ఇంటర్నెట్ కంపెనీలకు బీజేపి ఎర!

Posted By:

 ఇంటర్నెట్ కంపెనీలకు బీజేపి ఎర!

సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ ఇంటర్నెట్ కంపెనీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్, యాహూ, ఫేస్‌బుక్ వంటి కంపెనీలు భారత్‌లో డేటా సర్వర్లు ఏర్పాటు చేసుకునే విధంగా స్నేహపూర్వ పాలసీ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ అధికారి ప్రతినిది ఒకరు తెలిపారు.

భారత్‌లో ప్రస్తుతం అమలులో ఉన్న ప్రైవసీ షరతుల నేపధ్యంలో వాటిలో ఉన్న అవాంతరాలను దృష్టిలో ఉంచుకుని ఇంటర్నెట్ కంపెనీలు తమ డేటా సెంటర్లను సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో నెలకొల్పటం జరిగింది. ‘‘ మేము వారి పై ఒత్తిడి తీసుకురావటం లేదు, ఇంటర్నెట్ కంపెనీలు తమ డేటా సెంటర్లను ఇండియాలో ఏర్పాటు చేసుకోవలన్నది మా అభిప్రాయం మాత్రమే అని భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ జాతీయ సహ కన్వీనర్ వినిత్ గోయంకా మీడియాకు తెలిపారు.

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ డేటా సెంటర్లకు సంబంధించి ఇటీవల ఓ ఫోటో గ్యాలరీని విడుదల చేసింది. విశ్వ వ్యాప్తంగా గూగుల్‌కు 13 డేటా సెంటర్లు ఉన్నాయి. వాటిలో 7 అమెరికాలో ఉండగా 3 ఆసియాలో 3 యూరోప్‌లో ఉన్నాయి. ఈ సెంటర్లు నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటాయి. గూగుల్‌కు సంబంధించిన డేటా మొత్తం ఈ డేటా సెంటర్‌లలో స్టోర్ చేయటం జరుగుతుంది. నేటి ఫోటో శీర్షికలో భాగంగా గూగుల్ డేటా సెంటర్ల చిత్రాలను గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది. గూగుల్ డేటా సెంటర్లను వీక్షించేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot