అమెరికాలో ఉద్యోగమా..ఇక ఆశలు వదిలేసుకోండి !

Written By:

మన దేశంలో చాలామంది ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగం చేయాలని తహతహలాడుతుంటారు. కంపెనీ ఇచ్చే హెచ్ 1 బీ వీసాతో అక్కడ సెటిల్ కావాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఇప్పుడు వారి ఆశలు ఆడియాశలు కానున్నాయి. అక్కడ చట్టాలను అమెరికా క్లిష్టతరం చేయనుంది. ఆ బిల్లును చట్టసభల బృందం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టింది. మరి ఆ బిల్లుతో అమెరికాలో ఉన్న ఇండియా ఉద్యోగులకు వచ్చే కష్టాలేంటో చూద్దాం.

ఇండియాలో ఉద్యోగానికి బెస్ట్ కంపెనీలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెరికాలో ఉద్యోగమా..ఇక ఆశలు వదిలేసుకోండి !

హెచ్1బీ, ఎల్ 1 వీసాలు కలిగి ఉన్న సాఫ్ట్‌వేర్ నిపుణులను ఉద్యోగంలోకి చేర్చుకోకుండా ఇండియన్ ఐటీ కంపెనీలను నిరోధించేలా అమెరికాలో ఓ బిల్లు ప్రవేశపెట్టారు.

అమెరికాలో ఉద్యోగమా..ఇక ఆశలు వదిలేసుకోండి !

ప్రతినిధుల సభలో ఈ హెచ్1బీ, ఎల్ 1 వీసా సంస్కరణ చట్టం- 2016' బిల్లుకు అమెరికా శాసనసభ గనుక ఆమోదం తెలిపితే మనోళ్ల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోనున్నాయి.

అమెరికాలో ఉద్యోగమా..ఇక ఆశలు వదిలేసుకోండి !

ఈ బిల్లు ప్రకారం.. 50కి పైగా సిబ్బంది కలిగి ఉండి అందులో సగానికిపైగా హెచ్1బీ, ఎల్ 1 వీసాలపై పనిచేస్తున్నట్లయితే ఆ సంస్థ మరింత మందిని హెచ్1బీపై ఉద్యోగంలోకి తీసుకోవడానికి వీలుండదు.

అమెరికాలో ఉద్యోగమా..ఇక ఆశలు వదిలేసుకోండి !

అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చాలా వరకు ఇండియన్ ఐటీ కంపెనీలు ఎక్కువగా ఈ రెండు వీసాలు కలిగి ఉన్న నిపుణులపైనే ఆధారపడుతున్నాయి.

అమెరికాలో ఉద్యోగమా..ఇక ఆశలు వదిలేసుకోండి !

ఈ బిల్లు ఆమోదం పొందితే హెచ్1బీ హోల్డర్లకు అవకాశాలు గణనీయంగా తగ్గిపోనుండటంతోపాటు దేశీయ సాఫ్ట్‌వేర్ సంస్థల ఆదాయంపైనా భారీ ప్రభావం పడనుంది.

అమెరికాలో ఉద్యోగమా..ఇక ఆశలు వదిలేసుకోండి !

ఈ బిల్లును స్పాన్సర్ చేస్తున్న రెండు అమెరికా రాష్ట్రాల్లోనే (న్యూజెర్సీ, కాలిఫోర్నియా) మనోళ్లు అధిక సంఖ్యలో పనిచేస్తుండటం గమనార్హం.

అమెరికాలో ఉద్యోగమా..ఇక ఆశలు వదిలేసుకోండి !

అమెరికాలో పనిచేస్తున్న భారతీయ సాంకేతిక నిపుణులపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. పెద్దఎత్తున విదేశీ కార్మికుల్ని అమెరికాకు దిగుమతి చేసుకుని, స్వల్పకాలిక శిక్షణను ఇచ్చి, ఆ తర్వాత వారిని స్వదేశాలకు పంపించి అక్కడి నుంచే పనిచేసేలా చూసే కంపెనీలపై ఈ కొత్త నిబంధనలు కొరడా ఝళిపించనున్నాయి.

అమెరికాలో ఉద్యోగమా..ఇక ఆశలు వదిలేసుకోండి !

హెచ్1బీ, ఎల్1 వీసా సంస్కరణ బిల్లు చట్టంగా మారాలంటే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దీనిపై సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ అంతకంటే ముందు సెనేట్ ఈ బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టాల్సి ఉంది.

అమెరికాలో ఉద్యోగమా..ఇక ఆశలు వదిలేసుకోండి !

అమెరికాలోనే చాలా మంది సుశిక్షితులు, ఆధునిక డిగ్రీలు కలిగిన హైటెక్ నిపుణులు ఉన్నారు. ఉద్యోగాలు లేవు. కానీ కొన్ని వ్యాపార సంస్థలు ఇన్ సోర్సింగ్, విదేశీ ఉద్యోగులను ప్రోత్సహించడం ద్వారా వీసాలను దుర్వినియోగం చేస్తున్నాయి.

అమెరికాలో ఉద్యోగమా..ఇక ఆశలు వదిలేసుకోండి !

అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్న హెచ్-1బీ, ఎల్ 1 వీసాల విధానాన్ని కఠినతరం చేయాలంటూ యూఎస్ కాంగ్రెస్‌ లోఈ బిల్లును ప్రవేశపెట్టారు. వీసా జారీ ప్రక్రియలోని లోపాలను సవరించాలని సెనేట్ సభ్యులు డిమాండ్ చేశారు. తద్వారా అమెరికా ఉన్నోతోద్యోగులకు, వీసా హోల్డర్ల హక్కులను కాపాడాలని కోరుతున్నారు.

అమెరికాలో ఉద్యోగమా..ఇక ఆశలు వదిలేసుకోండి !

విదేశీ ఉద్యోగులను ఎన్నుకునేటపుడు మరింత పారదర్శకంగా వ్యవహారించాలన్నారు. తద్వారా దుర్వినియెగాన్ని అడ్డుకోవాలని, వీసా నిబంధలను ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అమెరికాలో ఉద్యోగమా..ఇక ఆశలు వదిలేసుకోండి !

అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్‌-1బి వీసా కార్యక్రమంలో సంస్కరణలు తీసుకువచ్చి, వేతన పరిమితుల్ని సవరించడానికి ఉద్దేశించిన బిల్లును అమెరికా 2010లో మొదటిసారి అమెరికా వీరువురు సెనేట్‌లో ప్రవేశపెట్టారు. కానీ అపుడు ఆమోదం లభించలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Blow for Indian IT firms, ‘anti-H-1B visa bill’ introduced in US
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot