ఒక్క మెసేజ్..స్మార్ట్ ఫోన్ హ్యాకింగ్

Posted By:

ప్రజావేగు ఎడ్వర్డ్ స్నోడెన్ బ్రిటన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటిదాకా అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేసిన స్నోడెన్ ఇప్పుడు బ్రిటన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. సంచలన రహస్యాలను బయట పెట్టి సంచలనం అయిన ఎడ్వర్డ్ స్నోడెన్ బ్రిటన్ గూఢచార వర్గాలు తలుచుకుంటే ఏమైనా చేయగలరంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలతో బయటకొచ్చారు. దీంతో ఒక్కసారిగా బ్రిటన్ షాక్ కు గురి అయింది. మరి ముందు ముందు ఇంకేమి రహస్యాలు బయటపెడతాడోనంటూ కలవరపడుతోంది. ఇంతకీ స్నోడెన్ బయటపెట్టిన రహస్యం ఏంటీ..మిగితా కధనం స్లైడర్ లో చదవండి.

Read more:నాడు అమెరికా.. నేడు ట్విట్టర్.. వణుకుపుట్టిస్తున్న స్నోడెన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆడియోలు రికార్డు

ఆడియోలు రికార్డు

బ్రిటన్ గూఢచార వర్గాలు తలుచుకుంటే ప్రపంచంలోని ఏ స్మార్ట్ ఫోన్ లోకి అయినా ప్రవేశించి ఆడియోలు రికార్డు చేయగలవు

యజమానులకు తెలియకుండానే ఫోటోలు

యజమానులకు తెలియకుండానే ఫోటోలు

యజమానులకు తెలియకుండానే ఫోటోలు తీసుకుని వాటిని తమ వద్దకు రప్పించుకోగలరని ప్రజావేగు ఎడ్వర్డ్ స్నోడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్ముర్ఫ్ సూట్ అనే టూల్

స్ముర్ఫ్ సూట్ అనే టూల్

ఇందుకోసం స్ముర్ఫ్ సూట్ అనే టూల్ ను నిఘావర్గాలు వాడుతున్నాయని దీని సహాయంతో వారు అత్యంత సులువుగా తమకు కావాల్సిన ఫోన్ లోకి ఒక్క మెసేజ్ ని పంపి చొచ్చుకెళ్తున్నారని ఆరోపించారు.

రష్యాలో తలదాచుకున్న సంగతి తెలిసిందే.

రష్యాలో తలదాచుకున్న సంగతి తెలిసిందే.

కాగా అమెరికా ప్రభుత్వం స్నోడెన్ పై గూఢచర్య ఆరోపణలతో కేసులు పెట్టిన తరువాత ఆయన వివిధ దేశాలు తిరుగుతూ ప్రస్తుతం రష్యాలో తలదాచుకున్న సంగతి తెలిసిందే.

జీసీహెచ్ క్యూ ఏజెన్సీ విజయం

జీసీహెచ్ క్యూ ఏజెన్సీ విజయం

మీ ఫోన్లకు యజమానులు మీ బదులు వారు ఉండాలనుకుంటున్నారు అని బిబిసి పనోరమా కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు.ఈ దిశగా బ్రిటన్ జీసీహెచ్ క్యూ ఏజెన్సీ విజయం సాధించిందని తెలిపారు.

స్ముర్మ్ అంటే నీలి రంగులో ఉండే ఓ కార్టూన్ క్యారెక్టర్

స్ముర్మ్ అంటే నీలి రంగులో ఉండే ఓ కార్టూన్ క్యారెక్టర్

స్ముర్మ్ అంటే నీలి రంగులో ఉండే ఓ కార్టూన్ క్యారెక్టర్ లో పలు రకాలున్నాయని ట్రాకర్ స్ముర్ప్.. నోసీ స్ముర్ఫ్ ...డ్రీమి స్ముర్ఫ్ వంటి వాటితో ఎక్కడున్నారన్న విషయం తెలియడంతో పాటు ఫోన్ ను దానంతట అదే ఆన్ ఆఫ్ అయ్యేలా చేయవచ్చని వివరించారు.

యజమానికి తెలియకుండానే..

యజమానికి తెలియకుండానే..

ఈ సంగతులేవి ఫోన్ యజమానికి తెలియకుండానే జరిగిపోతాయని తెలిపారు.ఇంకా అనేక ఇంటిలెజెన్స్ సంస్థలతో బ్రిటీష్ గవర్నమెంట్ కనెక్ట్ అయి క్రైమ్ ఇన్విస్టిగేట్ కు పాల్పడుతోందని ప్రజావేగు స్నోడెన్ బాంబు పేల్చారు.

కెన్ యూ హియర్ మి

కెన్ యూ హియర్ మి

అమెరికాకు నిద్రలేని రాత్రులను మిగిల్చిన విజిల్ బ్లోయెర్ ఎడ్వర్డ్ స్నోడెన్ ఈ మధ్యనే సామాజిక మాధ్యమం ట్విట్టర్ లోకి ప్రవేశించారు. ట్విట్టర్ ను సైతం వణికిస్తున్నారు. కెన్ యూ హియర్ మి అంటూ తొలి ట్వీట్ ను పెట్టగా 45 నిమిషాల్లో ఆయనను పాలో అయిన వారి సంఖ్య లక్షను దాటింది.ఒక్క రోజులో ఆయన వెనుక నడుస్తామని వచ్చిన వారి సంఖ్య 7.79 లక్షలకు చేరింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Smartphones Can be Hacked With Just 1 Text, Says Edward Snowden
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting