ఎయిర్‌టెల్ కొత్త సీఈవో గోపాల్ విఠల్.. మార్చి నుంచి నియామకం!

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ సీఈవో (భారత్, దక్షిణాసియా) సంజయ్ కపూర్ రాజీనామా చేశారు. దీంతో మార్చి 1 నుంచి భారత కార్యకలాపాల విభాగ సీఈవోగా గోపాల్ విఠల్ బాధ్యతలు చేపడతారు. భారతీ ఎయిర్‌టెల్ మంగళవారం ఈ విషయాలు తెలిపింది. 15 ఏళ్ల పాటు భారతీ గ్రూప్‌లో కొనసాగిన కపూర్ మరింత మెరుగైన అవకాశాల కోసం వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఎయిర్‌టెల్ కొత్త సర్వీస్ : ఫోన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు
విద్యాప్రమాణాలను మరింత మెరుగుపరిచే క్రమంలో భారతి ఎయిర్ టెల్ సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టింది. తన వినియోగదారులకు మొబైల్ ఫోన్లలో ఎంఎడ్యుకేషన్ సేవలు ప్రారంభించింది. దీంతో మొబైల్ ఫోన్ల ద్వారా ఇంగ్లీషు నేర్చుకోవచ్చని, పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చని, కెరీర్ కౌన్సెలింగ్ సేవలు పొందవచ్చని సంస్థ తెలిపింది. వినియోగదారుల మాతృభాషలో వాయిస్ ద్వారా కాని, ఎస్ఎంఎస్‌ల ద్వారా కాని ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని చెప్పింది. రోజుకు 1.5 రూపాయల నుంచి 10 రూపాయల చెల్లించడం ద్వారా ఈ సేవలు పొందవచ్చని పేర్కొంది. యుపిఎస్‌సి, ఎంబిఎ ప్రవేశ పరీక్షలకు మొబైల్ ద్వారా మాక్ టెస్టుల నిర్వహిస్తామని తెలిపింది. 12 మాక్ టెస్టులు నిర్వహిస్తామని, ఇందుకోసం 99 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆ సంస్థ చెప్పింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో సాధారణ విద్యకు కొన్ని పరిమితులున్నాయని, తమ ఎంఎడ్యుకేషన్ సేవల ద్వారా విద్యా రంగంలోని సవాళ్లను అధిగమించవచ్చని భారతి ఎయిర్‌టెల్ అధ్యక్షుడు(కన్స్యూమర్ బిజినెస్) కె శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
డ్యూయల్ సిమ్ పెద్దస్ర్కీన్ ఫాబ్లెట్‌లు (తక్కువ ధర)


Click it and Unblock the Notifications








