కన్ను మూసి తెరిచే లోపు సర్వనాశనం, రాడార్లకు చిక్కని అస్త్రాలు

|

డ్రోన్.. ఈ పేరు వినగానే ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది మిలటరీ ఆపరేషన్స్. సైనిక అవసరాలకు డ్రోన్ సేవలను ఎడాపెడా ఉపయోగిం చుకున్నాయి విదేశాలు. ముఖ్యంగా నిఘా అవసరాలకు డ్రోన్ సేవలను వాడుకుంటున్నాయి . డ్రోన్.. రోబోటిక్స్ రంగంలో మోస్ట్ అడ్వాన్స్ డ్ ఎక్విప్ మెంట్. గ్రౌండ్ నుంచి కమాండ్స్ ఇస్తూ ఆపరేట్ చేస్తే చాలు.. మనిషి అవసరం లేకుండానే, అసైన్ చేసిన పనిని అలవోకగా చేసేస్తుంది. అయితే అదే తరహాలో ఇప్పుడు బ్రిటన్ అధునాతన డ్రోన్స్ తో ప్రపంచానికి ముచ్చెమటలు పట్టిస్తోంది.రాడార్ కు అందని మానవరహిత విమానాలు..ఇవి ఇప్పుడు బ్రిటన్ చేతికి ఆయుధాలుగా మారబోతున్నాయి. బ్రిటన్ మిలిటరీలోకి ఈ డ్రోన్స్ ఇప్పుడు రానున్నాయి. ఈ విమానాలు రాడార్ కు దొరకవు..కాని కనుమూసి తెరిచే లోపు పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి.
అదే తరనిస్..ఇది ఇప్పుడు సెల్టిక్ గాడ్ ఆఫ్ ధండర్ గా పేరు మార్చుకుంది. మిగితా కథనం కింద చూడండి.

 

Read more: ఒక్క మెసేజ్..స్మార్ట్ ఫోన్ హ్యాకింగ్

రాడార్ కు అందని మానవరహిత విమానాలు

రాడార్ కు అందని మానవరహిత విమానాలు

రాడార్ కు అందని మానవరహిత విమానాలు..ఇవి ఇప్పుడు బ్రిటన్ చేతికి ఆయుధాలుగా మారబోతున్నాయి. బ్రిటన్ మిలిటరీలోకి ఈ డ్రోన్స్ ఇప్పుడు రానున్నాయి. ఈ విమానాలు రాడార్ కు దొరకవు..కాని కనుమూసి తెరిచే లోపు పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి.

 సూపర్ సోనిక్ 700 mph వేగ సామర్థ్యం

సూపర్ సోనిక్ 700 mph వేగ సామర్థ్యం

అత్యంత స్పీడ్ గా దూసుకువెళ్లే సూపర్ సోనిక్ 700 mph వేగ సామర్థ్యం ఈ డ్రోన్స్ కు ఉంది. ఇది అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. అధునాతనమైన టెక్నాలజీతో అత్యంత వేగంగా ఇది గాల్లో చక్కర్లు కొట్టగలదు. వారు దీనికి సెల్టిక్ గాడ్ ఆఫ్ ధండర్ అని పేరు కూడా పెట్టారు. ఇది ఖచ్చితంగా బ్రిటన్ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతుందని బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ధీమా వ్యక్తం చేస్తోంది.

రాడార్లకు చిక్కకుండానే శత్రువుల మీద దాడి
 

రాడార్లకు చిక్కకుండానే శత్రువుల మీద దాడి

ఇంతకుముందు ఉన్న తరనీస్ డ్రోన్స్ కు పేరు మార్చి సెల్టిక్ గాడ్ ఆఫ్ ధండర్ అని పేరు పెట్టారు.వీటితో ఒకే ఒక్క క్షణంలో శత్రువుల ఆయుధాలన్నీ ధ్వసం చేసే సత్తా ఈ డ్రోన్స్ కు ఉంది. ఆ విధంగా వీటిని తయారు చేయనున్నారు.
ఈ ఎయిర్ డ్రోన్స్ గాల్లో అన్ని అంచనాలను అధిగమించి మిలిటరీలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. అయితే ఈ డ్రోన్లు ఎయిర్ ఫోర్స్ కు మాత్రమే వాడుతున్నామని చెబుతున్నా.. అధునాతన ఆయుధాల కేటగిరిలో దీన్ని వాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ద్వని వేగం కంటే స్పీడుగా

