అమ్మాయిల మధ్యలో నేనొక్కడినే : బిల్‌గేట్స్

Written By:

మైక్రోసాఫ్ట్ ను ప్రపంచానికి పరిచయం చేసిన లెజెంట్ టెకీ బిల్ గేట్స్ కొన్ని ఆసక్తికర విషయాలను బయటి ప్రపంచానికి తెలిపారు. ఆయనకు అసలు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదట. అంత పెద్ద సంస్థను నడుపుతున్నఅధినేతకు అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా సిగ్గని బిబీసి ఇంటర్యూలో చెప్పారు. తన చిన్ననాటి జ్ఙాపకాలను పంచుకున్నారు. స్టీవ్ జాబ్స్ గురించి కూడా ప్రస్తావించారు.

Read more: ఆపిల్ సామ్రాజ్యమా లేక స్వర్గానికి ద్వారమా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బీబీసీ డెసర్ట్ ఐలాండ్ డిస్కషన్స్ తో

బీబీసీ డెసర్ట్ ఐలాండ్ డిస్కషన్స్ తో తన జ్ఞాపకాలను పంచుకున్నప్పుడు గేట్స్ఈ మాటలన్నారు .. ఆరోజుల్లో అంటూ.. కాలేజీ డేస్ జ్ఞాపకాలతో పాటు.. 1975లో మైక్రోసాఫ్ట్ స్థాపించిన సమయంలో... ఉద్యోగులతో వ్యవహరించిన తీరు.. స్టీవ్ జాబ్స్ తో స్నేహం.. ఇలా అన్నింటిని పంచుకున్నారు స్టీవ్.

19ఏళ్ల వయస్సులో హార్వర్డ్ నుంచి బయటకు వచ్చి

19ఏళ్ల వయస్సులో హార్వర్డ్ నుంచి బయటకు వచ్చి.. పౌల్ అలెన్ తో కలిసి మైక్రోసాఫ్ట్ స్థాపించారు. 2000 వరకు సీఈవోగా... 2014లో చైర్మన్ గా వ్యవహరించారు. ప్రస్తుతం మిలిండా గేట్స్ వ్యవహారాలు చూసుకుంటున్నారు.

బీబీసీ రేడియోలో ఆయనేం మాట్లాడారంటే

బీబీసీ రేడియోలో ఆయనేం మాట్లాడారంటే... "కంపెనీ పెట్టిన కొత్తలో చాలా స్ట్రిక్టుగా ఉండేవాడిని. ఉద్యోగుల పనిగంటలను వారి లైసెన్స్ ప్లేట్లను గుర్తుపెట్టుకుని మరీ పర్యవేక్షించేవాడిని.. నాకు సెలవులు ఇష్టం ఉండేది కాదు.

మా కంపెనీలో పనిచేసే మిగతావారిపై రుద్దకుండా

నా విధానాలు, ప్రమాణాలను మా కంపెనీలో పనిచేసే మిగతావారిపై రుద్దకుండా ఉండటానికి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చేది. నాకు ప్రతీ ఒక్కరి లెసైన్సు ప్లేటు (వాహనం నంబరు) కూడా గుర్తుండేది.వీకెండ్స్ లో కూడా పని చేసేవాడినంటూ పాత జ్ఙాపకాలను నెమరవేసుకున్నారు.

కంపెనీ పరిమాణం పెరుగుతున్న కొద్దీ తాను నిబంధనలు

పార్కింగ్ లాట్‌లోకి చూసి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారన్నవి లెక్కేసుకునే వాణ్ని' అని బిల్ గేట్స్ చెప్పారు. అయితే కంపెనీ పరిమాణం పెరుగుతున్న కొద్దీ తాను నిబంధనలు కూడా క్రమంగా సడలించాల్సి వచ్చిందని తెలిపారు.

క్లాసులో అమ్మాయిల మధ్య నేనొక్కణ్నే..

పంతొమ్మిదో ఏట హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బైటికొచ్చి, మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించిన గేట్స్.. తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. క్లాసు మొత్తంలో మిగతా అబ్బాయిలెవరూ లేకుండా మొత్తం అమ్మాయిల మధ్యలో తానొక్కడే ఉండేలా మైక్రోసాఫ్ట్ మరో వ్యవస్థాపకుడు పాల్ అలెన్‌తో కలసి షెడ్యూలింగ్ సాఫ్ట్‌వేర్‌ను మార్చేసిన వైనాన్ని ఆయన వివరించారు.

అలెన్ కాలేజీ చదువు అప్పటికే పూర్తయిపోవడంతో

అలెన్ కాలేజీ చదువు అప్పటికే పూర్తయిపోవడంతో అది తనకు లాభించిందని గేట్స్ తెలిపారు. అయితే అమ్మాయిలతో మాట్లాడటంలో తాను అంతంతమాత్రమేనని, దీంతో అంతమంది చుట్టూ ఉన్నా వారితో పెద్దగా మాట్లాడేవాణ్ని కానని ఆయన చెప్పారు.

హార్వర్డ్ వదిలి వచ్చాక కొంచెం సోషల్ గా మూవ్ కావడం

కాలేజీ టైమ్ లో అలెన్ నాకన్నా సీనియర్ కావడంతో తొందరగా కాలేజీకి వెళ్లే వాడు. దీంతో తనకు అందమైన అమ్మాయిల పక్కన కూర్చునే ఛాన్స్ వచ్చింది. అయితే హార్వర్డ్ వదిలి వచ్చాక కొంచెం సోషల్ గా మూవ్ కావడం నేర్చుకున్నాను.

స్టీవ్ జాబ్స్‌తో తన అనుబంధాన్ని

టెక్ దిగ్గజం యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌తో తన అనుబంధాన్ని కూడా గేట్స్ వివరించారు. స్టీవ్ ఒకోసారి చాలా కఠినంగా ఉండేవాడని, ఒకోసారి ఎంతగానో ప్రోత్సహించేవాడిగా ఉండేవాడని ఆయన చెప్పారు. తామిద్దరం కలిసి కూడా పనిచేశామన్నారు.

యాపిల్ 2కి తాను సాఫ్ట్‌వేర్ కూడా రాశానని

యాపిల్ 2కి తాను సాఫ్ట్‌వేర్ కూడా రాశానని గేట్స్ చెప్పారు. ఎదుటివారి నుంచి అసాధారణమైన పనిని రాబట్టగలిగే దిట్ట జాబ్స్ అని కితాబిచ్చారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. 

https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write bill gates memorized employees licence plates to keep tabs on them
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot