ఉచిత కాల్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లతో దిగ్గజాలకే షాక్ పుట్టిస్తోంది
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు కసరత్తు చేస్తోంది. దూసుకొచ్చిన ప్రైవేట్ టెలికం సంస్థల ధాటికి ఈ మధ్య పోటీలో వెనుకబడి మూసేయాల్సిన పరిస్థితులను ఎదుర్కున్న బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు కొత్త ఆఫర్లతో టెలికం సంస్థలకు పాక్ పుట్టిస్తోంది. రూ. 470కే అన్ లిమిటెడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలతో పాటు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.
బడ్జెట్ ధరకే 13 ఎంపీ కెమెరా ఫోన్

ఉచిత కాల్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లతో దిగ్గజాలకే షాక్ పుట్టిస్తోంది
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఆఫర్ ప్రకారం రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఏడు వరకూ అన్ని బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్, సెల్‌ఫోన్లకు ఉచితంగా కాల్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఉచిత కాల్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లతో దిగ్గజాలకే షాక్ పుట్టిస్తోంది
మినిమం చార్జితోనే ఈ ఉచిత కాల్స్‌ను చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. దీంతో వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ ఉచిత కాల్స్ తో మళ్లీ ల్యాండ్‌లైన్ కనెక్షన్లకు క్రేజ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత నెలలోనే బీఎస్‌ఎన్‌ఎల్ దాదాపు తొమ్మిదివేల కొత్త కనెక్షన్లను ఇచ్చినట్లు తెలిపింది.

ఉచిత కాల్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లతో దిగ్గజాలకే షాక్ పుట్టిస్తోంది
ఇక ఇంటర్నెట్ వినియోగదారుల కోసం బ్రాడ్‌బ్యాండ్ సేవల డేటా డౌన్‌లోడ్ వేగాన్ని (ఎఫ్‌యూపీ పరిమితి తర్వాత) ఈ నెల 1 నుంచి 1 ఎంబీపీఎస్‌కు పెంచినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. గతంలో ఇది 512 కేబీపీఎస్‌గానే ఉండేదని పేర్కొంది.

ఉచిత కాల్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లతో దిగ్గజాలకే షాక్ పుట్టిస్తోంది
ప్రస్తుత, కొత్త వినియోగదారులందరికీ తాజా మార్పు వర్తిస్తుందని...ఇందుకోసం ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయబోమని ఓ ప్రకటనలో వివరించింది.

ఉచిత కాల్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లతో దిగ్గజాలకే షాక్ పుట్టిస్తోంది
అలాగే హైదరాబాద్ టెలికం జిల్లా బీబీజీ కాంబో 470 ప్లాన్‌ను ప్రవేశపెట్టినట్లు వివరించింది. ఈ ప్లాన్ కింద రూ. 470 రెంటల్ చార్జీతో 1 ఎంబీపీఎస్ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ వేగాన్ని అందించడంతోపాటు రెంట్‌ఫ్రీ ల్యాండ్‌లైన్‌ను అందిస్తున్నామని తెలిపింది.

ఉచిత కాల్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లతో దిగ్గజాలకే షాక్ పుట్టిస్తోంది
క్యాష్ బ్యాక్ ఆఫర్‌తో బ్రాడ్ బ్యాండ్, వైఫై కలిగిన రెండు మోడెంలను రూ.1500లకే అందిస్తున్నామని బీఎస్‌ఎన్‌ఎల్ పీజీఎం రవిబాబు అన్నారు. ఈ ఆఫర్ ద్వారా నెలకు వంద రూపాయల చొప్పున వారికి మేమే 15 నెలలు తిరిగి చెల్లిస్తామన్నారు.

ఉచిత కాల్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లతో దిగ్గజాలకే షాక్ పుట్టిస్తోంది
మరి ప్రస్తుతానికి అయితే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల దెబ్బకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పరిస్థితి అంత బాగోలేదు. ఇలాంటి ఆఫర్లు అయిన ఈ ప్రభుత్వ రంగ సంస్థను బతికిస్తే మంచిదే!

Click it and Unblock the Notifications