ఉచిత OTT సబ్స్క్రిప్షన్ యాడ్-ఆన్ ప్యాక్‌లతో ప్రైవేట్ టెల్కోలకు సవాల్ విసిరిన BSNL

|

ఇండియాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే బిఎస్ఎన్ఎల్ సంస్థ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా మంచి విజయం సాధిస్తోంది. బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల కొనుగోలుపై ఇప్పుడు వినియోగదారులకు ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలను అందించడం ప్రారంభించింది. చాలా సంవత్సరాలుగా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్నప్పటికి ఎయిర్టెల్ మరియు జియో యొక్క ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో అందించే OTT ప్రయోజనాల కారణంగా బిఎస్ఎన్ఎల్ యొక్క ఇంటర్నెట్ వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది.

భారత్ ఫైబర్ యాడ్-ఆన్ ప్యాక్‌
 

భారత్ ఫైబర్ యాడ్-ఆన్ ప్యాక్‌

బ్రాడ్‌బ్యాండ్ సేవల డిమాండ్ ను పెంచుకోవడానికి బిఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ సమర్పణలను ప్రారంభించింది. అయితే BSNL ఫైబర్ సమర్పణలలో గల ఏకైక లోపం OTT ప్రయోజనాలు లేకపోవడం. అయితే ఇప్పుడు తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో పాటు సరసమైన ధరలో లభించే యాడ్-ఆన్ ప్యాక్‌లలో వివిధ OTT ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL OTT యాడ్-ఆన్ ప్యాక్ వివరాలు

BSNL OTT యాడ్-ఆన్ ప్యాక్ వివరాలు

బిఎస్ఎన్ఎల్ సంస్థ ఇప్పుడు రెండు వేర్వేరు ధరల వద్ద ఒకే ఒక OTT యాడ్-ఆన్ ప్యాక్‌ను అందిస్తోంది. మొదటి మూడు నెలలు ఈ ప్యాక్ ను వినియోగదారులు నెలకు రూ.129 ధర వద్ద పొందుతారు. మొదటి మూడు నెలల తరువాత ఈ ప్లాన్ యొక్క ధర నెలకు రూ.199 కు పెరుగుతుంది. ఈ యాడ్-ఆన్ ప్యాక్ వినియోగదారులకు వూట్ సెలెక్ట్, సోనీలైవ్ స్పెషల్, Zee5 ప్రీమియం, YuppTV టివి లైవ్, YuppTV FDFS, YuppTV మూవీస్, సపోర్ట్ మరియు మార్కెటింగ్ కంటెంట్ వంటి OTT యాప్ లు ఉన్నాయి. పైన పేర్కొన్న ఛార్జీలలో సేవల పన్ను (GST) ఉండదని గమనించండి.

BSNL OTT యాడ్-ఆన్ ప్యాక్‌ లభ్యత

BSNL OTT యాడ్-ఆన్ ప్యాక్‌ లభ్యత

BSNL సంస్థ ఈ బ్రాడ్‌బ్యాండ్ OTT యాడ్-ఆన్ ప్యాక్‌ను ప్రతి సర్కిల్‌లో అందించనుంది. ఈ యాడ్-ఆన్ ప్యాక్ జనవరి 18, 2021 నుండి అమల్లోకి రానుంది. బిఎస్ఎన్ఎల్ యొక్క భారత్ ఫైబర్ కస్టమర్లు మరియు సాధారణ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు జనవరి 18 నుండి ఈ OTT యాడ్-ఆన్ ప్యాక్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌ల ప్రీమియం లైబ్రరీ నుండి కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులకు అందించే ప్రతి సబ్స్క్రిప్షన్ అనుమతించబడుతుందని గమనించాలి.

BSNL OTT యాడ్-ఆన్ ప్యాక్‌ vs ఎయిర్‌టెల్, జియో OTT యాడ్-ఆన్
 

BSNL OTT యాడ్-ఆన్ ప్యాక్‌ vs ఎయిర్‌టెల్, జియో OTT యాడ్-ఆన్

వినియోగదారులు తమకు లభించే OTT లైబ్రరీ యొక్క సేవలను పరిగణలోకి తీసుకుంటే కనుక యాడ్-ఆన్ ప్యాక్‌ యొక్క నెలవారీ ధర చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISP లు) తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతో ఉచితంగా OTT ప్రయోజనాలను కూడా అందిస్తారని మర్చిపోకూడదు. ఎయిర్‌టెల్ మరియు జియో రెండూ తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వినియోగదారులకు అనేక OTT ప్రయోజనాలను అందిస్తున్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL Challenges Private Telcos With Free OTT Subscription on Add-on Pack

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X