BSNL బంపరాఫర్.. రూ.347, రూ.599 ప్లాన్స్‌తో ఏకంగా అన్ని రోజులు అపరిమిత కాల్స్, ఇంటర్నెట్ డేటా..
BSNL Budget Friendly Plans: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఇప్పుడు దేశమంతా తన 4G సేవలను విస్తరించే పనిలో ఉంది. ఇప్పటికే 83,629 4G టవర్లను దేశమంతటా ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది జూన్ నాటికి లక్ష టవర్లు అందుబాటులోకి తేవాలనేది వాళ్ల లక్ష్యం. అంటే త్వరలోనే దేశం మొత్తమ్మీద BSNL 4G సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. అంతేకాదు, ఈ సంవత్సరం చివరకు 5G సేవలు మొదలు పెట్టడానికి BSNL సిద్ధమవుతోంది.
ఈ కొత్త టెక్నాలజీతో పాటు, తక్కువ ధరలో ఎక్కువ రోజులు పనిచేసే ప్లాన్లను కూడా BSNL మన ముందుకు తెస్తోంది. అవేంటో చూద్దాం. BSNL ఇప్పుడు రెండు చవకైన ప్లాన్లను అందిస్తోంది. మొదటిది కేవలం రూ.347 ప్లాన్. ఈ ప్లాన్‌లో రోజుకి 2GB డేటా చొప్పున మొత్తం 54 రోజుల పాటు ఇస్తారు.

* డేటా అన్ని అవసరాలకు సరిపోతుంది..
అంటే మీరు మొత్తం 108GB డేటాని వాడుకోవచచు. రోజుకి 2GB అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్ కొంచెం తగ్గుతుంది, కానీ 40kbps వేగంతో వాట్సాప్ వంటివి వాడుకోవచ్చు. దీనితో పాటు, ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు, అది లోకల్ అయినా, STD అయినా, రోమింగ్ లో ఉన్నా సరే. రోజుకి 100 SMSలు కూడా ఉచితం.
ఇంతకుముందు ఈ ప్లాన్‌లో కొన్ని అదనపు లాభాలు ఉండేవి, కానీ ఇప్పుడు అవి తీసేశారు. అయినా సరే, తక్కువ ధరలో డేటా, కాలింగ్ రెండూ కావాలనుకునే వాళ్లకి ఈ ప్లాన్ ఒక గొప్ప ఎంపిక. రెండు నెలలపాటు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది కూడా కేవలం రూ.349కే కావడం విశేషం.
* రూ.599 ప్లాన్..
ఇంకాస్త ఎక్కువ డేటా కావాలనుకునే వాళ్ల కోసం BSNL రూ.599 ప్లాన్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో రోజుకి 3GB డేటా ఇస్తారు, అది కూడా ఏకంగా 84 రోజుల పాటు. అంటే మొత్తం 252GB డేటా అన్నమాట. ఇందులో కూడా రోజుకి 3GB అయిపోతే వేగం 40kbpsకి తగ్గుతుంది.
రూ.347 ప్లాన్ లాగే ఇందులో కూడా ఉచిత కాలింగ్ ఉంది. లోకల్, STD, రోమింగ్ కాల్స్ అన్నీ ఫ్రీ. రోజుకి 100 SMSలు కూడా ఇస్తారు. ఈ ప్లాన్‌లో కూడా అదనపు లాభాలు ఏమీ లేవు, కానీ ఎక్కువ డేటా, ఎక్కువ రోజులు వాలిడిటీ కావాలనుకునే వాళ్లకు ఇది ఉత్తమ ప్లాన్.
* మరిన్ని కొత్త ప్లాన్లు..
BSNL ఇంకా చాలా కొత్త ప్లాన్లను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఒక్కొక్కరి అవసరానికి తగ్గట్టుగా ప్లాన్లను సిద్ధం చేస్తోంది. 4G నెట్‌వర్క్ విస్తరణ, 5G సేవలు రాబోతుండటంతో BSNL ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ రోజులు వాలిడిటీ, ఉచిత కాలింగ్ లాంటి ఆఫర్లతో BSNL ఇప్పుడు డబ్బులు ఆదా చేసుకోవాలనుకునే వాళ్లకి మంచి ఆప్షన్‌గా మారింది.
మీరు కూడా ఒకసారి BSNL ప్లాన్స్ గురించి ఆలోచించండి. మీ ప్రాంతంలో ఈ నెట్వర్క్ సిగ్నల్స్ బాగా ఉంటే, ఈ టెలికాం ఆపరేటర్ సిమ్ కార్డు తీసుకోవడం మంచిది. దీనివల్ల మీరు చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








