ఎయిర్‌టెల్‌ నుంచి మరో బంపరాఫర్

Written By:

టెలికం రంగంలో టాప్ లో దూసుకుపోతున్న భారతి ఎయిర్‌టెల్‌ విదేశాలకు వెళ్లే వారి కోసం మరో బంఫరాఫర్ ను తెచ్చింది. వ్యాపార ప్రయాణాలతో పాటు సెలవుల్లో విదేశాల్లో ప్రయాణించే వినియోగదారుల కోసం ఇంటర్నేషనల్ రోమింగ్ ఆఫర్ ను ప్రకటించింది. మరి ఈ ఆపర్ విశేషాలేంటో చూద్దాం.

దీపావళికి సిద్ధంగా ఉన్న బెస్ట్ డేటా ఆఫర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.1,199లతో

రూ.1,199లతో 10రోజుల వాలిడిటీతో లభించే ఈ ప్యాక్ మీద ఇంటర్నేషనల్ రోమింగ్ ఆఫర్ అందిస్తోంది.

అన్‌లిమిటెడ్ ఇన్‌కమింగ్ కాల్స్

ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, సింగపూర్, మరియు థాయ్ లాండ్‌లలో పర్యటించే ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అన్‌లిమిటెడ్ ఇన్‌కమింగ్ కాల్స్ ను అందుబాటులోకి తెచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నిమిషానికి 3 రూపాయలు చార్జ్

అంతేకాదు ఐఆర్( ఇంటర్నేషనల్ రోమింగ్ చార్జీలు) 99 శాతం కోతపెట్టి, 3రూపాయలకే ఒక ఎంబీ , ఇండియాకు, లోకల్ అవుట్ గోయింగ్ కాల్స్ కోసం నిమిషానికి 3 రూపాయలు చార్జ్ చేయనుంది.

సోషల్ మీడియా, ఈ మెయిల్స్ చెకింగ్ లాంటి సేవలను

దీంతో వినియోగదారులు ఫ్రీ వైఫై సెంటర్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, సోషల్ మీడియా, ఈ మెయిల్స్ చెకింగ్ లాంటి సేవలను నిరంతరాయంగా పొందొచ్చని తెలిపింది.

ఈ ప్యాక్ ఎపుడైనా యాక్టివేట్

మరోవైపు ఈ ప్యాక్ ఎపుడైనా యాక్టివేట్ చేసుకొని, కేవలం వాడుకున్నపుడు మాత్రమే చెల్లించే అవకాశం కల్పించడం మరో ప్రత్యేకత.

250 నిమిషాల ఉచితకాలింగ్

సింగపూర్, థాయ్ లాండ్ లలో పూర్తి ఉచిత ఇన్ కమింగ్ కాల్స్, 2 జీబీ డాటా, ఇండియాకు 250 నిమిషాల ఉచితకాలింగ్, 100 ఎస్ ఎంఎస్ లు ఉచితంగా అందిస్తోంది. దాదాపు ఇదే తారిఫ్ తో అమెరికా, కెనడా, బ్రిటన్లలో రూ.2999 లతో మొదలయ్యే ప్యాకేజ్ ను తీసుకొచ్చింది.

ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్

వినియోగదారులు ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్, మై ఎయిర్‌టెల్‌ యాప్, కస్టమర్ కాంటాక్ట్ కేంద్రాల ద్వారా ఈజీగా ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Airtel launches 10 Day packs for International Roaming with unlimited incoming calls Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot