బిల్ గేట్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన బొలివియా

Written By:

అవును మీరు విన్నది నిజం. బిల్ గేట్స్‌కి బొలివియా దిమ్మతిరిగే షాకిచ్చింది. బిల్ గేట్స్ అందించిన దానాన్ని బొలివియా తిరస్కరించి ఆయనకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆకలి కేకలతో ఉన్న దేశాలకు తన దగ్గర ఉన్న కోళ్లను దానం చేయాలనుకున్న ఆ సంపన్నుడుకి నీ కోళ్లు నీ దగ్గర పెట్టుకోండి మాకవసరంలేదు కావాలంటే మేమే మీకు కొన్ని కోళ్లు ఇస్తామని ఆయన దానాన్ని తిరస్కరించింది. షాక్ తో పాటు సంచలనం రేపుతున్నకథనం మీరే చదవండి.

Read more: కుబేరులకే కుబేరుడు: 22 సంవత్సరాల్లో 17 సార్లు నెంబర్‌వన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బిల్ గేట్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన బొలివియా

బిల్ గేట్స్ దానం ప్ర‌పంచ‌దేశాల‌కు మ‌హాప్ర‌సాదం. ఆయ‌న ఏమి ఇచ్చినా ఆ దేశాలు క‌ళ్ల‌కు అద్దుకుంటాయి. కానీ లాటిన్ దేశం బొలివియా మాత్రం బిల్ గేట్స్ ఔదార్యాన్ని తోసిపుచ్చింది. ఆ వ్యాపార‌వేత్త దానం త‌మ‌కు వ‌ద్దంటూ తేల్చి చెప్పింది.

బిల్ గేట్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన బొలివియా

దారిద్య్రాన్ని త‌రిమేందుకు బిల్ గేట్స్ ఆ దేశానికి ల‌క్ష కోళ్ల‌ను కానుక‌గా ఇవ్వాల‌నుకున్నాడు. దాని వ‌ల్ల అక్క‌డ ఆక‌లి కేక‌లు అంతం అవుతాయ‌ని అనుకున్నాడు. అయితే ఆయనకు షాకిస్తూ ఆ కోళ్లు త‌మ‌కు అవ‌స‌రంలేద‌ని వామ‌ప‌క్ష‌ దేశం పేర్కొంది.

బిల్ గేట్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన బొలివియా

బొలివియాను ఎందుకు అలా చూస్తున్నారు, మేం 500 ఏళ్ల వెన‌క్కు జీవిస్తున్నామ‌ని ఎలా అనుకుంటారు, మా పౌల్ట్రీ శాఖ గురించి ఆ అమెరికా వ్యాపార‌వేత్త‌కు ఏమి తెలుసు అని బొలివియా అభిశవృద్ధి శాఖా మంత్రి సీజ‌ర్ కొకారికో అన్నారు.

బిల్ గేట్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన బొలివియా

పేద‌రికం హెచ్చు స్థాయిలో ఉన్న దేశాల‌కు కోళ్ల‌ను దానం ఇవ్వ‌నున్న‌ట్లు ఇటీవ‌ల బిల్ గేట్స్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఆఫ్రికా-స‌హారా దేశాల‌తో పాటు బొలివియాకు ఆయ‌న ఆ దాణం చేయాల‌నుకున్నారు. కానీ గేట్స్ గిఫ్ట్‌ను బొలివియా నిరాక‌రించింది.

బిల్ గేట్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన బొలివియా

ప్రతి సంవత్సరం బొలివియా 197 మిలియన్ల కోళ్లను ఉత్పత్తి చేస్తోంది. బొలివియా 36 మిలియన్ల కోళ్లు విదేశాలకు ఎగుమతి చేస్తున్న తరుణంలో కోళ్ల దానం వద్దని హెచ్చరించింది.

బిల్ గేట్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన బొలివియా

100,000 కోళ్ళను బిల్ గేట్స్ బొలివియాకు విరాళంగా ఇవ్వదలిచారని కానీ అందుకు ఆ దేశం విముఖత చూపిందని బిల్ గేట్స్ కంపెనీ వర్గాలు తెలిపాయి.

బిల్ గేట్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన బొలివియా

అయితే ఆ దేశంలో కరవు ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు. బొలివియాలోనే సెకండ్ లార్జెస్ట్ లేక్ గా గుర్తింపు పొందిన ఓ సరస్సు నీరులేక ఇలా ఇలా వెలవెలబోతోంది.

బిల్ గేట్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన బొలివియా

1986లో ఆ ప్రాంతం నీటితో కళకళలాడుతూ ఉంటే ఈ సంవత్సరానికి నీరేలేక ఇలా వెలవెలబోతోంది. శాటిలైట్ ఇమేజ్ ఈ విషయాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

బిల్ గేట్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన బొలివియా

అక్కడ జాలరుల ఉపాధికి తీవ్రంగా గండిపడింది. కరవుతోఆ సరస్సు ఇలా బీడలు వారి వారి జీవితాలో చీకిటిని నింపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

బిల్ గేట్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన బొలివియా

కంప్యూటర్లు దండగ..లక్ష కోళ్లు ఇస్తా పెంచుకోండి

బిల్ గేట్స్ గురించి 13 ఆసక్తికర నిజాలు

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

బిల్ గేట్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన బొలివియా

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Bolivia rejects offensive chicken donation from Bill Gates
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot