BSNL ట్రిపుల్-ప్లే సర్వీస్ కోసం Yupp టీవీతో ఒప్పందం

|

ఇండియా టెలికామ్ రంగంలో తిరుగులేని రారాజుగా ఎదిగిన బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థకు గత ఏడాది గడ్డుకాలం గడిచింది. అయినప్పటికి త్వరగా కోలుకొని మళ్ళీ తన హవా కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా వీడియో మరియు బ్రాడ్‌బ్యాండ్ సేవలకు ట్రిపుల్ ప్లే భాగస్వామ్యాన్ని అందించడానికి రాష్ట్ర నేతృత్వంలోని టెలికం ఆపరేటర్ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) దక్షిణాసియా OTT కంటెంట్ ప్రొవైడర్ Yupp (యుప్) టివితో భాగస్వామ్యాం కుదుర్చుకుంది.

బ్రాడ్‌బ్యాండ్
 

బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి జియో ఫైబర్ అనే పేరుతో రిలయన్స్ జియో ప్రవేశించడంతో బ్రాడ్‌బ్యాండ్ పరిశ్రమ చాలా పోటీగా మారింది. దేశంలోని ఇతర బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు తమ వినియోగదారులను కాపాడుకోవటానికి తమ కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తున్నారు. వినియోగదారులకు కొత్త కొత్త ఆఫర్‌లను మరియు కొన్ని రకాల OTT యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నారు.

బ్రాడ్‌బ్యాండ్

ఇండియాలో అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ గా వున్న బిఎస్‌ఎన్‌ఎల్ కూడా ఇప్పుడు ఇదే పంథాను అనుసరిస్తున్నది. టెలికాం ఆపరేటర్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ యొక్క సొంత ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ అయిన భారత్ ఫైబర్ సర్వీస్ ను అందించడానికి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఫైబర్ నెట్‌వర్క్ నుండి కస్టమర్లను కాపాడుకోవడానికి మరియు కొత్త వారిని ఆకట్టుకోవడానికి ట్రిపుల్-ప్లే సేవలను అందించడం ప్రారంభించడం. యుప్ టివి భాగస్వామ్యంతో బిఎస్ఎన్ఎల్ దీన్ని అందించనున్నది.

ట్రిపుల్ ప్లే ప్లాన్‌

ట్రిపుల్ ప్లే ప్లాన్‌

బ్రాడ్‌బ్యాండ్ పరిశ్రమలో రిలయన్స్ జియో అందిస్తున్న ట్రిపుల్ ప్లే ప్లాన్‌ బాగా ప్రాచుర్యం పొందింది. ఇది వినియోగదారులకు దాని ప్రివ్యూ ఆఫర్‌లను అందించడం ప్రారంభించింది. టెలికాం ఆపరేటర్ మొదట తన ఉద్యోగుల కోసం ట్రిపుల్-ప్లే ప్లాన్‌ను ప్రవేశపెట్టి ఆపై ఈ ఆఫర్‌ను కస్టమర్లకు విస్తరించడం ప్రారంభించాడు. ట్రిపుల్ ప్లే సర్వీస్ దాని పేరుకు సూచించినట్లుగా వినియోగదారులు ఒక సర్వీస్ కు డబ్బులు చెల్లించి మూడు సర్వీస్ లను ఆస్వాదించగలుగుతారు. ఈ మూడు సర్వీస్ లలో సాధారణంగా కేబుల్ టివి, ల్యాండ్‌లైన్ మరియు బ్రాడ్‌బ్యాండ్ ఉంటాయి. హాత్వే మరియు డెన్ నెట్‌వర్క్‌ల సహాయంతో రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఇలాంటి సర్వీస్ లను అందిస్తున్నాయి.

Yupp టివి కంటెంట్‌ ఫీచర్
 

Yupp టివి కంటెంట్‌ ఫీచర్

రాష్ట్ర నేతృత్వంలోని టెలికాం ఆపరేటర్ బిఎస్‌ఎన్‌ఎల్ కూడా అదేవిధంగా Yupp టివి సహాయంతో ఇటువంటి ఫీచర్లను అందిస్తున్నారు. Yupp టివి దాని వినూత్న ఫీచర్ లతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విస్తృత ప్రేక్షకులకు లైవ్ మరియు VOD కంటెంట్ను ప్రసారం చేయడంలో పదేళ్ళకు పైగా నైపుణ్యం కలిగి ఉంది. యుప్ టీవీ యొక్క అంతర్గత ఎండ్-టు-ఎండ్ టెక్నాలజీ దృడమైనది, నమ్మదగినది మరియు కొలవదగినది.

Yupp టివి కంటెంట్‌ ఆఫర్

Yupp టివి కంటెంట్‌ ఆఫర్

Yupp టివి అందిస్తున్న వీడియో కంటెంట్ విషయానికి వస్తే ఇది 250 లైవ్ టివి ఛానెల్స్, సినిమాలు, టివి షోలు మరియు యుప్ టివి ఒరిజినల్స్ కలిగి ఉన్న కంటెంట్ లైబ్రరీని అందిస్తుంది. ఇది సౌత్ ఇండియా చలనచిత్రల నుండి ప్రఖ్యాత పేర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది. అలాగే సౌత్ లో నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లను ఇందులో విడుదల చేసి అతిపెద్ద విజయాలను చవిచూస్తున్న వాటిలో ఇది కూడా ఒకటి. వీటితో పాటు ఈ బ్రాండ్ 13 సదరన్ ఒరిజినల్ షోలను కూడా ప్రసారం చేస్తున్నది.

కనెక్టివిటీ

DEN నెట్‌వర్క్‌లు మరియు హాత్‌వే యొక్క కనెక్టివిటీ సహాయంతో రిలయన్స్ జియో తన ట్రిపుల్-ప్లే కార్యాచరణను విస్తరించడానికి కేబుల్ టివి నెట్‌వర్క్‌ల సహాయం తీసుకుంటున్నది. అలాగే బిఎస్‌ఎన్‌ఎల్ కూడా ఇప్పుడు Yupp యొక్క వనరుల సహాయంతో ట్రిపుల్-ప్లే సేవలను విస్తరించడానికి ఉపయోగిస్తుందని గమనించడం చాలా ముఖ్యం.

BSNL- Yupp టీవీ ఒప్పందం

BSNL- Yupp టీవీ ఒప్పందం

బిఎస్ఎన్ఎల్ CMD PK పూర్వర్ మీడియాతో మాట్లాడుతూ పదేళ్లుగా OTT యాప్ లో ఒక మార్గదర్శకుడిగా వున్న Yupp టివి మారుతున్న కాలంతో అనుగుణంగా త్వరగా అభివృద్ధి చెందింది. ఉన్నతమైన డిజిటల్ వీడియో సేవలను అందించడానికి తన సాంకేతిక పరిజ్ఞానాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ వచ్చింది. ప్రత్యక్ష ప్రసారం లేదా క్యాచ్-అప్ టీవీ లేదా ప్రత్యేకమైన ఒరిజినల్స్ వంటి కంటెంట్ లను Yupp టివి ప్రసారం చేస్తున్నది. భారతదేశంలో వినియోగదారుల కోసం అద్భుతమైన మరియు విలువైన వీడియో ప్రసారాలను అందించడానికి యుప్ టివితో భాగస్వామ్యం చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది అని ఆయన తెలిపారు.

Yupp టివి వ్యవస్థాపకుడు

Yupp టివి వ్యవస్థాపకుడు & CEO ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. బిఎస్‌ఎన్‌ఎల్‌తో భాగస్వామ్యం తరువాత యుప్ టివి సరళమైన ఇంకా సమర్థవంతమైన మరియు వినూత్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అత్యాధునిక వినోద పరిష్కారాన్ని అందించడానికి కృషి చేస్తుందని ఆయన అన్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL Agreement with Yupp TV for Providing Triple-Play Service

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X