Home
News

70GB డేటాను అందిస్తున్న BSNL పోస్ట్‌పెయిడ్ డేటా ప్లాన్‌లు!! Vi, Airtelలకు అందనంత దూరం..

బిఎస్‌ఎన్‌ఎల్ టెల్కో ఇండియా మొత్తం ఇప్పుడు తన 4G సర్వీసులను అందించడానికి ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా పోస్ట్‌పెయిడ్ చందాదారులకు కొత్తగా రెండు స్వతంత్ర డేటా ప్లాన్‌లను అందించడం ప్రారంభించింది. గత నెలలో బిఎస్‌ఎన్‌ఎల్ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను సవరించడంతో పాటు రూ.150 ప్రారంభ ధర వద్ద డేటా ప్లాన్‌లను అందిస్తోంది. ప్రస్తుతం పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం బిఎస్‌ఎన్‌ఎల్ రెండు డేటా ప్లాన్‌లను రూ.150 మరియు రూ.250 ధరల వద్ద అందిస్తున్నాయి. ఇవి 70GB వరకు డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నారు.

BSNL vs ఎయిర్‌టెల్ vs Vi

BSNL vs ఎయిర్‌టెల్ vs Vi

భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా టెలికాం సంస్థలు తమ యొక్క పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు కూడా తక్కువ ధరలో డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే ఇవి కేవలం 50GB వరకు మాత్రమే డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.250 పోస్ట్‌పెయిడ్ మొబైల్ డేటా ప్లాన్ ప్రస్తుతం ఉన్న పోస్ట్‌పెయిడ్ ప్లాన్ డేటా బెనిఫిట్లలో అందరికంటే అధికంగా 70GB వరకు డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. మొబైల్ ఫోన్ కనెక్షన్‌ ద్వారా డేటాను అధికంగా వినియోగించే వినియోగదారులకు ఈ పోస్ట్‌పెయిడ్ డేటా ప్లాన్లు అధికంగా ఉపయోగకరంగా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL పోస్ట్‌పెయిడ్ మొబైల్ ఫోన్ డేటా ప్లాన్‌ల వివరాలు

BSNL పోస్ట్‌పెయిడ్ మొబైల్ ఫోన్ డేటా ప్లాన్‌ల వివరాలు

బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ తన యొక్క పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు మొబైల్ ఫోన్ డేటా ప్లాన్‌లను రూ.150 మరియు రూ.250 ధరల వద్ద అందిస్తున్నాయి. రూ.150 ప్లాన్ 40GB డేటాను అందిస్తుండగా రూ.250 ప్లాన్ 70GB డేటా బెనిఫిట్ తో వస్తుంది. ప్రస్తుతం పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వినియోగిస్తున్న వారు అధిక డేటా కోసం ఈ ప్లాన్‌లతో యాక్టివేట్ చేసుకోవచ్చు. బిఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ డేటా ప్లాన్‌లను భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా యొక్క డేటా ప్రయోజనాలతో పోలిస్తే అందనంత దూరంలో ఉంది.

ఎయిర్‌టెల్, Vi పోస్ట్‌పెయిడ్ డేటా ప్యాక్‌ల వివరాలు

ఎయిర్‌టెల్, Vi పోస్ట్‌పెయిడ్ డేటా ప్యాక్‌ల వివరాలు

Vi టెల్కో రూ.100 మరియు రూ.200 ధరల వద్ద అందించే పోస్ట్‌పెయిడ్ డేటా ప్యాక్‌లు వరుసగా 20GB మరియు 50GB డేటా ప్రయోజనంను అందిస్తున్నాయి. అదేవిధంగా ఎయిర్‌టెల్ రూ.100 ధర వద్ద లభించే పోస్ట్‌పెయిడ్ డేటా ప్యాక్ 15GB డేటాను అలాగే రూ.200 ధర వద్ద లభించే డేటా ప్యాక్‌ 35GB డేటా ప్రయోజనంను అందిస్తుంది. ప్రస్తుత రెగ్యులర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ పైన ఈ డేటా ప్లాన్‌లను రీఛార్జ్ చేయడానికి ఎయిర్‌టెల్ మరియు Vi కూడా తమ వినియోగదారులను అనుమతిస్తున్నాయి.

BSNL పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల వివరాలు

BSNL పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల వివరాలు

గత నెలలో జరిగిన సవరణల తరువాత బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు అన్ని సర్కిళ్ళలో ఆరు పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇవి రూ.199 నుండి ప్రారంభమై రూ.1,525 ధర వరకు అందిస్తున్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ అపరిమిత ఆన్-నెట్ వాయిస్ కాలింగ్, 300 నిమిషాల ఆఫ్-నెట్ కాలింగ్, నెలకు 25GB డేటా 75GB వరకు రోల్‌ఓవర్ మరియు నెలకు 100SMS ప్రయోజనాలను అందిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
BSNL Postpaid Data Plans Offering Upto 70GB Mobile Data
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X