ద్వని వేగం కంటే స్పీడుగా

ఈ తరనిస్ తో ఎటువంటి ప్రయోగాల నైనా ఇట్టే చయవచ్చు. నిఘా కార్యకలపాలకు, అలాగే బాంబు దాడులకు వాటిని అడ్డుకునేందుకు మొదలగు అనేక రూపాల్లో ఈ డ్రోన్స్ వినియోగించవచ్చు.ఇవి ద్వని వేగం కంటే స్పీడుగా ప్రయాణించి శత్రువుల రాడార్ లను ధ్వసం చేయగలవు. దీనితో శత్రువులను ఏకకాలంలో ఎదుర్కోవచ్చు. సౌండ్ ద్వారా శత్రువుల సామర్థ్యాన్ని పసిగట్టే కెపాసిటీ దీనికుంది. అయితే స్వయం ప్రతిపత్తితో కూడిన విమానం అనే పుకార్లు కూడా వస్తున్నాయి. వీటిని వారు కూడా ఖండించడం లేదు.

రిమోట్ తోనే దీన్ని ఆపరేట్ చేసి శత్రువుల మీదకు

రిమోట్ తోనే దీన్ని ఆపరేట్ చేసి శత్రువుల మీదకు

అందువల్ల దీనిని ఆటోమిషన్ లెవల్ కింద ఆమోదించారు. ఇది చూసే దానికి పక్షిలాగా చాలా చిన్నగా ఉంటుంది. 32 అడుగుల రెక్కలతో 39 అడుగులతో చాలా పెద్దదిగా కనిపించే డ్రోన్లకు ఇది చాలా దూరం. మాములుగా రిమోట్ తోనే దీన్ని ఆపరేట్ చేసి శత్రువుల మీదకు పంపవచ్చు. అయితే రిమోట్ ఫైలెట్ చేతిలో ఉంటుంది. ఎక్కడి నుంచైనా సిగ్నల్స్ తో ఆపరేట్ చేయవచ్చు.

డేవిడ్ కామెరూన్ టెర్రరిజంపై ఫైట్ చేస్తామని వార్నింగ్

డేవిడ్ కామెరూన్ టెర్రరిజంపై ఫైట్ చేస్తామని వార్నింగ్

గతేడాది బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ టెర్రరిజంపై ఫైట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఉత్తర ఆప్రికాలోని తీవ్రవాదాన్ని భవిష్యత్ లో డ్రోన్లతోనే ఎదుర్కుంటామని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.అందులో భాగంగా ఈ డ్రోన్స్ ను బయటకు తెస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయి.

మారుతున్న అవసరా లకు తగ్గట్లు వ్యూహాలు

మారుతున్న అవసరా లకు తగ్గట్లు వ్యూహాలు

ప్రపంచవ్యాప్తంగా సైనిక అవసరాలు మారుతున్నాయి. మారుతున్న అవసరా లకు తగ్గట్లు వ్యూహాలు మార్చుకుంటున్నాయి అన్ని దేశాలు. ఈ పరిస్థితుల్లో, డ్రోన్‌లను భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవడానికి ఉబలాటప డుతున్నాయి అన్ని దేశాలు. పెద్ద సంఖ్యలో డ్రోన్‌లు ఉండటాన్ని. భద్రత పరంగా ఒక ప్లస్ పాయింట్‌గా భావిస్తున్నాయి.ఆ దిశలోనే బ్రిటన్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

డ్రోన్‌లు ఉంటే చాలు.. నిఘాపరంగా మంచి పొజిషన్‌లో ఉన్నట్లే

డ్రోన్‌లు ఉంటే చాలు.. నిఘాపరంగా మంచి పొజిషన్‌లో ఉన్నట్లే

డ్రోన్‌లు ఉంటే చాలు.. నిఘాపరంగా మంచి పొజిషన్‌లో ఉన్నట్లే అని లెక్కలు వేసుకుంటున్నాయి అన్ని దేశాలు. ఈ విషయంలో అమె రికా, బ్రిటన్ ముందంజలో ఉన్నాయి. లేటెస్ట్‌గా ఎంక్యు 9 రీపర్, ఎంక్యు 1బి ప్రిడేటర్ డ్రోన్ డిజైన్లను డెవలప్ చేసింది అమెరికా. వాటికి ఏ మాత్రం తీసిపోకుండా ఈ డ్రోన్స్ రంగంలోకి దిగనున్నాయి.

