కంప్యూటర్లు దండగ..లక్ష కోళ్లు ఇస్తా పెంచుకోండి
ప్రపంచం టెక్ దిగ్గజాల్లో ఒకరైన మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ పేదరిక నిర్మూలనకు నడుం బిగించిన విషయం అందరికీ తెలిసిందే. బిల్ గేట్స్ తన ఫౌండేషన్ ద్వారా పేద దేశాలైన ఆప్రికాలో అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు . అక్కడ కావాల్సింది కంప్యూటర్లు కాదని కోళ్లను పెంచుకుంటే జీవితం ఆనందంగా సాగుతుందని చెబుతున్నారు. కావాలంటే నేను లక్షకోళ్లను ఇస్తా పెంచుకోమంటూ చెబుతున్నారు. ఆసక్తిగొలుపుతున్న కథనం మీరే చూడండి .
Read more : బిల్ గేట్స్ గురించి 13 ఆసక్తికర నిజాలు

కంప్యూటర్లు దండగ.. లక్ష కోళ్లు ఇస్తా పెంచుకోండి
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కంప్యూటర్లకంటే కోళ్ల పెంపకం ఉత్తమమని తేల్చిచెప్తున్నారు. చిప్‌ల వ్యవస్థ కంటే చికెన్ అత్యుత్తమ పరిష్కారం అనే అభిప్రాయాన్ని గేట్స్ వ్యక్తం చేశారు. చికెన్ అంటే ఏదో ఓ సాఫ్ట్‌వేర్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. పేదరిక నిర్మూలన కోసం బిల్‌గేట్స్ చూపిస్తున్న కొత్త పరిష్కారం.

కంప్యూటర్లు దండగ.. లక్ష కోళ్లు ఇస్తా పెంచుకోండి
కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌలభ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదరికాన్ని రూపుమాపలేవని, పేదవాళ్ల జీవితం మెరుగుపడాలంటే కోళ్ల పెంపకమే సరైన మార్గమని సాఫ్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్ కొత్త భాష్యాన్ని చెప్పారు.

కంప్యూటర్లు దండగ.. లక్ష కోళ్లు ఇస్తా పెంచుకోండి
కోళ్ల సంపద ఉంటే పేదరికాన్ని సులువుగా పారదోలవచ్చని గేట్స్‌నోట్స్.కామ్ అనే వెబ్‌సైట్‌లో ఆయన పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కోసం తన బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి హీఫర్ అనే సంస్థతో జతకట్టారు.

కంప్యూటర్లు దండగ.. లక్ష కోళ్లు ఇస్తా పెంచుకోండి
ఇందులో భాగంగా సబ్ సహారా ఆఫ్రికాలో రెండు డాలర్లు కన్నా తక్కువ రోజువారీ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఒక లక్ష కోడిపిల్లలను మా సంస్థ తరఫున పంపిణీ చేస్తున్నామని బిల్ గేట్స్ చెబుతున్నారు.

కంప్యూటర్లు దండగ.. లక్ష కోళ్లు ఇస్తా పెంచుకోండి
పేద దేశాలుగా ఉన్న బోలివియా నుంచి ఆప్రికాలోని బుర్కిన్ పాసా లాంటి పన్నెండు దేశాలలో పేదలను ఆదుకోవడానికి ఈ లక్ష కోళ్లను వినియోగిస్తామని ఆయన చెప్పారు.

కంప్యూటర్లు దండగ.. లక్ష కోళ్లు ఇస్తా పెంచుకోండి
ఆఫ్రికా ప్రాంతంలోని గ్రామీణ ప్రజలు కోళ్ల పెంపకంలో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారని.. దాదాపు 30 శాతం వృద్ధి సాధించడం దృష్టికి వచ్చింది అని గేట్స్ తెలిపారు. ఇతర వనరుల కంటే రాబడి కోళ్ల పెంపకంలోనే ఉందన్నారు.

కంప్యూటర్లు దండగ.. లక్ష కోళ్లు ఇస్తా పెంచుకోండి
చికెన్, గుడ్ల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు పోషక విలువలున్న ఆహారం లభ్యమవుతుందని పేర్కొన్నారు. మేకలు, పశువులతో పోల్చుకుంటే కోళ్లు చాలా చిన్నవి.. అవి తక్కువ ప్రదేశంలో పెంపకానికి అనువుగా ఉంటాయన్నారు. తక్కువ సమయంలో ఆదాయం లభించడం ద్వారా మళ్లీ పెట్టుబడి పెట్టడానికి వీలుంటుందని వెల్లడించారు.

కంప్యూటర్లు దండగ.. లక్ష కోళ్లు ఇస్తా పెంచుకోండి
ప్రపంచంలోని పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు కంప్యూటర్లు, ఇంటర్నెట్‌తో పనిలేదని.. కొందరు కోళ్లు పెంచుకుంటే సరిపోతుందని.. గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు 250 కోళ్లు పెంచితే ఏడాదికి 1250 డాలర్లు సంపాదించగలుగుతారని గేట్స్‌నోట్స్.కామ్‌లో ఆయన పేర్కొన్నారు.

కంప్యూటర్లు దండగ.. లక్ష కోళ్లు ఇస్తా పెంచుకోండి
టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications