కుబేరులకే కుబేరుడు: 22 సంవత్సరాల్లో 17 సార్లు నెంబర్‌వన్

By Hazarath
|

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ఈ సారి కూడా ఫోర్బ్స్‌ ప్రపంచ ధనికుల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 7,500 కోట్ల డాలర్ల సంపదతో గేట్స్‌ ఈ ఏడాది కూడా టాప్‌ప్లేస్‌ దక్కించుకున్నారు. అయితే వరసగా మూడేళ్ల నుంచి గేట్స్‌ ఫోర్బ్స్‌ బిలియనీర్‌ జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతున్నారు.

bill gates

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొత్తం 22 సంవత్సరాల్లో 17 సార్లు ఆయన నెంబర్‌వన్‌ ధనికుడిగా నిలిచారు. గతేడాదితో పోలిస్తే గేట్స్‌ సంపద 420 కోట్ల డాలర్లు తగ్గింది. అయినా ఆయనకే నెంబర్‌ వన్‌ కిరీటం దక్కింది. అయితే ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో భారత కుబేర దిగ్గజం ముకేశ్‌ అంబానీ ప్రపంచ కుబేరుల్లో 36వ స్థానం దక్కించుకున్నారు. అలాగే ఫోర్బ్స్‌ ప్రపంచ ధనికుల జాబితాలో మొత్తం 84 మంది భారతీయులకు చోటు దక్కింది.

bill gates

ఇక 2016 ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం ప్రపంచంలో 1,810 మంది కుబేరులున్నారు. గతేడాదితో (1,826 మంది) పోలిస్తే ఇది కాస్త తగ్గింది. ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే ప్రపంచంలోని అత్యంత ముఖ్యులైన ధనికులందరి సంపద మొత్తం విలువ రూ. 8,27,00 కోట్లు. బిల్ గేట్స్ ఆస్తిపై దిమ్మతిరిగే నిజాలు ఇవే..

Read more : బిల్ గేట్స్ గురించి 13 ఆసక్తికర నిజాలు

బిల్ గేట్స్ ఒక దేశమైతే..

బిల్ గేట్స్ ఒక దేశమైతే..

బిల్ గేట్స్ ఒక దేశమైతే. ఈ భూమి పై 37వ ధనిక దేశంగా బిల్ గేట్స్ ఉంటారు.

 

 

 బిల్ గేట్స్ ఆస్తి... దిమ్మ తిరిగే నిజాలు!

బిల్ గేట్స్ ఆస్తి... దిమ్మ తిరిగే నిజాలు!

అమెరికాలో అత్యధిక పారితోషకాన్ని అందుకుంటున్న అథ్లెట్ మైఖేల్ జోర్డాన్. ఈ క్రీడాకారుడి వార్షిక ఆదాయం యూఎస్ $30 మిలియన్లు. మైఖేల్ జోర్డాన్ 277 సంవత్సరాల పాటు తనకు వచ్చే ఆదాయాన్ని ఏ మాత్రం ఖర్చుపెట్టకుండా ఉన్నట్లయితే బిల్స్ గేట్స్ ప్రస్తుత సంపదను మించగలడు.

 

 

బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలు
 

బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు తమ కంప్యూటర్ హ్యాంగ్ అయిన ప్రతిసారీ నష్టపరిహారం క్రింది యూఎస్ $1 డాలర్‌ను కోరినట్లయితే. బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలవుతారు.

 

 

భూమి పై జీవించే ప్రతి ఒక్కరికి $15 డాలర్‌లను దానం చేసినప్పటికి...

భూమి పై జీవించే ప్రతి ఒక్కరికి $15 డాలర్‌లను దానం చేసినప్పటికి...

బిల్ గేట్స్ ఈ భూమి పై జీవించే ప్రతి ఒక్కరికి $15 డాలర్‌లను దానం చేసినప్పటికి. ఆయన వద్ద ఇంకా యూఎస్ $5 మిలియన్ సంపద మిగిలి ఉంటుంది.

 

 

అమెరికాకు ఉన్న అప్పు విలువ మొత్తాన్ని..

అమెరికాకు ఉన్న అప్పు విలువ మొత్తాన్ని..

