Home
News

BSNL దీపావళి గిఫ్ట్ : 2 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తన బ్రాడ్‌బ్యాండ్ మరియు ల్యాండ్ లైన్ కస్టమర్లకు దీపావళి సందర్బంగా ఒక మంచి శుభవార్తను తెలిపింది. అది ఏమిటంటే ఈ ఇద్దరు కస్టమర్లు దీపావళి అక్టోబర్ 27 మరియు అక్టోబర్ 28 రెండు రోజులు అపరిమిత వాయిస్ కాల్స్ చేయవచ్చని ప్రకటించింది. దీపావళి సందర్భంగా బిఎస్‌ఎన్‌ఎల్ ఈ పరిమిత కాల ఆఫర్‌ను ప్రకటించింది.

బిఎస్‌ఎన్‌ఎల్‌

ఈ ఆఫర్‌లో భాగంగా బిఎస్‌ఎన్‌ఎల్‌కు అర్హత కలిగిన బ్రాడ్‌బ్యాండ్ మరియు ల్యాండ్‌లైన్ కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ల్యాండ్‌లైన్ మరియు మొబైల్ నంబర్‌కు అపరిమిత కాల్స్ చేయవచ్చు. ఈ ఆఫర్ కేవలం రెండు రోజులకు మాత్రమే పరిమితం చేయబడింది. కానీ పండుగ రోజుల్లో ఇది చాలా కీలకమైనది. BSNL యొక్క చాలా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లు వాయిస్ కాలింగ్ మద్దతుతో వస్తాయి. అయితే ఇది వీక్ ఎండ్స్ లో అపరిమితంగా ఉంటుంది మరియు మిగిలిన రోజులలో పరిమితంగా ఉంటుంది. ఏదేమైనా అక్టోబర్ 27 మరియు 28 తేదీలలో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు భారతదేశం అంతటా ఏ నంబర్లకు అయినా అపరిమిత వాయిస్ కాల్స్ చేయవచ్చు.

బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్ వినియోగదారుల కోసం బిఎస్‌ఎన్‌ఎల్ అపరిమిత కాలింగ్ ఆఫర్‌

బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్ వినియోగదారుల కోసం బిఎస్‌ఎన్‌ఎల్ అపరిమిత కాలింగ్ ఆఫర్‌

బిఎస్ఎన్ఎల్ ఇటువంటి పండుగ ఆఫర్లను ప్రవేశపెట్టడం కొత్త కాదు ఇది ఇటువంటి వాటికి ప్రసిద్ది చెందింది. అలాగే ఈ దీపావళి 2019 కి కూడా తన కార్యాచరణను కొనసాగిస్తున్నది. పండుగ సందర్భాలలో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు పంచుకోవడానికి బిఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ కాలింగ్ సదుపాయం ఉత్తమమైన ఎంపిక. కాబట్టి శుభాకాంక్షలు సాధ్యమైనంత ఉత్తమమైన మాధ్యమం ద్వారా చేయాలి అని బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ శ్రీ వివేక్ బంజాల్ అన్నారు.

బ్రాడ్‌బ్యాండ్

బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ఇప్పుడు మరిన్ని పట్టణాలు మరియు గ్రామాలకు విస్తరించడం ద్వారా భారతదేశంలో భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవల కవరేజీని పెంచబోతున్నామని బిఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. మార్చి 2020 నాటికి దేశవ్యాప్తంగా భారత్ ఫైబర్ యొక్క కవరేజ్ మరింత పెరుగుతుందని కంపెనీ ధృవీకరించింది. బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే ప్రభుత్వం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పునరుజ్జీవన ప్యాకేజీని పొందింది. భారత్ ఫైబర్ సేవలను విస్తరించడంలో కంపెనీ కొంత మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు.

భారత్ ఫైబర్

భారత్ ఫైబర్ అనేది బిఎస్ఎన్ఎల్ యొక్క హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ పాన్-ఇండియా ప్రాతిపదికన లభిస్తుంది. కొత్త వినియోగదారుల కోసం భారత్ ఫైబర్ ప్లాన్ లు 777 రూపాయల నుండి ప్రారంభమై రూ.16,999 వరకు ఉంటాయి. 170GB వరకు రోజువారీ డేటా మరియు ఇతర OTT సర్వీస్ సుబ్స్క్రిప్షన్ లను అందిస్తాయి. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ప్రత్యేక హాట్స్టార్ ప్రణాళికలను కూడా ప్రవేశపెట్టింది. ఇది రూ.999 విలువైన హాట్స్టార్ యొక్క వార్షిక సభ్యత్వాన్ని అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తుంది. కస్టమర్లకు బండిల్ చేసిన ఎంటెర్టైనేమేంట్ సేవలను అందించడానికి కంటెంట్ సర్వీస్ ప్రొవైడర్లతో మరింత భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని చూస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ తెలిపింది.

అపరిమిత కాలింగ్ ఆఫర్‌

అపరిమిత కాలింగ్ ఆఫర్‌

బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో బిఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుత మార్కెట్ లీడర్‌గా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కంపెనీ 10 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. సంస్థ యొక్క కొన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలతో ల్యాండ్‌లైన్ సర్వీసును కూడా అందిస్తున్నది. ఇవి ఆఫర్స్ బిఎస్‌ఎన్‌ఎల్ మంచి మొత్తంలో చందాదారులకు అందిస్తున్నది. బిఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.99 నుంచి ప్రత్యేక ల్యాండ్‌లైన్ కాలింగ్ ప్లాన్‌లు ఉండగా, బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో కూడిన ల్యాండ్‌లైన్ సేవలను ఇది అందిస్తోంది.

బ్రాడ్‌బ్యాండ్

బిఎస్ఎన్ఎల్ నుండి భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లు ఈ ఉచిత వాయిస్ కాలింగ్ సర్వీస్ తో వస్తాయి. కాబట్టి బిఎస్‌ఎన్‌ఎల్ భారత్ ఫైబర్ లేదా నిర్దిష్ట బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఉన్న వినియోగదారులు ప్రతి రోజు రాత్రి 10:30 నుండి 6 గంటల వరకు అపరిమిత వాయిస్ కాల్‌లను ఆస్వాదించగలుగుతారు. ఆదివారాలలో అపరిమిత వాయిస్ కాలింగ్ ఎటువంటి పరిమితి లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ల్యాండ్‌లైన్ వినియోగదారుల కోసం వీక్ ఎండ్ రోజులలో కూడా అపరిమిత కాలింగ్‌ను అందించే అనేక ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి ఇది వారు ఎంచుకున్న ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది.

ట్రిపుల్ ప్లే ప్లాన్‌

ఇతర వార్తలలో వినియోగదారులకు ట్రిపుల్ ప్లే ప్లాన్‌లను అందించడానికి బిఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల YuppTV తో భాగస్వామ్యం చేసుకున్నది. YuppTV బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ కస్టమర్లను ఆన్‌లైన్‌లో లైవ్ టివి చూడటానికి అనుమతిస్తుంది. అలాగే ల్యాండ్‌లైన్ సర్వీస్ ద్వారా భారతదేశంలోని ఏదైనా మొబైల్ నంబర్‌కు వాయిస్ కాల్స్ చేయడానికి వీలు కల్పిస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ తన నెట్‌వర్క్‌లో ట్రిపుల్ ప్లే ప్లాన్‌ల ధరలను ఇంకా వెల్లడించలేదు.

Best Mobiles in India

English summary
BSNL Diwali Offer: Landline and Broadband Customers Can Make Unlimited Voice Calls for 2 Days
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X