BSNL నుంచి అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలు రూ.19లకే
టెలికామ్ రంగంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏకైక టెలికం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం కొత్తగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన ప్లాన్ లను ప్రారంభిస్తూనే ఉంది. బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా ఇప్పుడు పుంజుకుంటున్న BSNL యొక్క భారత్ ఫైబర్ ఇంటర్నెట్ ప్లాన్‌లలో 200Mbps స్పీడ్‌ను అందించే తన ప్లాన్‌కు బదులుగా 100Mbps వేగంతో 1.4TB డేటాను అందించే మరొక కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది.

BSNL వాయిస్-ఓన్లీ STV
ఇది డేటా ప్రయోజనాలతో పాటుగా వాయిస్ కాలింగ్ సేవలను కూడా అందిస్తుంది. BSNL తన వినియోగదారులకు స్పెషల్ టారిఫ్ వోచర్లను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా టెల్కో 5 వాయిస్-ఓన్లీ STV ప్లాన్‌లను అందిస్తోంది. వీటి యొక్క ధరలు కేవలం రూ.19 నుండి ప్రారంభమవుతుంది. BSNL అందిస్తున్న ఇతర వాయిస్-ఓన్లీ STV ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.19 వాయిస్ ఓన్లీ STV ప్లాన్
బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క వాయిస్-ఓన్లీ కేటగిరీ కింద రూ.19 ధర వద్ద చౌకైన STV ప్లాన్‌ను అందిస్తున్నది. దీని యొక్క పేరుకు తగ్గట్టుగా ఈ వోచర్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను మాత్రమే అందిస్తుంది. అయితే కాల్‌లు పూర్తిగా ఉచితం కావు. ఇందులో మీ కాల్‌లకు నిమిషానికి 20 పైసలు చెల్లించవలసి ఉంటుంది. ఈ వోచర్ 30 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. Also Read:Rs.20,000 ధర లోపు కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో బెస్ట్ ఇవే...

BSNL రూ.99 వాయిస్ ఓన్లీ STV ప్లాన్
వాయిస్-ఓన్లీ STV కేటగిరీ కింద బిఎస్ఎన్ఎల్ రూ.99 ధర వద్ద రెండవ వోచర్‌ను అందిస్తున్నది. అయితే ఇది రూ.19 వోచర్‌లా కాకుండా ఇది మీకు అపరిమిత కాలింగ్ ప్రయోజనంను అందిస్తుంది. అయితే అన్ని ప్లాన్ ల మాదిరిగా దీని యొక్క అపరిమిత కాలింగ్ ప్రయోజనం రోజుకు 250 నిమిషాలు మాత్రమే. దీని తర్వాత మీరు చేసే ప్రతి కాల్ కు బేస్ టారిఫ్ వద్ద వసూలు చేయబడుతుంది. ఈ వోచర్ యొక్క చెల్లుబాటు 22 రోజులు మాత్రమే.

BSNL రూ.135 వాయిస్ ఓన్లీ STV ప్లాన్
బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క మూడవ వాయిస్-ఓన్లీ STV ప్లాన్ రూ.135 ధర వద్ద వస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 300 నిమిషాల అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో వస్తుంది. దీని తర్వాత ప్రతి ఫోన్ కాల్ మీద బేస్ టారిఫ్ ఛార్జీలు వసూలు చేయబడతాయి. ఈ వోచర్ యొక్క చెల్లుబాటు 24 రోజులు.

BSNL రూ.209 వాయిస్ ఓన్లీ STV ప్లాన్
బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క నాల్గవ వాయిస్-ఓన్లీ STV ప్లాన్ రూ.209 ధర వద్ద 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది అపరిమిత కాలింగ్ ప్రయోజనంతో కాకుండా మీ అకౌంట్ బ్యాలెన్స్‌పై మీకు రూ.25 టాక్‌టైమ్ ను అందిస్తుంది. మీరు చేసే ప్రతి కాల్ కోసం 2 సెకన్లకు 1 పైసా వసూలు చేయబడుతుంది.

BSNL రూ.319 వాయిస్ ఓన్లీ STV ప్లాన్
బిఎస్‌ఎన్‌ఎల్ నుండి వస్తున్న అత్యంత ఖరీదైన వాయిస్-ఓన్లీ STV ప్లాన్ ఇది. రూ.319 ధర గల ఈ STV ప్లాన్ అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో 75 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