అమెరికాకు ఉన్న అప్పు విలువ షుమారు 5.62 ట్రిలియన్లు. ఈ మొత్తాన్ని బిల్‌గేట్స్ 10 సంవత్సరాల్లో తీర్చగలరు.

 

 

బిల్ గేట్స్ సంపాదన సెకనుకు..

బిల్ గేట్స్ సంపాదన సెకనుకు..

బిల్ గేట్స్ సంపాదన సెకనుకు $250 యూఎస్ డాలర్లు, రోజుకు $20 మిలియన్. సంవత్సరానికి $7.2 బిలియన్.

 

 

బిల్ గేట్స్ ఓ వెయ్యి డాలర్ల‌ను నేలపై జారవిడిచినట్లయితే

బిల్ గేట్స్ ఓ వెయ్యి డాలర్ల‌ను నేలపై జారవిడిచినట్లయితే

బిల్ గేట్స్ ఓ వెయ్యి డాలర్ల‌ను నేలపై జారవిడిచినట్లయితే వాటిని తిరిగి తీసుకోనవసరం లేదు. ఎందుకంటే గేట్స్ ఆ జార విడిచిన మొత్తాన్ని నాలుగు సెకన్లలో సంపాదించగలరు.

 

 

మైక్రోసాఫ్ట్ పై తన దృష్టిని పూర్తిస్థాయిలో కేటాయించేందుకు

మైక్రోసాఫ్ట్ పై తన దృష్టిని పూర్తిస్థాయిలో కేటాయించేందుకు

ఇతర విజయవంతమైన టెక్ పారిశ్రామికవేత్తల మాదిరిగానే బిల్ గేట్స్ కూడా డ్రాప్ అవుటే. మైక్రోసాఫ్ట్ పై తన దృష్టిని పూర్తిస్థాయిలో కేటాయించేందుకు గేట్స్ 1975లో హార్వర్డ్ యూనివర్శిటీని విడిచారు.

30.8 బిలియన్  డాలర్లను వెచ్చించి

30.8 బిలియన్ డాలర్లను వెచ్చించి

బిల్ గేట్స్ 1994లో నిర్వహించిన ఓ వేలం పాటలో $30.8 బిలియన్ వెచ్చించి లియోనార్డో డా విన్సీ రచించిన కోడెక్స్ లీసెస్టర్‌ను కొనుగోలు చేసారు.

 

 

బిల్ గేట్స్ వద్ద తరగని సంపద ఉన్నప్పటికి

బిల్ గేట్స్ వద్ద తరగని సంపద ఉన్నప్పటికి

బిల్ గేట్స్ వద్ద తరగని సంపద ఉన్నప్పటికి తమ పిల్లలకు వారసత్వంగా 10 మిలియన్‌లు మాత్రమే ఇచ్చారు. పిల్లల వద్ద డబ్బులు ఎక్కువ ఉండకూడదన్నది బిల్ గేట్స్ అభిప్రాయం.

 

 

భవిష్యత్ గురించి బిల్‌ గేట్స్ చెప్పిన నిజాలు

భవిష్యత్ గురించి బిల్‌ గేట్స్ చెప్పిన నిజాలు

భవిష్యత్ గురించి బిల్‌ గేట్స్ చెప్పిన నిజాలు..లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మైక్రోసాఫ్ట్ లేకుంటే ‘బిల్ గేట్స్' ఏమయ్యే వారు..?

మైక్రోసాఫ్ట్ లేకుంటే ‘బిల్ గేట్స్' ఏమయ్యే వారు..?

మైక్రోసాఫ్ట్ లేకుంటే ‘బిల్ గేట్స్' ఏమయ్యే వారు..? లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

బిల్‌ గేట్స్ ఇంట్లో సంచలనం, మరెన్నో..

బిల్‌ గేట్స్ ఇంట్లో సంచలనం, మరెన్నో..

క్లిక్ చేయండి క్లిక్ చేయండి

 

 

Best Mobiles in India

English summary
Here Write Bill Gates remains richest man in world in 2016 list of billionaires - and Mark Zuckerberg rises ten spots to number six

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X