Home
News

Boycott China Products List: లడఖ్‌లో చైనా వైఖరికి సవాలుగా "బాయికాట్ చైనా ప్రోడక్ట్స్" నినాదం!!!!

గత కొన్ని నెలలుగా లడఖ్ సరిహద్దులో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సంగతి అందరికి కూడా తెలిసిన విషయమే. ఈ ఉద్రిక్తతలు మొదలైన తరువాత ఇండియాలో చాలా మంది 'బహిష్కరించవలసిన' చైనా ఉత్పత్తుల జాబితాను గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.

బాయికాట్ చైనా ప్రోడక్ట్స్

బాయికాట్ చైనా ప్రోడక్ట్స్

లడఖ్‌లో చైనా వైఖరి

లడఖ్‌లో చైనా వైఖరి

భారతదేశం మరియు చైనా మధ్య గందరగోళానికి గల ముఖ్య కారణం లడఖ్‌లోని భారత భూభాగంపై PLA సార్వభౌమాధికారాన్ని ప్రకటించడం. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య పరస్పర వాగ్వాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం లడఖ్‌లో ఇరు దేశాల సైన్యాల మధ్య ఘోరమైన పోరాటం జరిగినట్లు కూడా కొన్ని వార్తలు గుప్పుమన్నాయి. ఈ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. అలాగే చైనా యొక్క సైనికులు కూడా సుమారు 100 మంది మరణించినట్లు చైనా వెల్లడించింది. Also Read: BSNL నుంచి అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలు రూ.19లకే

బాయికాట్ చైనా ప్రోడక్ట్స్ లిస్ట్

బాయికాట్ చైనా ప్రోడక్ట్స్ లిస్ట్

ఈ నెల ప్రారంభంలో సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో '3 ఇడియట్స్' ను ప్రేరేపించమని సూచనలను ఇచ్చారు. ఇందులో భాగంగా చైనీస్ యొక్క ఉత్పత్తులను భారతీయులు బహిష్కరించాలని విధు వినోద్ చోప్రా తెలిపారు. ప్రస్తుతం #BoycottChina, #BoycottMadeinChina, #BoycottChineseApps మరియు #BoycottTiktok వంటివి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడం ప్రారంభమయ్యాయి.

బాయికాట్ టిక్‌టాక్ యాప్

బాయికాట్ టిక్‌టాక్ యాప్

వాస్తవానికి ప్రస్తుతం ఇండియా యొక్క సరిహద్దులో చైనా చేస్తున్న దౌర్జన్యాలకు నిరసనగా నిరసనగా చాలా మంది భారతీయ ప్రజలు తమ ఫోన్‌లలో వాడుతున్న ప్రముఖ చైనా యాప్ టిక్‌టాక్ ను మొదట అన్‌ఇన్‌స్టాల్ చేశారు. ప్రస్తుతం ప్రజలు తమ ఫోన్‌ల నుండి తొలగిస్తున్న చైనీస్ యాప్ లలో ఇది మొదటి స్థానంలో ఉంది. టిక్‌టాక్ యాప్ ఇండియాలో ఎంత త్వరగా డౌన్ లోడ్ చేసుకున్నారో అంతే త్వరగా అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్నారు.

బాయికాట్ ‘మేడ్ ఇన్ చైనా’

బాయికాట్ ‘మేడ్ ఇన్ చైనా’

జూన్ 16 న భారత్, చైనా సరిహద్దులలో ఉద్రిక్తతలు మరింత పెరిగిన కారణంగా ఇండియాలోని ప్రజలు ప్రస్తుతం వాడుతున్న వాటిలో బహిష్కరించాల్సిన ‘మేడ్ ఇన్ చైనా' ఉత్పత్తుల జాబితాను సుమారు 500 కి పైగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ని విడుదల చేసింది.

‘మేడ్ ఇన్ చైనా’ ప్రోడక్ట్స్ బాయికాట్ వివరాలు

‘మేడ్ ఇన్ చైనా’ ప్రోడక్ట్స్ బాయికాట్ వివరాలు

చైనా యొక్క వస్తువులను బహిష్కరించాలని తెలుపుతూ CAIT విడుదల చేసిన జాబితాలో బొమ్మలు, ఫ్యాబ్రిక్స్,అపెరల్, దుస్తులు, రోజువారీ వస్తువులు, వంటగది వస్తువులు, ఫర్నిచర్, హార్డ్వేర్, పాదరక్షలు, హ్యాండ్‌బ్యాగులు,లగేజ్ బ్యాగులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, సౌందర్య సాధనాలు వంటివి ఉన్నాయి. వీటితో పాటుగా గిఫ్ట్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, గడియారాలు, ఆభరణాలు, స్టేషనరీ వస్తువులు, గృహోపకరణాలు, ఇంటికి కావలసిన వస్తువులు , ఆరోగ్య ఉత్పత్తులు, వాహనాల ముడి భాగాలు మొదలైనవి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Boycott China Products and Apps List
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X