రిలయన్స్ జియోకి భారీ షాకిచ్చిన ఎయిర్‌టెల్
యో కన్నా ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్ స్పీడ్ చాలా వేగవంతంగా ఉందని ట్రాయ్ తన నివేదికలో పేర్కొంది.

సెకనుకు 8.42 మెగాబైట్స్
జనవరిలో భారతీ ఎయిర్‌టెల్ మొబైల్ నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ సగటున సెకనుకు 8.42 మెగాబైట్స్‌గా (8.42 ఎంబీపీఎస్) నమోదయ్యింది.

డౌన్‌లోడ్ స్పీడ్ దాదాపు రెట్టింపు
కాగా గతేడాది డిసెంబర్‌లో ఇదే కంపెనీ డౌన్‌లోడ్ స్పీడ్ 4.68 ఎంబీపీఎస్‌గా ఉంది. అంటే నెల ప్రాతిపదికన చూస్తే ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ దాదాపు రెట్టింపు అయ్యింది.

జియో డౌన్‌లోడ్ స్పీడ్ 8.34 ఎంబీపీఎస్
రిలయన్స్ జియో విషయానికి వస్తే ఈ నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ అనూహ్యంగా 8.34 ఎంబీపీఎస్‌గా రికార్డు అయ్యింది.

డౌన్‌లోడ్ స్పీడ్ సగానికిపైగా క్షీణత
డిసెంబర్‌లో దీని డౌన్‌లోడ్ స్పీడ్ గరిష్టంగా 18.14 ఎంబీపీఎస్‌గా నమోదు కావడం గమనార్హం. అంటే నెలవారీగా చూస్తే రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ సగానికిపైగా క్షీణించింది.

ఎయిర్‌టెల్ మూడు సార్లు
గతేడాది సెప్టెంబర్ నుంచి జనవరి వరకు చూస్తే ఎయిర్‌టెల్ మూడు సార్లు డౌన్‌లోడ్ స్పీడ్ అంశంలో అగ్రస్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications








