రానున్న కాలంలో మనుషుల్నిఆడించేది కంప్యూటర్లే

|

దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించలేదు. విశ్వమంతా సైన్స్ మీద ఆధారపడిందని ప్రపంచానికి తెలిపిన ప్రఖ్యాత భౌతిక శాస్ర్తవేత్త స్టీఫెన్ హాకింగ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. రానున్న కాలంలో కంప్యూటర్లే మనుషులను ఓవర్ టేక్ చేస్తాయని మనుషులకన్నా అవే ఎక్కువగా కనపడతాయని ఆచన చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలు అవుతున్నాయి. రానున్న యుగమంతా కంప్యూటర్ల యుగమేనని వచ్చే 100 సంవత్సరాల్లో అవే మనుషులను శాసిస్తాయని చెప్పిన స్టీఫెన్ హాకింగ్ పరిశోధనలు ఈ సైన్స్ రంగానికి దిశా నిర్దేశాన్ని చేశాయి.ఆయన చెప్పిన మాటలను ఓ సారి నెమరువేసుకుందాం.

 

Read more: ఫేస్‌బుక్ ఇప్పటికిప్పుడు మాయమైపోతే: స్టీఫెన్ హాకింగ్

స్పానిష్ న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్యూలో

స్పానిష్ న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్యూలో

స్పానిష్ న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన పలు ఆసక్తికర అంశాలకు సమాధానమిచ్చారు. శాస్ర్తవేత్తలు దేవున్నినమ్ముతారు కదా అని అడిగిన ప్రశ్నకు స్టీఫెన్ అయితే దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు. సైన్సను మధించిన వారంతా దేవుళ్లే..ఐన్ స్టీన్ కూడా దేవుడి లాంటివాడేనని..ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని కితాబిచ్చారు.

రానున్న 100 సంవత్సరాల్లో మనుషులను మిషన్లే కంట్రోల్ చేస్తాయని

రానున్న 100 సంవత్సరాల్లో మనుషులను మిషన్లే కంట్రోల్ చేస్తాయని

రానున్న 100 సంవత్సరాల్లో మనుషులను మిషన్లే కంట్రోల్ చేస్తాయని అవి చెప్పినట్టే మనుషులు నడుచుకోవాల్సి ఉంటుందని ష్టీఫెన్ ఇంటర్యూలో స్పష్టం చేశారు. కంప్యూటర్స్ తమ గోల్స్ సాధించేందుకు కొన్ని ఏ 1 పాంయిట్లతో కంప్యూటర్లు మానవులను అధిగమిస్తాయని చెప్పారు.

రానున్న కాలంలో మా యుద్దమంతా టెక్నాలజీ మీదనేనని
 

రానున్న కాలంలో మా యుద్దమంతా టెక్నాలజీ మీదనేనని

రానున్న కాలంలో యుద్దమంతా టెక్నాలజీ మీదనేనని వాటిని అధిగమించేందుకు మేము శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని, మిషన్లు కంట్రోల్ చేసేవిధంగా మానవుల శక్తి సామర్థ్యాలను పెంచుతామని స్టీఫెన్ అన్నారు. టెక్నాలజీ ఇప్పటికే మనిషి జీవితంలో భాగంగా మారిందని అవి లేకుండా ఇప్పుడు జీవించలేని పరిస్థితి ఉందని చెప్పారు. అయితే ఆయనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

గూగుల్ సెల్పీ డ్రైవింగ్ కార్లను

గూగుల్ సెల్పీ డ్రైవింగ్ కార్లను

ఇందుకు ఉదాహరణగా ఐపోన్ ఐప్యాడ్ లను ప్రస్తావించారు అలాగే గూగుల్ సెల్పీ డ్రైవింగ్ కార్లను కూడా ప్రస్తావించారు. మనుషులన్ని అవే కంట్రోల్ చేస్తాయని చెప్పారు. అలాగే ఫేస్ బుక్ ని సైతం ఇందులో కలిపారు. ఎప్ టి ప్రకారం 150 స్టార్టప్ లు సిలికాన్ వ్యాలీలో ఏ1 మీద పనిచేస్తున్నాయని స్టీఫెన్ తెలిపారు.

రానున్న కాలంలో శాస్ర్తవేత్తలు అలాగే టెక్నాలజిస్టులు కలిసి

రానున్న కాలంలో శాస్ర్తవేత్తలు అలాగే టెక్నాలజిస్టులు కలిసి

రానున్న కాలంలో శాస్ర్తవేత్తలు అలాగే టెక్నాలజిస్టులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వారు చాలా జాగ్రత్తగా ఏ1 కోసం పనిచేయాల్సి ఉంటుందని మనుషుల్ని కంట్రోల్ చేసే విధంగా వాటిని తయారుచేయకుండా మనుషులే వాటిని కంట్రోల్ చేసేలా తగిన వ్యూహాలను రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

గురుత్వాకర్షక శక్తి అన్నది సమస్త సృష్టికి మూలం

గురుత్వాకర్షక శక్తి అన్నది సమస్త సృష్టికి మూలం

అంతే కాకుండా ఈ విశ్వాన్ని భగవంతుడు సృష్టించలేదు. భౌతిక శాస్త్రం ప్రకారం గురుత్వాకర్షక శక్తి అన్నది సమస్త సృష్టికి మూలం, ఈ విశ్వం దాని మీదే ఆధారపడి ఉంది"అని ఈ ప్రఖ్యాత బ్రిటిష్‌ భౌతిక శాస్తవ్రేత్త తాను రాసిన ది గ్రాండ్ డిజైన్ అనే పుస్తకంలో పేర్కొన్నారు.

ఈ ప్రపంచంలో మనకు తెలియని జీవులు కూడా ఉన్నాయని

ఈ ప్రపంచంలో మనకు తెలియని జీవులు కూడా ఉన్నాయని

వీటితో పాటు ఇంకా పలు విషయాలను ప్రస్తావించారు. ఈ ప్రపంచంలో మనకు తెలియని జీవులు కూడా ఉన్నాయని అవి గ్రహాంతర వాసులు కావచ్చని వాటి మీద పరిశోధనలు జరుగుతన్నాయని ఏదో ఓ రోజు వాటి గురించి బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం ఉందని స్టీఫెన్ తెలిపారు.

మరో పుస్తకం స్టార్ మస్ లో ముందు మాటగా

మరో పుస్తకం స్టార్ మస్ లో ముందు మాటగా

మరో పుస్తకం స్టార్ మస్ లో ముందు మాటగా దేవుని కణానికి ఈ ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉందని హెచ్చరించారు.హిగ్ స్ సంభావ్య 100గిగా ఎలక్ట్రోన్స్ ఓల్టేజి అవుతుండటం వల్ల మనం చింతించే విషయాలు జరుగుతాయని ఈ వినాశనం రాబోయో రోజుల్లో సంభవిస్తుందని తెలిపారు. అయితే అధిక శక్తి వద్ద హిగ్స్ స్ విస్మరించబడతాయని ఇది చాలా గొప్ప విషయమని స్టీపెన్ అన్నారు. హిగ్ స్ బోసన్ ని 2012లో కనుగొన్న విషయం విదితమే.

బ్లాక్‌ హోల్‌ మిమ్మల్ని మరో విశ్వంలోకి తీసుకెళ్లగలదని

బ్లాక్‌ హోల్‌ మిమ్మల్ని మరో విశ్వంలోకి తీసుకెళ్లగలదని

బ్లాక్ హోల్ గురించి కూడా చెప్పారు. ఊహించని రీతిలో మీరు బ్లాక్‌ హోల్‌లో చిక్కుకున్నారా? ఆందోళన చెందకండి. ఆ బ్లాక్‌ హోల్‌ మిమ్మల్ని మరో విశ్వంలోకి తీసుకెళ్లగలదని మరో సంధర్భంలో అన్నారు. బ్లాక్‌ హోల్స్‌ ఆవల ప్రత్యామ్నాయంగా మరో పెద్ద విశ్వం దాగి వుందంటున్నారాయన.

భయంకరమైన మోతార్ న్యూరాన్ వ్యాధికి గురయినా

భయంకరమైన మోతార్ న్యూరాన్ వ్యాధికి గురయినా

భయంకరమైన మోతార్ న్యూరాన్ వ్యాధికి గురయినా ధైర్యంగా వీల్ కుర్చీకే పరిమితమై ఉన్నారు . అయితే ఆయన కూడా ఒక దశలో నిర్వేదానికి గురయ్యారు. తాను భరించలేని బాధకు గురైన పక్షంలో, ముఖ్యంగా తనను ప్రేమంచే వారికి తాను భారమైతే ఇతరుల సహకారంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమేనని ప్రకటించి సంచలనం రేపారు.

గత 16 ఏళ్ల కాలంలో 273 మంది బ్రిటన్లు

గత 16 ఏళ్ల కాలంలో 273 మంది బ్రిటన్లు

ఇలా పట్టి పీడిస్తున్న ఈ వ్యాధి నుంచి కోలుకునే అవకాశం లేక, బాధను భరించలేని వారికి అత్మహత్యలో సహకరించేందుకు స్విడ్జర్లాండ్‌లో ‘డిగ్నిటాస్ సూసైడ్ క్లినిక్' ఉంది. అక్కడికెళ్లి గత 16 ఏళ్ల కాలంలో 273 మంది బ్రిటన్లు ఆత్మహత్య చేసుకోగా, 920 మంది జర్మన్లు, 194 మంది ఫ్రాన్స్ దేశస్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

కృష్ణ బిలాల రేడియేషన్ సిద్ధాంత కర్తగా

కృష్ణ బిలాల రేడియేషన్ సిద్ధాంత కర్తగా

హాకింగ్స్ రేడియేషన్` గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ సిద్ధాంత కర్తగా స్టీఫెన్ హాకింగ్ ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించారు. 1970 నుంచి ఆయన కృష్ణ బిలాలపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. జనరల్ రిలేటివిటి, క్వాంటమ్ థియరీ ఆధారంగా కృష్ణ బిలాలు కూడా `ధార్మిక శక్తి`ని కలిగి ఉంటాయని తన పరిశోధనల ద్వారా తెలియచెప్పారు. కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి.

శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం

శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం

శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం. కాలం కథ'తో పాఠకులను విశ్వవిహారం చేయించిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. విధి ఆడిన వింతనాటకంలో ఆ విధికే సమాధానం చెప్పిన హీరో..అందరికీ ఆదర్శం.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here write Stephen Hawking warns computers will overtake humans within 100 years

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X