మీ చేతుల్లో నుంచి జారిపడినప్పుడు ఆటోమోటిగ్గా అందులోని బ్యాగులు విచ్చుకుంటాయి. ఇవి చాలా చిన్నగా ఉండి ఫోన్ కు రక్షణ కవచంలా నిలుస్తాయి.

నెటిజన్ల నుంచి భారీ స్పందన

దీని పనితీరును వివరిస్తూ కంపెనీ ఓ వీడియోని విడుదల చేస్తే దానికి నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. రోజురోజుకు ఈ వీడియోకి ఆదరణ పెరుగుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దీనిపై కొన్ని విమర్శలు

అయితే దీనిపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇది చాలా పెద్దగా ఉందని సెల్ ఫోన్ కన్నా అదే మూడింతలు ఎక్కువగా ఉందని వాడటం చాలా కష్టమని చెబుతున్నారు.

కేవలం కాన్సెప్ట్ మాత్రమే

అయితే కంపెనీ మాత్రం ఇది కేవలం కాన్సెప్ట్ మాత్రమేనని పూర్తి స్థాయిలో వస్తే వేరేగా ఉంటుందని తెలిపింది. అసలు దీన్ని ఉత్పత్తి చేస్తామో లేదోననే సందేహం కూడా వెలిబుచ్చింది.

ఆపిల్ కంపెనీ

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రకమైన డిజైన్ కోసం ఆపిల్ కంపెనీ హోండా కంపెనీని సంప్రదించింది. వారి కోరిక మేరకు ఈ పరికరాన్ని హోండా కంపెనీ రూపొందించింది.

ముందు ముందు మార్కెట్ లోకి వచ్చే అవకాశం

అయితే ఇది ముందు ముందు మార్కెట్ లోకి వచ్చే అవకాశం లేకపోలేదని దీనికి కాస్తా ఆధునికతను జోడించి మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే ఫోన్ పగిలిపోవడం అన్న మాట మరచిపోవాల్సిందే ఇక.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Honda Made the World's First Smartphone Case With an Emergency Airbag Read more at Gigzbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot