6 నెలలు 30 లక్షల ఫోన్లు, షియోమి రికార్డుల మోత

Written By:
చైనా ఆపిల్‌గా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దుమ్మురేపుతున్న షియోమి అదే రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దూసుకుపోతున్న ఈ దిగ్గజం రెడ్‌మి 3ఎస్ ఫోన్లను కేవలం ఆరు నెలల వ్యవధిలో 30లక్షల యూనిట్లు విక్రయించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ గతేడాది ఆ సంస్థ 3ఎస్‌ (3ఎస్‌, 3ఎస్‌ ప్రైమ్‌, 3ఎస్‌ ప్లస్‌) మొబైళ్లను విడుదల చేసింది. వీటిలో 3ఎస్‌, 3ఎస్‌ ప్రైమ్‌ను ఆగస్టు నుంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తుండగా 3ఎస్‌ ప్లస్‌ను మాత్రం అక్టోబర్‌ నుంచి ఆఫ్‌లైన్‌ మార్కెట్‌లో అమ్మకాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. 
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.10వేల విభాగంలో ఇతర సంస్థలకు గట్టి పోటీ

2014లో భారత్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన షియోమీ రూ.10వేల విభాగంలో ఇతర సంస్థలకు గట్టి పోటీనిస్తూ వస్తోంది. 3ఎస్‌, 3ఎస్‌ ప్రైమ్‌, 3ఎస్‌ ప్లస్‌ లాంటి మొబైళ్లతో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

భారత్‌లో ఫోన్ల అమ్మకాల్లో రెండో స్థానంలో..

గతేడాది చివరి మూడు నెలల్లో షియోమి భారత్‌లో ఫోన్ల అమ్మకాల్లో రెండో స్థానంలో నిలిచింది. అదే సమయంలో ఆన్‌లైన్‌ అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచినట్లు పేర్కొంది.

రెడ్‌మి 3ఎస్ ఫీచర్లు

ఫీచర్ల విషయానికొస్తే 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే తో పాటు 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ తో ఫోన్ వచ్చింది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 430 ప్రాసెస‌ర్‌, అడ్రినో 505 గ్రాఫిక్స్, HDR mode, 1080p వీడియో రికార్డింగ్ వంటివి ఫోన్‌కు మరింత బలానిస్తున్నాయి.

2/3 జీబీ ర్యామ్‌

2/3 జీబీ ర్యామ్‌తో రెడ్‌మి 3ఎస్ వచ్చింది. ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్విషయానికొస్తే 16/32 జీబీ వరకు ఉంటుంది. మైక్రో ఎస్టీ ద్వారా 128 జీబీ వరకు విస్తరించుకోవచ్చు.

కెమెరా

13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, పీడీఏఎఫ్, ఎల్ఈడి ఫ్లాష్, f/2.0 aperture వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి.

4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ ఫోన్‌లో 4,100 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన మాసివ్ బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేసారు.

అదనపు ఫీచర్లు

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, బరువు 144 గ్రాములు, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మలో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ వంటివి అదనపు ఫీచర్లు.

రెడ్‌మి 3ఎస్ ధర

మార్కెట్లో రెడ్‌మి 3ఎస్ ధర రూ. 6,999గా ఉంది. డార్క్ గ్రే, సిల్వర్, గోల్డ్ కలర్స్‌లో లభ్యమవుతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఫిబ్రవరి 17న సేల్ జరగబోతోంది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల మీద 5 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Says Over 3 Million Redmi 3S Units Were Sold in India in Less Than 6 Months read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot