5వ తరగతికే గూగుల్ అవార్డ్ కొట్టేశాడు

Written By:

మన దేశం నుంచి అత్యంత ప్రతిభ, నైపుణ్యం కలిగిన సాఫ్ట్ వేర్ నిపుణులు విదేశాలకు వెళుతున్నారు. అయితే వారితో పాటు విద్యార్థులు కూడా తమ ప్రతిభను చిన్నప్పుడే చాటుకొంటున్నారు.ఇక వివరాల్లోకెళితే ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ .. నిర్వహించే 'కోడ్ టు లెర్న్ కాంటెస్ట్'లో చెన్నైకి చెందిన శ్రీకృష్ణ మధుసూదనన్ విజేతగా నిలిచాడు.

5వ తరగతికే గూగుల్ అవార్డ్ కొట్టేశాడు

భారత్లో కంప్యూటర్ సైన్స్ను మరింతగా అభివృద్ధి చేసే లక్ష్యంతో గూగుల్ సంస్థ 'కోడ్ టు లెర్న్ కాంటెస్ట్' పేరుతో ప్రతి సంవత్సరం ఈ పోటీని నిర్వహిస్తోంది. భారత దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా గూగుల్ ఈ అవార్డును ప్రారంభించింది. గత ఏడాది నిర్వహించిన ఈ కాంటెస్ట్లో పెరంగుడిలోని బీవీఎం గ్లోబల్ స్కూల్లో 5 వ తరగతి చదువుతున్న శ్రీకృష్ణ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అవార్డును దక్కించుకున్నాడు.

5వ తరగతికే గూగుల్ అవార్డ్ కొట్టేశాడు

తన బిడ్డకు అవార్డు రావడం గురించి శ్రీకృష్ణ తల్లి శాంతి మాట్లాడుతూ .. చిన్ననాటి నుంచే కంప్యూటర్ అంటే ఆసక్తి కనబర్చేవాడని, బీవీఎం పాఠశాలలో నిర్వహిస్తున్న రోబోటిక్ సైన్స్ తరగతులు ఉపయోగపడ్డాయన్నారు.ఈ సంధర్భంగా గూగుల్ చరిత్రలో షాకింగ్ నిజాలను ఓ నిజాలను చూద్దాం.

Read more: గూగుల్ నుంచి ఆదాయం పొందడమెలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మిలియన్ డాలర్లకు విక్రయించేందుకు

గూగుల్ వ్యవస్థాపకలు 1999లో తమ సంస్థను ఎక్సైట్ (Excite) అనే కంపెనీకి 1 మిలియన్ డాలర్లకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ డీల్ కాస్త కుదరలేదు.

 

 

ఓ గూగుల్ ఉద్యోగి మరణిస్తే..

అతను లేదా ఆమె జీవిత భాగస్వామికి 10 సంవత్సరాల పాటు గూగుల్ సగం జీతం చెల్లిస్తుంది. సదురు ఉద్యోగి పిల్లలకు 19 సంవత్సరాల వచ్చేంత వరకు నెలకు 1,000 డాలర్లను గూగుల్ చెల్లిస్తుంది.

 

 

2020లోపు 120 మిలియన్ ప్రత్యేక పుస్తకాలను

2020లోపు 120 మిలియన్ ప్రత్యేక పుస్తకాలను స్కాన్ చేయాలని గూగుల్ భావిస్తోంది.

 

 

గూగుల్ ఒంటెను అద్దెకు

ఓ ఎడారికి సంబంధించి స్ట్రీట్ వ్యూను సృష్టించే క్రమంలో గూగుల్ ఒంటెను అద్దెకు తీసుకుంది.

 

 

అడ్వర్టైజింగ్ విభాగంలో

అడ్వర్టైజింగ్ విభాగంలో ఏటా గూగుల్ అర్జిస్తున్న ఆదాయం 20 బిలియన్ డాలర్లు.

 

 

గూగుల్‌లో నిమిషానికి..

గూగుల్‌లో నిమిషానికి 2 మిలియన్ల సెర్చ్‌లు జరుగుతున్నాయి.

 

 

ఏప్రిల్ ఫూల్స్ డే చమత్కారంగా

జీమెయిల్‌ను 2004 ఏప్రిల్ 1న ఆవిష్కరించారు చాలా మంది ఈ ఆవిష్కరణను ఏప్రిల్ ఫూల్స్ డే చమత్కారంగా భావించారు.

గూగుల్ మొదటి కంప్యూటర్ స్టోరేజ్ ను

గూగుల్ మొదటి కంప్యూటర్ స్టోరేజ్ ను LEGO సంస్థ రూపొందించింది.

 

 

ఓ స్మార్ట్ కంప్యూటర్ తనను తానే ప్రోగ్రామ్

గూగుల్ అభివృద్థి చేస్తోన్న ఓ స్మార్ట్ కంప్యూటర్ తనను తానే ప్రోగ్రామ్ చేసుకోగలదు.

 

 

అత్యధిక మంది వీక్షించే వెబ్‌సైట్‌గా

అత్యధిక మంది వీక్షించే వెబ్‌సైట్‌గా గూగుల్ గుర్తింపు తెచ్చుకుంది.

 

 

2013, ఆగష్ట్ 16న గూగుల్ సర్వర్లు

2013, ఆగష్ట్ 16న గూగుల్ సర్వర్లు 5 నిమిషాల పాటు డౌన్ అయ్యాయి. ఆ సమయంలో గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ 40 శాతానికి పడిపోయింది.

2010 నుంచి గూగుల్

2010 నుంచి గూగుల్ నెలకు రెండు కంపెనీలు చొప్పున కొనుగోలు చేస్తూ వస్తోంది.

 

 

2016 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని

2016 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చంద్రమండలం పై ల్యాండ్ కాగలిగే ఏ జట్టుకైనా 20 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని గూగుల్ తెలిపింది.

 

 

గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో పొందుపరిచిన

గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో పొందుపరిచిన అసాధారణ ఇంటర్‌ఫేస్ వ్యవస్థ ఏ ఇతర వెబ్‌సైట్ లోడ్ చేయనంత వేగంగా (0.5 సెకన్లు అంతకన్నా తక్కువ సమయంలో) గూగుల్ వెబ్ పేజీలనులోడ్ చేస్తుంది.

 

 

ఏదైనా శోధనా ప్రశ్నకు సంబంధించి

ఏదైనా శోధనా ప్రశ్నకు సంబంధించి అత్యుత్తమ ఫలితాలను బట్వాడా చేసే క్రమంలో గూగుల్ 200 కారకాలను పరిగణలోకి తీసుకుని కేవలం ఒక్క సెకను కాలంలో అత్యుత్తమ అప్‌డేట్‌లను విడుదల చేస్తుంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Boy Wins Google Coding Contest
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot