రోజుకు 2GB డేటాతో జియో ఆల్ ఇన్ వన్ డేటా ప్లాన్‌లు

|

రిలయన్స్ జియో ఇప్పుడు తన డేటా ప్లాన్‌ల ద్వారా మరిన్ని ఎక్కువ డేటా ప్రయోజనాలు, ఫ్రీ జియో-టు-జియో కాలింగ్ మరియు ఇతర నెట్‌వర్క్‌లలో ఉచిత (పరిమిత) కాలింగ్‌తో అందించడానికి కొత్త ప్లాన్‌లను సవరించింది. సవరించిన జియో ప్లాన్‌ల ప్రకారం వినియోగదారులు ఇప్పుడు రోజుకు 2 GB డేటాను పొందవచ్చు. అలాగే నాన్ జియో నెట్‌వర్క్ కొరకు 1,000 నిమిషాల కాలింగ్‌ను నెలకు రూ .222 లకు పొందవచ్చు. ఈ ప్లాన్ ఎయిర్టెల్, వోడాఫోన్ లతో ఎలా పోటీపడుతున్నదో చూడడానికి ముందుకు చదవండి.

జియో ఆల్ ఇన్ వన్ డేటా ప్లాన్‌

జియో ఆల్ ఇన్ వన్ డేటా ప్లాన్‌

ఇంతకు ముందు రిలయన్స్ జియో కొత్తగా ‘ఆల్ ఇన్ వన్' డేటా ప్లాన్‌లను విడుదల చేసింది. బేస్ ప్లాన్ ఒక నెల వాలిడిటీతో రూ.222 కు లభిస్తుండగా అలాగే 2, 3 నెలల వాలిడిటీతో రూ.333, రూ.444 ప్లాన్‌లను కూడా విడుదల చేసింది. దీర్ఘకాలిక ప్రణాళికలు రెండూ రోజుకు 2GB డేటా మరియు 1,000 నిమిషాల నాన్ జియో నెట్‌వర్క్ కాలింగ్‌ను అందిస్తాయి.

ఆల్ ఇన్ వన్

ఆల్ ఇన్ వన్ ప్రణాళికలు నెలకు రూ.222 నుండి ప్రారంభమవుతాయి. ఇందులో 2 జిబి రోజువారీ 4G డేటా, భారతదేశం అంతటా ఇతర జియో నంబర్లకు అపరిమిత కాల్స్, అలాగే ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లకు 1000 నిమిషాల వాయిస్ కాల్స్ మరియు అపరిమిత ఎస్‌ఎంఎస్‌లు ఉన్నాయి. జియో బేస్ ప్లాన్‌కు మరో రూ.111 అదనంగా చెల్లించి 1 నెలల అదనపు సేవలను పొందవచ్చు. దీని అర్థం ప్రాథమికంగా జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్‌కు 2 నెలలకు 333 రూపాయలు, మూడు నెలలకు 444 రూపాయలు ఖర్చవుతుంది. అంటే Jio యూజర్ మొదటి నెలకు 222 రూపాయలు మరియు తరువాతి నెలలకు 111 రూపాయలు చెల్లించాలి.

రూ.444 ప్లాన్‌

జియో యొక్క రోజుకు 2GB డేటా ప్లాన్‌లో ఇప్పటికే మీరు ఉంటే కనుక మూడు నెలల్లోపు దాని ధర రూ.448 కు పొందవచ్చు. బదులుగా ఆల్ ఇన్ వన్ ప్లాన్‌కు మారడం వల్ల మూడు నెలల వ్యవధిలో బిల్లును 444 రూపాయలకు తీసుకువస్తుంది. ఇందులో భాగంగా ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లకు 1000 నిమిషాల కాల్‌లను అందిస్తాయి.. రెండు నెలల వ్యవధిలో ఇదే పోలికను పరిశీలిస్తే ఆల్ ఇన్ వన్ ప్లాన్ ధర మునుపటి రూ.396 ప్లాన్‌తో పోలిస్తే ఇప్పుడు మీరు దీనిని రూ.333లకు పొందవచ్చు.

రిలయన్స్ జియో

రిలయన్స్ జియో యొక్క సవరించిన ప్రణాళికలు దాని చందాదారుల కోసం ఉచిత వాయిస్ కాలింగ్‌ను ముగించినట్లు ప్రకటించిన కొద్దిసేపటికే పైన పేర్కొన్న ప్లాన్ అమలులోకి వచ్చాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి ప్రత్యర్థి నెట్‌వర్క్‌లకు చేసిన కాల్‌లపై ఇప్పుడు తమ చందాదారులకు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని కంపెనీ తెలిపింది. ఈ చర్యకు ఇంటర్నెట్‌కనెక్ట్ వినియోగ ఛార్జీలు (ఐయుసి) రిలయన్స్ జియో కారణమైంది.

 

Rs.699 లకే జియో ఫోన్: దీపావళి ఆఫర్Rs.699 లకే జియో ఫోన్: దీపావళి ఆఫర్

ఎయిర్టెల్  ప్రీ-పెయిడ్ ప్లాన్

ఎయిర్టెల్ ప్రీ-పెయిడ్ ప్లాన్

రోజుకు 2GB డేటాను అందిస్తున్న ఎయిర్టెల్ యొక్క రూ .249 ప్రీ-పెయిడ్ ప్లాన్ అపరిమిత కాలింగ్‌ సదుపాయంతో వస్తుంది. ఎయిర్టెల్ రిలయన్స్ జియో మాదిరిగానే రోజుకు 100 ఎస్ఎంఎస్ లను మొత్తం 28 రోజుల చెల్లుబాటుకు అందిస్తుంది. ఎయిర్టెల్, నార్టన్ మొబైల్ సెక్యూరిటీ, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం యాక్సెస్ మరియు వింక్ మ్యూజిక్‌లను కూడా ఒక సంవత్సరం పాటు అందిస్తుంది.

వోడాఫోన్  ప్రీ-పెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ప్రీ-పెయిడ్ ప్లాన్

వోడాఫోన్ ఇటీవల రోజుకు 2GB డేటాతో కొత్త రూ.229 ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ ప్రకారం వొడాఫోన్ చందాదారులు అపరిమిత లోకల్, ఎస్టీడీ మరియు రోమింగ్ కాలింగ్ తో పాటు రోజుకు 100SMSలను ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు కాలం 28 రోజులు. వొడాఫోన్ కూడా తక్కువ ధరతో కూడిన 199 ప్లాన్‌ను కలిగి ఉంది. అయితే 1.5GB రోజువారీ డేటా పరిమితిని కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Reliance Jio Vs Vodafone Vs Airtel: All-In-One Data Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X