 డ్రోన్‌లపై ఎడా పెడా విమర్శలు

డ్రోన్‌లపై ఎడా పెడా విమర్శలు

సైనిక అవసరాల సంగతి ఎలా గున్నా, డ్రోన్‌లపై ఎడా పెడా విమర్శలు వస్తున్నాయి. ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి అయినా.. డ్రోన్ ల సాయంతో బాంబులు వేసి, వేల మందిని చంపొచ్చు. దీంతో, మానవహ క్కుల సంఘాలు రంగంలోకి దిగాయి. భారీ ఎత్తున జన నష్టానికి కారణ మయ్యే డ్రోన్‌లను నిషేధించాలన్న డిమాండ్ తెర పైకి వచ్చింది.

టెక్ లీడర్లంతా పిటిషన్ పై సంతకాలు

టెక్ లీడర్లంతా పిటిషన్ పై సంతకాలు

ఇటువంటి డ్రోన్లు తయారు చేయరాదని వీటి వల్ల ప్రాణ నష్టం భారీ ఎత్తున జరిగే అవకాశాలు ఉన్నాయని వీటిని వ్యతిరేకించాలంటూ టెక్ లీడర్లంతా పిటిషన్ పై సంతకాలు చేశారు. 16000 వేల మంది రీసెర్చర్స్ తో పాటు ప్రఖ్యాత శాస్ర్తవేత్త స్టీపెన్ హాకింగ్ గూగుల్ డైరక్టర్ మొదలగు వారు ఉన్నారు. వీరంతా సైన్ చేసిన పిటిషన్ ను ఐక్యరాజ్యసమితికి పంపారు.

భవిష్యత్ లో పెను సవాళ్లు

భవిష్యత్ లో పెను సవాళ్లు

తరనిస్ ఆయుధాలు లాగే ఇతర ఆయుధాలు కూడా మానవాళిని నాశనం చేస్తాయని వీటిని నిషేధించాలని వారు పట్టుబడుతున్నారు. వారు ఈ ప్రయోగాలను ఆపకపోతే భవిష్యత్ లో పెను సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు.

వచ్చే 20 సంవత్సరాలకు..

వచ్చే 20 సంవత్సరాలకు..

అయితే యునైటైడ్ స్టేట్స్ తో పాటు యునైటైడ్ కింగ్ డమ్ కూడా వచ్చే 20 సంవత్సరాలకు అనేక అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. అలాగే రోబోట్ లను కూడా పెంచుకుంటూ పోతోంది.

రాడార్లకు అందని మానవ రహిత విమానాలు

రాడార్లకు అందని మానవ రహిత విమానాలు

రాడార్లకు అందని మానవ రహిత విమానాలు..ఇప్పుడు బ్రిటన్ చేతిలోకి చేరాయి. మరి భవిష్యత్ లో వీటితో బ్రిటన్ ఏం చేయబోతుందనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న 

మిగతా దేశాలు కూడా తమ వ్యూహంగా మార్చకుంటాయా ..

మిగతా దేశాలు కూడా తమ వ్యూహంగా మార్చకుంటాయా ..

సిగ్నల్స్ లేకుండా రాడార్లకు దొరకకుండా శత్రువులపై యుద్దాన్ని చేసే ఈ మానవరహిత విమానాలను మిగతా దేశాలు కూడా తమ వ్యూహంగా మార్చకుంటాయా లేదా అన్నది ముందు ముందు చూడాలి. 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
Here Write Britain’s New Top Secret Drone is Virtually Invisible To Any RADAR

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X