Just In
- 4 min ago
ఆపిల్ ఎయిర్ ట్యాగ్ కు పోటీగా ఒప్పో సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్‌ట్యాగ్...
- 2 hrs ago
COVID-19 వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?
- 3 hrs ago
పాత Samsung ఫోన్లు ఉన్నాయా ...? అయితే Upcycling తో ఇలా కూడా వాడుకోవచ్చు.
- 4 hrs ago
2 నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్...
Don't Miss
- News
విషాదం: పుట్టినరోజు నాడే కరోనాకు బలి.. చిన్న వయసులోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి...
- Movies
శుక్ర మూవీ రివ్యూ అండ్ రేటింగ్
- Finance
బిట్ కాయిన్ క్రాష్: జోబిడెన్ 'ట్యాక్స్' ఎఫెక్ట్, క్రిప్టోకరెన్సీ పతనం
- Sports
ఒక మ్యాచ్..ఇద్దరు మలయాళీలు: ఒకరు ఆకాశానికి..మరొకరు పాతాళానికి: ఎందుకిలా?
- Lifestyle
కరోనా కాలంలో.. రెగ్యులర్ గా రొమాన్స్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా...
- Automobiles
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దేశం అంతటా 4G నెట్‌వర్క్ ను అందించే పనిలో BSNL
రాష్ట్ర నేతృత్వంలోని టెలికం ఆపరేటర్ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఇంకా వెనుకబడి ఉండడానికి కారణం దేశవ్యాప్తంగా 4G సైట్లు లేకపోవడం. ప్రభుత్వ నేతృత్వంలోని టెలికం ఆపరేటర్ ప్రైవేటు టెల్కోస్ కంటే వెనుకబడి ఉంది. అదే సమయంలో పరిశ్రమలో ఆర్థికంగా భారం పడుతున్న బ్యాలెన్స్ షీట్ ను కొంత కొంతగా తగ్గించుకుంటూ రావడం కూడా దాని ఇబ్బందులకు ప్రధాన కారణం.

ఇప్పుడు MTNL మరియు బిఎస్‌ఎన్‌ఎల్‌లు రెండు ఒకదానితో ఒకటి కలవడంతో పునరుద్ధరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. దీని వలన నెమ్మదిగా చాలా విషయాలు మారబోతున్నాయి. ప్రభుత్వం మరియు కొత్త వీఆర్ఎస్ పథకాలు మరియు ఇతర ప్రయత్నాల సహాయంతో బిఎస్ఎన్ఎల్ తిరిగి మళ్ళి అభివృద్ధి బాటలో ప్రయాణించాలని చూస్తున్నది.

ఇప్పుడు మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను మోహరించాలని ప్రయత్నిస్తోంది. పిటిఐ నివేదిక ప్రకారం బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారి ఒకరు దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయల వ్యయంతో సుమారు 60,000 4G మొబైల్ సైట్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు అని తెలిపారు. ఇదే కనుక అమలైతే కనుక దేశం అంతటా బిఎస్ఎన్ఎల్ యొక్క 4G ఉనికి భారీగా కలిగి ఉంటుంది.

దేశవ్యాప్తంగా బిఎస్‌ఎన్‌ఎల్ 4G సైట్‌లు
కేరళ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బిఎస్ఎన్ఎల్ 4G మొబైల్ సైట్లను ఇప్పటికే 10,000లకు పైగా ఏర్పాటు చేసింది. బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు ఈ సైట్లన్నింటినీ తక్కువ సమయంలో యాక్టివేట్ చేయాలని యోచిస్తోంది. టెల్కో ప్రభుత్వం నుండి పునరుద్ధరణ ప్యాకేజీని పొందకముందే బిఎస్ఎన్ఎల్ నెమ్మదిగా తన 3G స్పెక్ట్రంను 4G నెట్‌వర్క్‌లో రీఫార్మ్ చేయడం ద్వారా మార్చడానికి కృషి చేస్తోంది. టెల్కో ఇప్పటికే సుమారు 7,500 మొబైల్ సైట్‌లను ప్రారంభించింది. అలాగే 3G నెట్‌వర్క్‌ను దశలవారీగా ప్రాంతాలను బట్టి 4G మొబైల్ సైట్‌లను ప్రవేశపెట్టడం ద్వారా నెమ్మదిగా ఈ సైట్ల సంఖ్యను విస్తరించనున్నది. మొదటి దశలో భాగంగా బిఎస్‌ఎన్‌ఎల్ వచ్చే 12 నుంచి 15 నెలల్లో భారతదేశం అంతటా 4G సేవల కోసం 60,000 మొబైల్ సైట్‌లను విడుదల చేయనున్నట్లు బిఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ PK పూర్వర్ తెలిపారు. 4G ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఉన్న నగరాల్లో ఈ సైట్లు మొదటగా ఏర్పాటు చేయబడతాయని బిఎస్ఎన్ఎల్ తెలిపింది.

MTNL మరియు BSNL విలీనం
ప్రభుత్వ నేతృత్వంలోని రెండు వెనుకబడిన టెలికాం సంస్థలైన బిఎస్ఎన్ఎల్ మరియు MTNL కోసం పునరుద్ధరణ ప్యాకేజీని ప్రభుత్వం ఆమోదించింది. రెండు సంస్థలూ విలీనానికి సిద్దమైనాయి. ఇందులో భాగంగా వారు సావరిన్ బాండ్లలో రూ.15 వేల కోట్లు సమీకరించనున్నారు. ఈ మూలధన పెంపు రెండు సంస్థలకు వారి తక్షణ మూలధన అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. కానీ ఈ రెండు కంపెనీలు తమ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా పొందేది ఇది మాత్రమే కాదు. టెల్కోకు 4G స్పెక్ట్రం కూడా లభిస్తుంది. రూ.20,140 కోట్ల విలువైన వీఆర్ఎస్ ప్యాకేజీతో పాటు రూ.29,937 కోట్ల వస్తువుల మరియు సేవల పన్ను కోసం రూ.3,674 కోట్లతో రేడియో కేటాయింపును విధించబడుతుంది. ఎమ్‌టిఎన్‌ఎల్, బిఎస్‌ఎన్‌ఎల్ తమ 4G ప్లాన్‌లను కిక్‌స్టార్ట్ చేయడానికి కేవలం ఒక నెలలోపు తమకు 4G స్పెక్ట్రం లభిస్తుందని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాష్ తెలిపారు.

MTNL
అన్ని టెలికం ఆపరేటర్లలో బిఎస్ఎన్ఎల్ అతి తక్కువ రుణాన్ని కలిగి ఉంది. దాని క్యాపెక్స్కు నిధులు సమకూర్చడానికి బ్యాంకుల నుండి క్రెడిట్ కోరవచ్చని ప్రకాష్ తెలిపారు. 4G విషయానికొస్తే సంస్థ రెండు నెలల్లో 4G నెట్‌వర్క్ కోసం టెండర్ లభిస్తుందని చెప్పారు. అక్టోబర్ 2018 నుండి జూలై 2019 వరకు చందాదారులను చేర్చుకున్న సంస్థలు రిలయన్స్ జియోతో పాటు బిఎస్ఎన్ఎల్ మాత్రమే కావడం గమనార్హం.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999